
సినీ నటి వనిత విజయకుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అమ్మడు సినిమాలకంటే వివాదాలతోనే ఎక్కువ పాపులర్ అయ్యింది. కాగా ఈ అమ్మడు స్టార్ హీరోయిన్స్ తోనూ వివాదాలు పెట్టుకుంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన కెరీర్‌లో ఎదుర్కొన్న కొన్ని వివాదాలపై, ముఖ్యంగా నయనతార, రమ్యకృష్ణన్‌లతో తలెత్తిన సమస్యలపై క్లారిటీ ఇచ్చింది. అదే సమయంలో, తెలుగు చిత్ర పరిశ్రమలో మళ్ళీ పెళ్లి సినిమాతో తనకు కలిగిన మధురానుభూతిని కూడా పంచుకుంది. వనిత విజయకుమార్ తనపై నయనతారతో వివాదం ఉందన్న వార్తలను తీవ్రంగా ఖండించారు. “నయనతారతో నాకు ఎటువంటి సమస్య లేదు. ఆమె ఒక అచీవర్, నిజంగా సూపర్ స్టార్. నేను ఎప్పుడూ ఆమెకు వ్యతిరేకంగా మాట్లాడలేదు. నిజానికి, నా ఇన్‌స్టాగ్రామ్‌లో నేను ఎల్లప్పుడూ ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతాను, ఆమె వివాహానికి అభినందనలు తెలియజేశాను.
నయన్ చాలా ధైర్యవంతురాలు, దృఢమైన వ్యక్తి. నేను ఆమెను గౌరవిస్తాను. ప్రజలు విషయాలను వక్రీకరించడానికి ప్రయత్నిస్తారు అంతే” అని చెప్పుకొచ్చింది.. నయనతార భర్త విఘ్నేష్ శివన్‌తో తాను ఇప్పటికీ టచ్‌లో ఉన్నానని, ఆయనపై తనకు చాలా గౌరవం ఉందని తెలిపింది వనిత. నయనతారకు పిల్లలు పుట్టినప్పుడు కూడా తాను అభినందించినట్లు, ఇద్దరి మధ్య ఎటువంటి వివాదం లేదని మరోసారి స్పష్టం చేశారు. ప్రభుదేవాతో నయనతార సంబంధం ఉన్నప్పుడు తాను ఆమెను తప్పుగా మాట్లాడానన్న ఆరోపణలను కూడా వనిత ఖండించారు, అలాంటి మాటలు తాను ఎప్పుడూ అనలేదని పేర్కొన్నారు. అలాగే
రమ్యకృష్ణన్‌తో గతంలో జరిగిన సంఘటనపై వనిత విజయకుమార్ స్పందిస్తూ, అది వ్యక్తిగత విరోధం కాదని, కేవలం వృత్తిపరమైన ఈగో సమస్య మాత్రమేనని వివరించారు. “నేను రమ్యకృష్ణన్‌తో కలిసి పనిచేశాను. ఆ రోజు ఛానెల్ నాకు ఇచ్చిన ప్రామిస్ ఒకటి, అక్కడ జరుగుతున్నది మరొకటి. నేను బిగ్ బాస్ కంటెస్టెంట్‌ని మాత్రమే కాదు. నేను ఒక ఫిల్మ్ స్టార్‌ని, ఫిల్మ్ స్టార్ కూతురుని, ఫిల్మ్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చాను. నేను హీరోయిన్‌గా నటించాను, ఇప్పటికీ నటిస్తున్నాను. ఒక వ్యక్తిని ఇంకొకరితో పోల్చి జడ్జ్ చేసిన విధానం నాకు నచ్చలేదు. అలాగే నా మీద అరవడం కరెక్ట్ కాదు. వివిధ వయసుల వ్యక్తులను పోల్చడం తప్పు. 40 ఏళ్ల నేను 16 ఏళ్ల వ్యక్తి చేసే ప్రదర్శనను చేయలేను, అలాగే 60 ఏళ్ల వ్యక్తి నా ప్రదర్శనను చేయలేరు” అని వనిత అన్నారు. ఆ రోజు తాను షో నుంచి బయటకు రావడానికి ఛానెల్ తీరే కారణమని, కానీ రమ్యకృష్ణన్‌పై తనకు ఎటువంటి ద్వేషం లేదని తెలిపారు. “ఆమెను ఒక ఫిల్మ్ ఆర్టిస్ట్‌గా, ఒక అందమైన, గొప్ప నటిగా నేను గౌరవిస్తాను. వ్యక్తిగతంగా చిన్నప్పటి నుండి నాకు ఆమె తెలుసు. కాబట్టి వ్యక్తిగతంగా నాకు ఆమెతో ఎటువంటి సమస్య లేదు. వృత్తిపరంగా అక్కడ జరిగిన సంఘటనలో ఆమె స్పందన నాకు నచ్చలేదు, అందుకే నేను బయటకు వచ్చాను. కానీ నేను ద్వేషాలను మనసులో పెట్టుకోను” అని వనిత చెప్పుకొచ్చింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి