
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కొన్ని రోజుల క్రితమే పెళ్లిపీటలెక్కారు. ఫిబ్రవరి 26న రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్ లో వీరి వివాహం అట్టహాసంగా జరిగింది. ఆ తర్వాత హైదరాబాద్ లోనూ గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్ కూడా ఏర్పాటు చేశారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రముఖులతో పాటు పలువురు రాజకీయ నాయకులు విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్ కు హాజరయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉంటే ఆదివారం (మార్చి 15) విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ పుట్టిన రోజు వేడుకలు ఘనంగాజరిగాయి. పలువురు సినీ ప్రముఖులతో పాటు అభిమానులు, నెటిజన్లు ఆనంద్ కు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఇదిలా ఉంటే తన పుట్టిన రోజు సందర్భంగా ఆనంద్ సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు షేర్ చేశాడు. అందులో తన సోదరుడు విజయ్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ వివిధ సందర్భాల్లో దిగిన ఫొటోలు ఉన్నాయి. అలాగే వదిన రష్మికతో కొన్ని క్యూట్ మూమెంట్స్ ను కూడా పంచుకున్నాడు. ఇప్పుడీ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఎందుకంటే ఈ ఫొటోల్లో రష్మిక మందన్న కాలుకు కట్టుతో (ఫ్రాక్చర్) కనిపిస్తోంది. ఆమె కుడి చేతి కాలుకు గాయమైనట్లు తెలుస్తోంది. అందుకే బ్యాండేజ్ కట్టినట్లు తెలుస్తోంది.
రష్మిక ఫొటోలను చూసిన నెటిజన్లు ఆమెకు ఏమైందోనని ఆందోళన చెందుతున్నారు. కొత్త కోడలికి ఏమైంది? అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. కాగా గతేడాది కూడా రష్మిక కాలుకు తీవ్రమైన గాయమైంది. ఆ సమయంలో ఆమె చాలా రోజుల పాటు ఇంటికే పరిమితమైంది. అయితే ఆనంద్ దేవరకొండ షేర్ చేసిన ఈ ఫొటో లేటెస్ట్ దా? లేక పాతతా? అన్నది క్లారిటీ రావడం లేదు.
Brotherly love on display as #VijayDeverakonda wishes #AnandDeverakonda with sweet glimpses!🤗❤️#HBDAnandDeverakonda #TeluguFilmNagar pic.twitter.com/aLgjWeITl7
— Telugu FilmNagar (@telugufilmnagar) March 15, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.