ఆడపిల్లలంటే ఆట వస్తువులు కాదు.. అలా చూపిస్తే ఒప్పుకోను..! కాయదు లోహర్ షాకింగ్ కామెంట్స్

కాయదు లోహర్ మోడల్ గా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత హీరోయిన్ గా మారింది. ఈ బ్యూటీ 2000 ఏప్రిల్ 11న అస్సాంలోని తేజ్‌పూర్‌లో జన్మించింది. ప్రస్తుతం పూణేలో సెటిల్ అయ్యింది కాయదు. తన కెరీర్‌ను మోడల్‌గా ప్రారంభించిన కాయదు, 2021లో పూణే ఫ్రెష్ ఫేస్ కాంపిటీషన్‌లో విజేతగా నిలిచింది. అదే సంవత్సరం కన్నడ చిత్రం "ముగిల్‌పేట"తో సినీ రంగంలోకి అడుగుపెట్టింది.

ఆడపిల్లలంటే ఆట వస్తువులు కాదు.. అలా చూపిస్తే ఒప్పుకోను..! కాయదు లోహర్ షాకింగ్ కామెంట్స్
Kayadu Lohar

Updated on: Sep 06, 2026 | 4:07 PM

ప్రదీప్ రంగనాథన్ నటించిన ‘డ్రాగన్’ చిత్రంతో హీరోయిన్ కయాదు లోహర్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతకు ముందుకు ఈ అమ్మడు తెలుగులో అల్లూరి అనే సినిమా చేసింది. కానీ ఆ సినిమా పెద్దగా ఆకట్టుకుకొలేదు. ఇక ఈ చిన్నది ఫంకీ సినిమాతో మరోసారి తెలుగు ఆడియన్స్ ను ఆకట్టుకుంది. కానీ ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. ప్రస్తుతం ఆమె తమిళం, తెలుగు చిత్రసీమలలో చాలా బిజీగా ఉంది. సోషల్ మీడియాలోనూ ఈ ముద్దుగుమ్మ చాలా యాక్టివ్ గా ఉంటుంది. మరోవైపు తెలుగులోనూ బ్యాక్ టూ బ్యాక్ అవకాశాలు అందుకుంటుంది. ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని నటిస్తున్న ది ప్యారడైజ్ సినిమాలో కాయదు హీరోయిన్ గా నటిస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా కయాదు లోహర్ చేసిన కొన్ని కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సినిమాల్లో ఆడవాళ్లను చూపించే విధానంపై కయాదు లోహర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

సినిమాల్లో మహిళలను కేవలం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించే  ఐటెమ్ లా చూపించే ధోరణిని తాను ఒప్పుకోనని తేల్చి చెప్పింది కాయదు. స్పష్టం చేశారు యంగ్ హీరోయిన్ కయాదు లోహర్. కథ, పాత్ర డిమాండ్ చేస్తే పరిమితులకు లోబడి నటించడానికి ఎలాంటి అభ్యంతరం లేదని, కేవలం లైమ్ లైట్ కోసమో లేదా సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడానికో అసభ్యకరమైన సన్నివేశాల్లో నటించే ఆలోచన తనకు అస్సలు లేదని చెప్పుకొచ్చింది కయాదు లోహర్. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

అస్సాంలో పుట్టి పెరిగినా దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో సత్తా చాటుతోంది కాయదు లోహర్. తన అందం, అభినయంతో కుర్రకారులో క్రేజ్ తెచ్చుకుందీ ముద్దుగుమ్మ. మోడలింగ్ తో కెరీర్ మొదలు పెట్టిన కాయదు లోహర్. ‘టైమ్స్ ఫ్రెష్ ఫేస్’ పోటీల్లో విజేతగా నిలిచి అందరి దృష్టినీ ఆకర్షించిన కయాదు ఆ తర్వాత నటనారంగం వైపు అడుగులు వేశారు. కన్నడలో ‘ముగిల్‌పేటే’ చిత్రంతో కెరీర్ ప్రారంభించింది ఈ ముద్దుగుమ్మ ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us