Ajith Kumar: సర్జరీ తర్వాత మళ్లీ బైక్ రైడ్ చేసిన స్టార్ హీరో.. స్నేహితులకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన అజిత్..

|

Mar 21, 2024 | 2:40 PM

అజిత్‏కు బైక్, ఫ్లైట్ నడపడం అంటే చాలా ఇష్టం. అలాగే ట్రావెలింగ్ అంటే మక్కువ ఎక్కువే. బైక్ పై తనకు నచ్చిన ప్రాంతాలను చుట్టేస్తుంటాడు. ప్రొఫెషనల్ రేసింగ్‏లో పాల్గొని అంతర్జాతీయ స్థాయిలోనూ గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే ఇటు సినిమాలపై ఫోకస్ కూడా పెడుతుంటారు. ఇటీవలే కొన్ని రోజుల క్రితం నరాల వాపుకు చికిత్స కోసం ఆసుపత్రిలో చేరారు అజిత్.

Ajith Kumar: సర్జరీ తర్వాత మళ్లీ బైక్ రైడ్ చేసిన స్టార్ హీరో.. స్నేహితులకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన అజిత్..
Ajith Kumar
Follow us on

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్‎కు తెలుగులోనూ మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన నటించిన ఎన్నో చిత్రాలు తెలుగులోకి డబ్ అయి సూపర్ హిట్ అయ్యాయి. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరితో అజిత్ స్టైల్.. లైఫ్ స్టైల్ చాలా డిఫరెంట్. సోషల్ మీడియా ప్రపంచంతో జనాలందరూ ముందుకు వెళ్తుంటే.. అజిత్ మాత్రం ఫోన్‏కు దూరంగా ఉంటారు. ఇప్పటివరకు ఆయనకు సంబంధించి ఎలాంటి సోషల్ మీడియా ఖాతాలు లేవు. అలాగే షూటింగ్ నుంచి బ్రేక్ దొరికితే బైక్ రైడింగ్ చేస్తూ దేశాన్ని చుట్టేస్తాడు. అజిత్‏కు బైక్, ఫ్లైట్ నడపడం అంటే చాలా ఇష్టం. అలాగే ట్రావెలింగ్ అంటే మక్కువ ఎక్కువే. బైక్ పై తనకు నచ్చిన ప్రాంతాలను చుట్టేస్తుంటాడు. ప్రొఫెషనల్ రేసింగ్‏లో పాల్గొని అంతర్జాతీయ స్థాయిలోనూ గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే ఇటు సినిమాలపై ఫోకస్ కూడా పెడుతుంటారు. ఇటీవలే కొన్ని రోజుల క్రితం నరాల వాపుకు చికిత్స కోసం ఆసుపత్రిలో చేరారు అజిత్.

నరాల వాపుకు చికిత్స చేయడానికి సర్జరీ జరగడంతో కొద్ది రోజులుగా విశ్రాంతి తీసుకున్నారు అజిత్. ఇక ఇప్పుడు ఆయన తిరిగి తన బైక్ రైడింగ్ స్టార్ట్ చేశారు. అజిత్ బైక్ రైడింగ్ కు సంబంధించిన ఫోటోలను ఆయన మేనేజర్ సురేష్ చంద్ర సోషల్ మీడియాలో పంచుకున్నారు. అజిత్ తిరిగి ట్రాక్ లోకి వచ్చారంటూ ట్వీట్ చేశారు. ఫిట్ అండ్ ఎజైల్.. ఎక్ బ్యాక్ ఆన్ ట్రాక్ అంటూ అజిత్ కుర్జీపై విశ్రాంతి తీసుకుంటున్న ఫోటోను అభిమానులతో పంచుకున్నాడు. చాలా కాలం తర్వాత తిరిగి తన స్నేహితులతో కలిసి బైక్ రైడ్ కు వెళ్లారు. అక్కడ వారి కోసం ప్రత్యేకంగా బిర్యానీ కూడా చేశాడు. స్నేహితులతో కలిసి తన ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోస్, ఫోటోస్ వైరల్ అవుతున్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే.. అజిత్ చివరిసారిగా తెగింపు చిత్రంలో కనిపించారు. ఇక ప్రస్తుతం మగిజ్ తిరుమేని దర్శకత్వం వహిస్తోన్న విదాముయార్చి చిత్రంలో నటిస్తున్నారు. ఆ తర్వాత అధిక్ రవిచంద్రన్ తో సినిమా చేయనున్నారు. ఇప్పటికే నేపాల్, భూటాన్, థాయ్ లాండ్, ఆస్ట్రేలియా, యూరప్ ప్రాంతాల్లో బైక్ రైడ్ చేశాడు అజిత్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.