
సినిమా హీరోయిన్స్ చాలా మంది సోషల్ మీడియాతో ఎక్కువ పాపులర్ అవుతుంటారు. సినిమాలతో కంటే సోషల్ మీడియా ద్వారానే అభిమానులకు టచ్ లో ఉంటారు. మాములుగానే సినీ సెలబ్రెటీలకు క్రేజ్ ఉంటుంది. సోషల్ మీడియాలో ఆ క్రేజ్ డబుల్ ఉంటుంది. అయితే హీరోయిన్స్ కేవలం సినిమాలతోనే కాదు సోషల్ మీడియాతోనూ గట్టిగానే సంపాదిస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఇన్ స్టా గ్రామ్ సబ్ స్క్రిప్షన్ కూడా వచ్చింది. చాలా మంది పైసలు కట్టి ఎక్స్ క్లూజివ్ కంటెంట్ చూడండి అంటూ నెటిజన్స్ కు ఆఫర్స్ ఇస్తున్నారు. ఇదిలా ఉంటే ఓ ముద్దుగుమ్మ కేవలం ఇన్ స్టా గ్రామ్ తోనే లక్షలు సంపాదిస్తుంది. ఈ ముద్దుగుమ్మ చేసిన సినిమాలన్నీ దాదాపు నిరాశపరిచాయి కానీ ఆమె క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. వరుసగా ఆఫర్స్ అందుకుంటూ దూసుకుపోతుంది. సినిమాలతో పాటు ఇప్పుడు సోషల్ మీడియాతోనూ లక్షలు సంపాదిస్తుంది ఆ అమ్మడు. ఇంతకూ ఆమె ఎవరంటే..
ఇది కూడా చదవండి : ఇదెక్కడి రొమాంటిక్ మూవీరా మావ..! సిటీలో భర్త ఉద్యోగం.. ఊర్లో మరొకరితో భార్య.. కట్ చేస్తే ఊహించని ట్విస్ట్‌లు
చాలా మంది సోషల్ మీడియా బ్రాండ్ ప్రమోషన్స్ తో కోట్లల్లో సంపాదిస్తున్నారు. వారిలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. ఈ అమ్మడు ఇన్‌స్టాగ్రామ్ ద్వారానే ప్రతి నెలా 30 నుంచి 50 లక్షల రూపాయల సంపాదిస్తుంది. ఆమె మరెవరో కాదు యంగ్ బ్యూటీ శ్రీలీల. ఈ చిన్నదాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన శ్రీలీల తెలుగులో తక్కువ సమయంలోనే పాపులర్ అయ్యింది.
ఇది కూడా చదవండి : ఒకే ఒక్క సినిమాతో క్రేజ్.. స్టార్ హీరోయిన్ అవుతుందనుకుంటే కనిపించకుండా పోయింది..!
వరుస సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నపటికీ ఈ చిన్నదానికి సాలిడ్ హిట్ మాత్రం రాలేదు. అప్పుడెప్పుడో వచ్చిన ధమాకా, భగవంత్ కేసరి సినిమాలు తప్ప ఈ అమ్మడి ఖాతాలో పెద్దగా హిట్స్ లేవు. తెలుగులోనే కాదు తమిళ్, హిందీలోనూ అదృష్టం పరీక్షించుకుంటుంది ఈ చిన్నది. ఇప్పటికే తమిళ్ లో ఓ సినిమా చేసింది కానీ ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. ఇప్పుడు హిందీలో ఓ సినిమా చేస్తుంది. ఇదిలా ఉంటే శ్రీలీల సినిమాతో పాటు సోషల్ మీడియాతోనూ గట్టిగానే సంపాదిస్తుంది. ఈ అమ్మడి ఇన్ స్టాలో 17 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇన్ స్టాలో శ్రీలీల బ్రాండ్ ప్రమోషన్స్ చేస్తుంది. ఈ ప్రమోషన్స్ తో రోజుకు రూ. 5 లక్షల నుంచి రూ. 10లక్షల వరకు అందుకుంటుంది. ఇలా నెలకు రూ. 30లక్షల నుంచి రూ. 50 లక్షల వరకు సంపాదిస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి