వచ్చే ఏడాది సంక్రాంతికి థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అయ్యారు విక్టరీ వెంకటేశ్. డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకీమామ నటిస్తోన్న లేటేస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కాగా.. ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది చిత్రయూనిట్. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని జనవరి 14న థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఇందులో వెంకీమామ జోడిగా ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటివరకు విడుదలైన రెండు పాటలు యూట్యూబ్ లో సూపర్ హిట్ అయ్యాయి. గోదారి గట్టు మీద రామ సిలకవే.. మీనూ.. సాంగ్స్ యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు మూడో సాంగ్ రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యింది చిత్రయూనిట్.
మొదటి నుంచి సినిమా ప్రమోషన్స్ సరికొత్తగా జరుపుతున్నారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఇప్పటివరకు వచ్చిన ప్రమోషన్స్ చూస్తుంటే.. సినిమాపై మరింత ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందిస్తుండగా.. ఫస్ట్ సాంగ్ రమణ గోగులతో పాడించారు. దాదాపు 18 ఏళ్ల తర్వాత కంబ్యాక్ ఇచ్చిన రమణ గోగుల మరోసారి తన వాయిస్ తో మ్యాజిక్ చేశాడు. ఇక రెండో పాట సైతం హిట్ కాగా.. ఇప్పుడు మూడో పాటను విడుదల చేయనున్నారు. అయితే ఈ పాటను హీరో వెంకటేష్ తో పాడించినట్లుగా తెలుస్తోంది. బ్లాక్ బస్టర్ పొంగల్ అంటూ సాగే పాటను వెంకీమామ పాడినట్లు తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఓ ఫన్నీ వీడియోను రిలీజ్ చేశారు.
అందులో అనిల్ రావిపూడి చర్చిస్తోన్న సమయంలో వెంకీమామ వచ్చి నేను పాడతాను.. నేను పాడతాను అంటాడు. అనిల్ రావిపూడి ఎక్కడ కనిపించినా.. నేను పాడతా అంటూ వెంటపడడం.. ఆ సమయంలో అనిల్ రావిపూడి ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ నవ్వులు పూయిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వీడియోలో సోషల్ మీడియాలో వైరలవుతుండగా.. మూడో సాంగ్ అనౌన్స్మెంట్ ఎంత ఫన్నీగా చూపించారు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే వచ్చిన ప్రమోషన్ వీడియోస్ సినిమాపై మరింత క్యూరియాసిటినీ పెంచాయి.
After two chartbuster melodies 🎶
The third single of #SankranthikiVasthunam is going to be a blasting experience for you all💥 #BlockbusterPongal Lyrical Video coming soon🔥Get ready to groove to the energetic vocals of Victory @Venkymama 🕺💃
— https://t.co/Jo0NHm6iuz… pic.twitter.com/MA388n7kHn
— Sri Venkateswara Creations (@SVC_official) December 26, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.