Jayasudha: జయసుధను రామ్ చరణ్, మహేష్‌లు ఏమని పిలుస్తారో తెలుసా? ఆసక్తికర విషయం చెప్పిన సహజ నటి

సహాజ నటి జయసుధ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఈ అందాల తార సహాయక నటిగానూ రాణించారు. అయితే గతంలో కంటే సినిమాలు బాగా తగ్గించేశారు జయసుధ. అప్పుడప్పుడు మాత్రమే సినిమా ఈవెంట్స్, ఫంక్షన్లలో కనిపిస్తూ ఉంటారు.

Jayasudha: జయసుధను రామ్ చరణ్, మహేష్‌లు ఏమని పిలుస్తారో తెలుసా? ఆసక్తికర విషయం చెప్పిన సహజ నటి
Jayasudha

Updated on: Jun 15, 2026 | 8:21 PM

తెలుగు సినిమా ఇండస్ట్రీని ఏలిన అందాల తారల్లో జయసుధ ఒకరు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఈ అందా తార స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగారు. తన అందం, అభినయంతో తెలుగు ఇండస్ట్రీ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాతి కాలంలో సహాయక నటిగానూ స్టార్ డమ్ చూశారీ అందాల తార. అయితే ప్రస్తుతం పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు జయసుధ. అప్పుడప్పుడు సినిమా ఈవెంట్లు, ఫంక్షన్లలో కనిపిస్తుంటారు. కాగా తన సినిమా కెరీర్ లో దాదాపు మూడు తరాల హీరోలతో కలిసి నటించారు జయసుధ. ఈ క్రమంలో చాలా ఇంటర్వ్యూల్లో తన సినిమా కెరీర్, తనతో కలిసి నటించిన హీరోల గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు జయుసుధ. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబుల గురించి గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు.

 

‘నేను మెగాస్టార్ చిరంజీవితో పెద్దగా సినిమాలు చేయలేదు.. కానీ ఆయన ఫ్యామిలీ నాతో ఎంతో ప్రేమగా ఉంటుంది. నిజం చెప్పాలంటే చిరంజీవి సినీ ప్రయాణం ఎంతో కఠినమైనది. కానీ క్రమశిక్షణ, ఏదైనా సాధించాలనే సంకల్పం, కృషి చిరంజీవిని మెగాస్టార్ గా నిలబెట్టాయి. ఇక రామ్ చరణ్ కూడా చిరంజీవి లాంగే ఎంతో వినయంగా, క్రమశిక్షణతో నడుకుంటాడు. పెద్దలను ఎలా గౌరవించాలి, వారితో ఎలా మాట్లాడాలనే సంస్కారం ఆయనలో కనిపిస్తుంది. ఇండస్ట్రీలో అందరూ నన్ను ‘జయసుధ గారు’ అనే పిలుస్తారు. కానీ చరణ్ మాత్రం ‘ ఆంటీ’అని పిలుస్తుంటారు. చరణ్ ఒక్కరే కాదు మెగాస్టార్ కుటుంబం మొత్తం ఎంతో వినయంగా ఉంటుంది. వారు ఎప్పుడూ తమను తాము మెగాస్టార్ కుటుంబ సభ్యులమని గొప్పగా చెప్పుకోరు. ఇక పవన్ విషయానికి వస్తే.. ఆయనతో కలిసి బాలు సినిమాలో కలిసి నటించాను. పవన్ ఎక్కువగా మాట్లాడరు. పలకరిస్తేనే మాట్లాడతారు’

ఇవి కూడా చదవండి

‘ఇక మహేష్ ను చిన్పప్పటి నుంచి చూస్తున్నాను. తండ్రి కృష్ణలాగే అతను చాలా కూల్ గా ఉంటారు, చాలా తక్కువ గా మాట్లాడతారు. మహేష్ నన్ను ఎప్పుడూ “జయసుధ గారు” అని పిలుస్తారు.. నేను మాత్రం ‘మహేష్’ అని పిలుస్తాను’ అని జయసుధ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ సహాజ నటి కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us