Trivikram-Sunil: ఆ రాత్రి త్రివిక్రమ్ చేసిన పని చూసి షాకైన సునీల్.. కేవలం 12 రూపాయాలతో..

ఆ సమయంలోనే త్రివిక్రమ్ చేసిన పనికి తాను షాకయ్యానని సునీల్ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. రెంట్ కట్టలేక రాత్రి 9 గంటల సమయంలో రూమ్ ఖాళీ చేశామని.. కేవలం రూ.12లతో రోడ్డు మీద ఉండిపోయామని అన్నారు. కానీ అదే 12 రూపాయాలను త్రివిక్రమ్ ఒక్కసారిగా ఖర్చు చేశారని.. అందుకు గల కారణాన్ని కూడా వెల్లడించారు.

Trivikram-Sunil: ఆ రాత్రి త్రివిక్రమ్ చేసిన పని చూసి షాకైన సునీల్.. కేవలం 12 రూపాయాలతో..
Sunil, Trivikram
Follow us

|

Updated on: Sep 17, 2024 | 9:19 AM

టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్ సునీల్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ బెస్ట్ ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే. సినిమా అవకాశాల కోసం హైదరాబాద్ వచ్చి ఇద్దరూ ఒకే రూంలో ఉండి ప్రయత్నాలు చేసేవారు. కెరీర్ ప్రారంభంలో ఇద్దరూ ఎన్నో కష్టాలను, సవాళ్లను ఎదుర్కొన్నారు. కొన్నిసార్లు చేతిలో డబ్బులు లేకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒకసారి రూమ్ రెంట్ కూడా కట్టలేని పరిస్థితి వచ్చిందని.. ఆ సమయంలోనే త్రివిక్రమ్ చేసిన పనికి తాను షాకయ్యానని సునీల్ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. రెంట్ కట్టలేక రాత్రి 9 గంటల సమయంలో రూమ్ ఖాళీ చేశామని.. కేవలం రూ.12లతో రోడ్డు మీద ఉండిపోయామని అన్నారు. కానీ అదే 12 రూపాయాలను త్రివిక్రమ్ ఒక్కసారిగా ఖర్చు చేశారని.. అందుకు గల కారణాన్ని కూడా వెల్లడించారు.

సునీల్ మాట్లాడుతూ.. “త్రివిక్రమ్ నేనూ లక్టీకపూల్ లో ఉండేవాళ్లం. రెంట్ కట్టే పరిస్థితి కూడా లేకపోవడంతో రూమ్ ఖాళీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో నా బట్టలన్ని వెతికితే రూ.12 దొరికాయి. దీంతో అదే రాత్రి లగేజ్ సర్దుకుని బయటకు వెళ్లాం. తినడానికి సరిపడా డబ్బులు ఉన్నాయని నాకేం భయం వేయలేదు. అప్పట్లో దిల్ ఖుష్ మూడు రూపాయాలు. రాత్రికి చెరొకటి తిని మంచి నీళ్లు తాగి ఎవరైనా స్నేహితుడి రూంకు వెళ్లి పడుకుందామని త్రివిక్రమ్ తో చెప్పాను. ఉదయం లేచిన తర్వాత టిఫిన్ కూడా చేయ్యోచ్చు అనుకున్నాము. అప్పుడు ఇడ్లీ మూడు రూపాయలు. రేపు నిద్రలేచిన తర్వాత పని, డబ్బులు సంపాదిస్తే సరిపోతుందని చెప్పాను. దీంతో నా దగ్గర ఉన్న రూ.12లు ఇవ్వమని త్రివిక్రమ్ అడిగాడు.

అవి తీసుకుని ఎదురుగా ఉన్ షాప్ కు వెళ్లి కోకాకోలా టిన్ కొనుక్కోచ్చాడు. అప్పుడు దాని ధర రూ.12. నువ్వు కొంచెం తాగి నాకు కొంచెం ఇవ్వు అనేసరికి షాకయ్యాను. నువ్వు రేపటి వరకు ప్లాన్ చేశావు. అంటే మన ఆలోచనలు రేపటి నుంచి స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు డబ్బులు లేవు. అంటే డబ్బు సంపాదించడం గురించి ఇప్పటి నుంచే ఆలోచించు అని చెప్పాడు” అంటూ గుర్తు చేసుకున్నాడు సునీల్.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

త్రివిక్రమ్ ఆలోచనకు సునీల్ షాక్.. అసలేం జరిగిందంటే..
త్రివిక్రమ్ ఆలోచనకు సునీల్ షాక్.. అసలేం జరిగిందంటే..
తెలుగు రాష్ట్రాల్లో లడ్డూ వేలంలో సరికొత్త రికార్డ్.. ఎన్ని కోట్లు
తెలుగు రాష్ట్రాల్లో లడ్డూ వేలంలో సరికొత్త రికార్డ్.. ఎన్ని కోట్లు
24 గంట‌ల్లోనే ఓటీటీలో సరికొత్త రికార్డు సృష్టించిన ‘రఘు తాత’ మూవీ
24 గంట‌ల్లోనే ఓటీటీలో సరికొత్త రికార్డు సృష్టించిన ‘రఘు తాత’ మూవీ
హిట్టు ముఖ్యం బిగిలూ అంటున్న దర్శకులు.. కొందరు ఆలా.. కొందరు ఇలా..
హిట్టు ముఖ్యం బిగిలూ అంటున్న దర్శకులు.. కొందరు ఆలా.. కొందరు ఇలా..
ఓటీటీలోకి షణ్ముఖ్ కొత్త వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..
ఓటీటీలోకి షణ్ముఖ్ కొత్త వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..
రీల్స్ కోసం చేసే ప్రయత్నం విరిగిన కాళ్లు ఒకరోజులో 2 కోట్ల వ్యూస్
రీల్స్ కోసం చేసే ప్రయత్నం విరిగిన కాళ్లు ఒకరోజులో 2 కోట్ల వ్యూస్
గోల్డ్ లవర్స్‌కి బిగ్ షాక్.. 5 రోజుల్లో భారీగా పెరిగిన బంగారం ధర
గోల్డ్ లవర్స్‌కి బిగ్ షాక్.. 5 రోజుల్లో భారీగా పెరిగిన బంగారం ధర
విజయ్ 69వ సినిమాతో ఆపేయడానికి కారణం ఇదేనట..!
విజయ్ 69వ సినిమాతో ఆపేయడానికి కారణం ఇదేనట..!
CBSE సింగిల్ గర్ల్ చైల్డ్ 2024 మెరిట్‌ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తులు
CBSE సింగిల్ గర్ల్ చైల్డ్ 2024 మెరిట్‌ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తులు
బాలాపూర్‌ లడ్డూ చరిత్ర ఇదే.. రూ. 450 నుంచి మొదలై..
బాలాపూర్‌ లడ్డూ చరిత్ర ఇదే.. రూ. 450 నుంచి మొదలై..