AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆవిడ వల్లే నాకు మా ఇంటి బంగారం సినిమాలో ఛాన్స్ వచ్చింది.. టీవీ9తో మంజూష ముచ్చట్లు

స్టార్ హీరోయిన్ సమంత నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మా ఇంటి బంగారం. నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. మా ఇంటి బంగారం సినిమాతో చాలా కాలం తర్వాత సమంత సాలిడ్ హిట్ అందుకున్నారు.

ఆవిడ వల్లే నాకు మా ఇంటి బంగారం సినిమాలో ఛాన్స్ వచ్చింది.. టీవీ9తో మంజూష ముచ్చట్లు
Maa Inti Bangaram
Rajeev Rayala
|

Updated on: Jul 04, 2026 | 4:32 PM

Share

“మా ఇంటి బంగారం” చిత్రంలో కిరణ్మయి (మంజూష) పాత్రను పోషించిన నటి మంజూష అందరి ప్రశంసలు అందుకున్నారు. సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ అభిమానులను సొంతం చేసుకున్న మంజూష మా ఇంటి బంగారం సినిమాలో అద్భుతంగా నటించి మెప్పించారు. సోషల్ మీడియాలో ముఖ్యంగా ఇన్ స్టా గ్రామ్ లో రీల్స్ చేస్తూ పాపులర్ అయ్యారు మంజూష. అలనాటి నటీమణులు నిర్మలమ్మ, సూర్యకాంతం రీల్స్ తో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు మంజూష. తాజాగా మంజూష టీవీ9కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ప్రస్తుతం థియేటర్లలో “మా ఇంటి బంగారం” సినిమాకు అద్భుతమైన స్పందన వస్తుంది. కలెక్షన్స్ చాలా బాగున్నాయని.. మొత్తంగా మా ఇంటిబంగారం బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా ఇప్పటికే 50 కోట్ల మార్కును దాటిందని, 100 కోట్ల క్లబ్‌ వైపు దూసుకుపోతుంది. అలాగే ఓవర్సీస్ (విదేశాల) లో కూడా ఈ సినిమాకు భారీ రెస్పాన్స్ వస్తుంది, అక్కడే ఉంటున్న మంజూషకు ఫ్రెండ్స్, ఫ్యామిలీతో పాటు తెలియని వాళ్ళు కూడా ఫోన్ చేసి, మెసేజ్ చేసి సినిమా చాలా బాగుందని అభినందిస్తున్నారని మంజూష తెలిపారు.

ఇది కూడా చదవండి : Hema : అమ్మబాబోయ్.. హేమ కూతుర్ని చూశారా..!! స్టార్ హీరోయిన్స్ కూడా పనికిరారు

ఈ సినిమా ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని, పెద్దలు, పిల్లలు అందరూ కలిసి చూసి ఆనందించేలా ఉంటుందని ఆమె వివరించారు. సినిమాలో ప్రతి ఒక్క పాత్ర, చివరికి చిన్న పిల్లలు కూడా చాలా క్యూట్‌గా నటించి ఎంటర్‌టైన్ చేస్తారని తెలిపారు. ఈ చిత్రం ముఖ్యంగా మహిళల శక్తిని (ఉమెన్ పవర్) చాటిచెబుతుందని, సినిమాలో “మహాలక్ష్మి కావక్కర్లేదు ఇంటికి కాళికా మాత కూడా దేవతే” అనే డైలాగ్ మహిళలకు బాగా కనెక్ట్ అవుతుందని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి : Pawan Kalyan: డిజాస్టర్ బ్యూటీకి బంపర్ ఆఫర్.. పవన్ కళ్యాణ్ సినిమాలో ఆ స్టార్ హీరోయిన్

అదే సమయంలో పురుషులను తక్కువ చేసి చూపించలేదని, మహిళలకు ఎంతో సపోర్ట్‌గా ఉండే భర్త, మామగారు ఎలా ఉండాలో చూపించారని, ప్రతి ఆడపిల్ల తనకు కూడా అలాంటి కుటుంబమే కావాలని కోరుకునేలా సినిమా ఉంటుందని మంజూష అన్నారు. చివరగా, సినిమాను ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుతూ, ఇంకా చూడని వారు ఉంటే తప్పకుండా థియేటర్లలో చూడాలని ఆమె కోరారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : 9 సినిమాలు.. 5 హిట్లు..! టాలీవుడ్‌లో దుమ్మురేపుతున్న ముద్దుగుమ్మ.. బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్

( మరిన్ని విషయాల కోసం ఈ కింది వీడియో చూడండి.. )

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us