కెరీర్ పీక్‌లో ఉండగానే ఆ హీరోతో ప్రేమాయణం.. అసలు విషయం చెప్పిన నటి ప్రేమ

తెలుగు సినీప్రియులకు హీరోయిన్ ప్రేమ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం వంటి భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. మొదట్లో నటనా రంగంపై పెద్దగా ఆసక్తి లేకపోయినా, తల్లి ప్రోత్సాహంతో రంగ ప్రవేశం చేసిన ఆమె.. అద్భుతమైన నటనతో కట్టిపడేశారు.

కెరీర్ పీక్‌లో ఉండగానే ఆ హీరోతో ప్రేమాయణం.. అసలు విషయం చెప్పిన నటి ప్రేమ
Prema

Updated on: Apr 27, 2026 | 9:48 AM

నటి ప్రేమ గుర్తున్నారా.. తెలుగులో క్రేజీ సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించారు. ఆమె నటించిన దేవి సినిమాను ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులు ఎవ్వరూ మర్చిపోలేరు. గతంలో వరుసగా సినిమాలు చేసిన ప్రేమ ఇప్పుడు సినిమాలు తగ్గించారు. తెలుగుతో పాటు తమిళ్, కన్నడలోనూ సినిమాలు చేసి మెప్పించారు ప్రేమ. హీరోయిన్ గానే కాదు నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లోను ఆకట్టుకున్నారు ప్రేమ. కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో ప్రేమ మాట్లాడుతూ.. కెరీర్, వ్యక్తిగత జీవితం, పరిశ్రమలో అనుభవాలను పంచుకున్నారు. అలాగే ఓ హీరోతో ప్రేమాయణం అంటూ వచ్చిన రూమర్స్ పై కూడా ప్రేమ స్పందించారు.

ఇది కూడా చదవండి :ఎంత బాగుంది మావ ఈ సాంగ్..! లవర్స్ తెగ పాడుకున్న పాట.. ఒక్కసారి వింటే మళ్లీ మళ్లీ వినాల్సిందే

తన సినీ కెరీర్ గురించి మాట్లాడుతూ, తెలుగులో ఇప్పుడు వస్తున్న తల్లి లేదా అక్క పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత ఉండడం లేదని ప్రేమ అభిప్రాయపడ్డారు. తాను సవాలుతో కూడిన పాత్రలను మాత్రమే కోరుకుంటున్నానని స్పష్టం చేశారు. కేవలం చిన్న పాత్రలకు ప్రాధాన్యత లేకపోతే వాటిని అంగీకరించనని, ఫోన్‌లోనే నేను చేయను అని ఓపెన్‌గా చెప్పేస్తానని ఆమె అన్నారు. బాహుబలిలో రమ్యకృష్ణ చేసిన శివగామి వంటి పాత్రలను కాపీ చేయాలని తాను కోరుకోవడం లేదని, అయితే దర్శకులకు “ప్రేమ ఈ పాత్రను చేయగలదు” అనే నమ్మకం కలిగించే క్యారెక్టర్లను చేస్తానని చెప్పారు. కన్నడ చిత్ర పరిశ్రమలో కూడా తనకు ఆఫర్లు వస్తున్నాయని తెలిపారు.

ఇది కూడా చదవండి :Nagarjuna: ఇండస్ట్రీలో నాగార్జున అన్నయ్య అని పిలిచే ఏకైక నటుడు ఎవరో తెలుసా.?

ప్రముఖ నటుడు ఉపేంద్రతో ఆమెకు సంబంధం ఉందంటూ ఒకప్పుడు వచ్చిన వదంతులపై ప్రేమా స్పష్టమైన వివరణ ఇచ్చారు. కెరీర్ పీక్ లో ఉన్నప్పుడు ప్రేమ , ఉపేంద్ర ప్రేమలో ఉన్నారు అంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. వాటిపై స్పందిస్తూ.. అటువంటి వార్తలు ఎవరు సృష్టించారో తనకు తెలియదని, గాసిప్‌లకు తాను అస్సలు ప్రాధాన్యత ఇవ్వనని ఆమె తెలిపారు. ఉపేంద్ర గానీ, తాను గానీ ఎప్పుడూ ఈ విషయమై చర్చించుకోలేదని ప్రేమ పేర్కొన్నారు. “నా దృష్టి, నా ఫోకస్ నా పని మీదే,” అని ఆమె బలంగా చెప్పారు. పీక్ స్టేజ్‌లో ఇలాంటి వదంతులు సాధారణమేనని, విజయం సాధించినప్పుడు విమర్శలను కూడా స్వీకరించాలని ఆమె అన్నారు. విమర్శలను ఎలా ఎదుర్కొంటారనే ప్రశ్నకు, తాను వాటిని ఒక సవాలుగా తీసుకుంటానని ప్రేమ చెప్పారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : స్టార్ హీరోని పెట్టి సినిమా చేశా.. కానీ పక్కా ఫ్లాప్ అవుతుందని అప్పడే తెలిసిపోయింది..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us