Meena: ఆ హీరో అంటే క్రష్‌.. అతని పెళ్లి రోజున నా మనసు విరిగిపోయింది.. మీనా కామెంట్స్‌ వైరల్‌

|

Mar 14, 2023 | 5:02 PM

మీనా.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేనిపేరు. ఛైల్డ్‌ ఆర్టిస్టుగా మొదలెట్టి స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. దక్షిణాది భాషల్లో అగ్రనటిగా స్టార్‌ స్టేటస్‌ సొంతం చేసుకుంది

Meena: ఆ హీరో  అంటే క్రష్‌.. అతని పెళ్లి రోజున నా మనసు విరిగిపోయింది.. మీనా  కామెంట్స్‌ వైరల్‌
Meena
Follow us on

మీనా.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేనిపేరు. ఛైల్డ్‌ ఆర్టిస్టుగా మొదలెట్టి స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. దక్షిణాది భాషల్లో అగ్రనటిగా స్టార్‌ స్టేటస్‌ సొంతం చేసుకుంది. దాదాపు స్టార్‌ హీరోలందరితోనూ స్ర్కీన్‌ షేర్‌ చేసుకుంది. సినిమా కెరీర్‌ పీక్‌ స్టేజ్‌లో ఉండగానే వ్యాపారవేత్త విద్యా సాగర్‌ను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత నైకికా అనే పాపకు జన్మనిచ్చింది. ఇక సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, కీ రోల్స్‌లోనూ నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇలా సినిమాలను, ఫ్యామిలీని సమ ప్రాధాన్యమిస్తూ ముందుకు సాగుతున్న క్రమంలో.. మీనా జీవితంలో అనుకోని విషాదం చోటు చేసుకుంది. గతేడాది జూన్‌లో మీనా భార్త అనారోగ్యంతో కన్ను మూశారు. ఈ విషాదం నుంచి కోలుకునేందుకు ఆమెకు చాలా సమయం పట్టింది. ఇందుకోసం సినిమాలతో పాటు సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా మారింది. ఫొటోలు, వీడియోలు షేర్‌ చేస్తోంది. ఇదిలా ఉంటే మీనా
ఇంటర్వ్యూకు హాజరైంది. ఇందులో భాగంగా తన సినిమా కెరీర్‌, వ్యక్తిగత జీవితానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.

ఇందులో భాగంగా బాలీవుడ్‌ గ్రీక్‌ హీరో హృతిక్‌ రోషన్‌ మీద క్రష్‌ ఉండేదట. అంతేకాదు అలాంటి అబ్బాయినే పెళ్లి చేసుకుంటానని వాళ్ల అమ్మతో కూడా చెప్పిందట. అదే కాకుండా హృతిక్‌ పెళ్లి రోజున తన మనసు విరిగిపోయిందంటూ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చింది. కాగా గతేడాది మోహన్ బాబు నటించిన ‘సన్ ఆఫ్ ఇండియా’లో కీలక పాత్ర పోషించింది మీనా. అలాగే మోహన్‌ లాల్‌ సరసన బ్రోడాడీలోనూ కనిపించింది. అలాగూ ఈ ఏడాది ఆర్గానిక్‌ మామ హైబ్రిక్‌ అల్లుడు అనే సినిమాలో రాజేంద్రప్రసాద్‌ సరసన నటించింది. ఇక మీనా కూతురు నైనిక కూడా ఇప్పటికే చైల్డ్‌ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చింది. విజయ్‌ హీరోగా నటించిన పోలీసోడు మూవీలో తన నటనతో ఆకట్టుకుంది.

ఇవి కూడా చదవండి

Actress Meena

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం  క్లిక్ చేయండి..