Sai Pallavi: జీవితంలో ఒక మనిషిని ఇలా ఎవరైనా ప్రేమించగలరా..? సాయి పల్లవి ఆసక్తికర కామెంట్స్.

|

Oct 09, 2024 | 3:47 PM

ప్రస్తుతం ఈ సినిమా ఇంట్రడక్షన్ వీడియోను చిత్రబృందం ఇంటర్నెట్‌లో పోస్ట్ చేస్తోంది. ఈ కథలో నేను నటించడం అదృష్టంగా భావిస్తున్నాను.. అలాగే ఆమెలాగా నేను ప్రేమించగలనని ఈ కథ తర్వాతే తెలుగుసుకున్నాను. ఈ పాత్రను పోషించడం చాలా సంతోషంగా ఉంది” అని చెప్పుకొచ్చింది సాయి పల్లవి.

Sai Pallavi: జీవితంలో ఒక మనిషిని ఇలా ఎవరైనా ప్రేమించగలరా..? సాయి పల్లవి ఆసక్తికర కామెంట్స్.
Sai Pallavi
Follow us on

కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం అమరన్. దివంగత మాజీ సైనికుడు మేజర్ ముకుంద్ వరదరాజన్ సైనిక జీవితం.. పర్సనల్ లైఫ్ చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. ప్రముఖ దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నటుడు కమల్ హాసన్ నిర్మాణ సంస్థ “రాజ్‌కమల్ ఫిల్మ్స్” నిర్మించింది. ప్రస్తుతం ఈ సినిమా ఇంట్రడక్షన్ వీడియోను చిత్రబృందం ఇంటర్నెట్‌లో పోస్ట్ చేస్తోంది. ఈ కథలో నేను నటించడం అదృష్టంగా భావిస్తున్నాను.. అలాగే ఆమెలాగా నేను ప్రేమించగలనని ఈ కథ తర్వాతే తెలుగుసుకున్నాను. ఈ పాత్రను పోషించడం చాలా సంతోషంగా ఉంది” అని చెప్పుకొచ్చింది సాయి పల్లవి.

సాయి పల్లవి మాట్లాడుతూ.. “నేను ఎప్పుడూ సినిమా కథ వినను, స్క్రిప్ట్ మాత్రమే చదువుతాను. అలాగే పెద్ద నటీనటులతో నటిస్తున్నప్పుడు ఈ కథపై నాకు చాలా సందేహాలు వచ్చాయి, అప్పుడు డైరెక్టర్‌ని కథ గురించి అడిగాను కమర్షియల్ సినిమాలు పెద్ద హీరోలతో కలిసి చేస్తే చాలా కంటెంట్ ఉంటుంది. కాబట్టి స్క్రిప్టులో కొన్ని సన్నివేశాలు కట్ చేస్తారని అనుకున్నాను. ఈ విషయాన్ని దర్శకుడికి కూడా చెప్పాను. అతడితో మాట్లాడను. ఈ కథపై నాకు పూర్తిగా క్లారిటీ వచ్చాకే ఈ మూవీ వదులుకోవద్దని అనుకున్నాను. ఈ సినిమా కోసం ఎన్ని త్యాగాలు అయినా చేయాల్సిందే అనిపించింది. ఒక మనిషి కోసం జీవితాన్ని త్యాగం చేయడం సాధ్యమేనా.. నిజంగా జీవితంలో ఆ వ్యక్తిని ఇలా ప్రేమించగలరా అని ఈ కథ చదివాక అనిపించింది. కొన్ని సందర్భాల్లో అవేమిటో అర్థంచేసుకున్నాను ” అంటూ చెప్పుకొచ్చింది.

ఈ చిత్రం షూటింగ్ 2023లో ప్రారంభమైం.. ప్రధానంగా కాశ్మీర్, చెన్నై, పుదుచ్చేరి వంటి లొకేషన్లలో జరుగుతుంది. ఈ సినిమా నుండి నటి సాయి పల్లవి సినిమా తొలి వీడియోను చిత్ర బృందం గత నెలలో విడుదల చేసింది. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు జివి ప్రకాష్ సంగీతం అందించారు. గత వారం విడుదలైన అతని పాట “హే మిన్నెలే” ప్రస్తుతం ఇంటర్నెట్‌లో ట్రెండింగ్ పాటలలో అగ్రస్థానంలో ఉంది. దీని తర్వాత, ఇప్పుడు ఈ సినిమా ఇంట్రడక్షన్ వీడియో విడుదలైంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.