
హీరోయిన్స్ గా రాణించి ఆతర్వాత సైలెంట్ అయిన ముద్దుగుమ్మలు మన దగ్గర చాలా మంది ఉన్నారు. హీరోయిన్స్ గా మెప్పించి.. ఆతర్వాత అవకాశాలు తగ్గి స్పెషల్ సాంగ్ లో మెరుస్తున్న భామలు చాలా మందే ఉన్నారు టాలీవుడ్ లో .. అలాగే ఓవర్ నైట్ లో స్టార్ డమ్ తెచ్చుకున్న ముద్దుగుమ్మలు కూడా ఉన్నారు మన దగ్గర.. ఇక చాలా మంది స్టార్ హీరోయిన్స్ ఓ వైపు మెయిన్ లీడ్ గా సినిమాలు చేస్తూనే ఛాన్స్ దొరికితే స్పెషల్ సాంగ్స్ లోనూ అదరగొడుతున్నారు. సమంత, తమన్నా, శ్రీలీల ఇలా చాలా మంది హీరోయిన్స్ స్పెషల్ సాంగ్స్ లోనూ మెరుస్తున్నారు. ఇప్పుడు మరో ముద్దుగుమ్మ కూడా స్పెషల్ సాంగ్ తో అదరగొట్టనుంది. అది కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో ఇంతకూ ఆ వయ్యారి భామ ఎవరో తెలుసా.?
ఆమె ఎవరో కాదు టాలీవుడ్ సినీ ప్రియులకు సుపరిచతమైన రాధిక అలియాస్ నేహా శెట్టి. యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ నటించిన డిజే టిల్లు సినిమాతో ఒక్కసారిగా గ్లామర్ క్రేజ్ సంపాదించుకుంది హీరోయిన్ నేహా శెట్టి. ఈ సినిమాతో నేహాకు తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఈ సినిమా తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో నేహాకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. మెహబూబా సినిమాతో పరిచయమైన నేహా డిజే టిల్లు సినిమాతో పాపులర్ అయ్యింది. ఆతర్వాత ఈ అమ్మడి పేరు మారుమ్రోగింది.
కానీ ఈ అమ్మడు అంతగా అవకాశాలు మాత్రం అందుకోలేక పోయింది. ఆతర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసిన ఈ చిన్నదానికి అంతగా క్రేజ్ రాలేదు. దాంతో మెల్లగా ఈ బ్యూటీకి ఆఫర్స్ తగ్గాయి. దాంతో సోషల్ మీడియాలో ఎక్కవగా కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ చిన్నది. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తుందని తెలుస్తుంది. వరుస ఫ్లాప్స్ లో ఉన్న నేహాకు పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాలో స్పెషల్ సాంగ్ ఎంతవరకు కలిసిస్తుందో చూడాలి.
వర్త్ వర్మ వర్త్..! అప్పుడు క్యూట్ హీరోయిన్.. ఇప్పుడు హాట్ బ్యూటీ.. 42ఏళ్ల వయసులోనూ
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి