Manju Warrier: ఆమె అందం చూసి కాలమే ఆగిపోయిందేమో.. చీరకట్టులో మంజు మంత్రముగ్దులను చేస్తోందిగా..

|

Aug 19, 2023 | 5:43 PM

పింక్ షిఫాన్ సారీలో అందమే అద్భుతమైనట్లుగా కనిపిస్తోంది మంజు. అలాగే ఆమె ధరించిన చెవిపోగులు, భారీ సిల్వర్ రింగ్ జతచేసింది. నేచురల్ మేకప్ లుక్.. పింక్ ఐ షాడోతో పింక్ లిప్ స్టిక్ తో కనిపించింది. "నేను నన్ను ప్రేమిస్తున్నాను:, ఎప్పటికీ సరళమైన, అత్యంత శక్తివంతమైన విప్లవం, ప్రస్తుతం మంజు వారియర్ ఫోటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Manju Warrier: ఆమె అందం చూసి కాలమే ఆగిపోయిందేమో.. చీరకట్టులో మంజు మంత్రముగ్దులను చేస్తోందిగా..
Manju Warrier
Follow us on

మంజు వారియర్.. తెలుగు ప్రేక్షకులకు అంతగా తెలియకపోవచ్చు. కానీ మలయాళం, తమిళ్ సినీప్రియులకు అభిమాన హీరోయిన్. ఇటీవలే కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటించిన తెగింపు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.. ప్రస్తుతం మంజు చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. నాలుగు పదుల వయసులోనూ అగ్రకథానాయికగా రాణిస్తోంది. ఓవైపు సినిమాలతో బిజీగా ఉన్న మంజు.. షూటింగ్ నుంచి కాస్త బ్రేక్ దొరికితే బైక్ రైడింగ్ చేస్తుంది. ఇక మరోవైపు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పుడూ లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటుంది. తాజాగా మంజు షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

పింక్ షిఫాన్ సారీలో అందమే అద్భుతమైనట్లుగా కనిపిస్తోంది మంజు. అలాగే ఆమె ధరించిన చెవిపోగులు, భారీ సిల్వర్ రింగ్ జతచేసింది. నేచురల్ మేకప్ లుక్.. పింక్ ఐ షాడోతో పింక్ లిప్ స్టిక్ తో కనిపించింది. “నేను నన్ను ప్రేమిస్తున్నాను:, ఎప్పటికీ సరళమైన, అత్యంత శక్తివంతమైన విప్లవం, ప్రస్తుతం మంజు వారియర్ ఫోటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మంజు వారియర్ పింక్ శారీ ఫోటోస్.. 

మంజు వారియర్ చివరిసారిగా వెల్లరి పట్టణం అనే మలయాళం సినిమాలో కనిపించింది. ప్రస్తుతం ఆమె తన రాబోయే మలయాళ చిత్రం ఫుటేజ్ షూటింగ్‌లో బిజీగా ఉంది. అంతేకాకుండా త్వరలోనే మంజు అమ్రికీ పండిట్‌తో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనుంది. ఇందులో ఆర్ మాధవన్ కీలకపాత్రలో నటించనున్నారు. ఈ సినిమా టైటిల్ ఇంకా ప్రకటించాల్సి ఉంది.

మంజు వారియర్ ఇన్ స్టా పోస్ట్.. 

మంజు వారియర్.. 90’sలో అగ్రకథానాయికగా ఓ వెలుగు వెలిగింది మంజు వారియర్. పెళ్లి తర్వాత చాలా కాలం ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఆమె.. ఇప్పుడు మరోసారి వెండితెరపై సత్తా చాటుతున్నారు. నాలుగు పదుల వయసులో రీఎంట్రీ ఇచ్చిన ఆమె.. ఇప్పుడు చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. 2014లో రీఎంట్రీ ఇచ్చిన మంజు.. వరసు ఫోటోషూట్స్ చేస్తూ అభిమానులను ఫిదా చేస్తున్నారు. ఆమె రీసెంట్ లుక్స్ చూసి నెటిజన్స్ అవాక్కవుతున్నారు. అందరికి వయసు పెరుగుతుంటే ఈమెకు తగ్గుతుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మంజు వారియర్ ఇన్ స్టా పోస్ట్.. 

కేవలం నటిగానే కాదు.. డ్యాన్సర్ గానూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది మంజు వారియర్. ఇక తెలుగులోనూ మంజుకు అవకాశాలు వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోలకు సరైన జోడిగా మంజు కనిపించే ఛాన్స్ ఉందంటున్నారు. తన జనరేషన్ హీరోయిన్స్ అందరూ రిటైరైపోయినా.. మంజు మాత్రం స్టైల్ ఐకాన్ గా సిల్వర్ స్క్రీన్ రూల్ చేస్తున్నారు..

మంజు వారియర్ ఇన్ స్టా పోస్ట్.. 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.