AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్లి కంటే సహజీవనమే బెటర్.. పచ్చిగా చెప్పేసిన క్రేజీ హీరోయిన్

పెళ్లి కంటే సహజీవమే బెటర్ అని గతంలో చాలా మంది హీరోయిన్స్ కామెంట్స్ చేశారు. తాజాగా మరో హీరోయిన్ కూడా ఇప్పుడు పెళ్లి పై షాకింగ్ కామెంట్స్ చేసింది.. పెళ్లి చేసుకొని సంతోషంగా ఉన్న వారిని తాను చాలా తక్కువ మందిని చూశా అని చెప్పింది.

పెళ్లి కంటే సహజీవనమే బెటర్.. పచ్చిగా చెప్పేసిన క్రేజీ హీరోయిన్
Actress
Rajeev Rayala
|

Updated on: Mar 22, 2026 | 12:32 PM

Share

ఇండస్ట్రీలో పెళ్లి, విడాకులు, లవ్ రిలేషన్ షిప్స్ అనేవి చాలా కామన్ గా వినిపిస్తుంటాయి చాలా మంది పెళ్లి చేసుకొని వివాహబంధంలోకి అడుగుపెడుతున్నారు. ఇటీవలే స్టార్ హీరో, హీరోయిన్ విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించారు. అలాగే కొంతమంది లవ్ లో మునిగి తేలుతున్నారు. అయితే కొంతమంది మాత్రం విడాకులు తీసుకొని అభిమానులకు ఊహించని షాక్ ఇస్తున్నారు. ఇదిలా ఉంటే తాజగా ఓ హీరోయిన్ పెళ్లి పై చేసిన ల్కమెంట్స్ ఇప్పుడు నెట్టయింట రచ్చ చేస్తున్నాయి. పెళ్లి కంటే సహజీవనమే బెటర్ అంటుంది ఆ అమ్మడు. ఇంతకూ ఆ ముద్దుగుమ్మ ఎవరు.? పెళ్లి పై ఆమె చేసిన కామెంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.!

సినిమాల్లో క్రేజీ హీరోయిన్ గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె ఐశ్వర్య లక్ష్మి. 2017లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు.. ఆ తర్వాత వరుస హిట్స్ అందుకుంది. ఎంబీబీఎస్ పూర్తి చేసిన డాక్టర్ అయ్యాక సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. 2014లో మోడలింగ్ రంగంలోకి ప్రవేశించింది. 2017లో నందలవర నాడు నాడ్ ఒరు ఆవాలా సినిమాతో తన సినీ కెరీర్‌ని ప్రారంభించింది.

ఇవి కూడా చదవండి

అదే ఏడాది మాయనది సినిమాతో నటిగా ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాకు ఆమె ఫిల్మ్‌ఫేర్, సైమా, క్రిటిక్స్ అవార్డులను సొంతం చేసుకుంది. గాడ్సే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ సినిమాలో నటించింది. ఐశ్వర్య నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. కానీ ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం రాలేదు. ఈ అమ్మడు సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తుంది. ఇదిలా ఉంటే తాజగా  ఐశ్వర్య లక్ష్మి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఐశ్వర్య లక్ష్మీ మాట్లాడుతూ.. గత 30 ఏళ్ల నా జీవితంలో ఎన్నో జంటలను చూశాను. అయితే నేను చూసిన వారిలో చాలా మంది సంతోషంగా లేరు. ఒకప్పుడు నేను కూడా పెళ్లి గురించి ఎన్నో అందమైన కలలు కన్నాను. కానీ ఆతర్వాత నా ఆలోచనలు పూర్తిగా మారిపోయాయి. పెళ్లి చేసుకుని విడిపోవడం కంటే పెళ్లి కంటే ముందే సహజీవనం చేయడమే మంచిది అని షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇద్దరు వ్యక్తుల మధ్య మనశ్శాంతి, తృప్తి ఉండాలి. అయితే అది పెళ్లితోనే సాధ్యం కాదని ఐశ్వర్య చెప్పుకొచ్చింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర