
హీరో సుమంత్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. క్లాసిక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు సుమంత్. అలాగే విభిన్నమైన పాత్రలు చేస్తూ హిట్స్ అందుకుంటున్నాడు. ఇటీవలే అనగనగా అనే సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు న్యూటన్స్ థర్డ్ లా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా మంచి టాక్ తో దూసుకుపోతుంది. కాగా మహేష్ బాబుకు సుమంత్ కు మధ్య స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో తనకున్న పాత స్నేహం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తమ ఇద్దరి కెరీర్ తొలినాళ్లలో, ముఖ్యంగా రాజకుమారుడు, ప్రేమ కథ వంటి చిత్రాలకు ముందు నుంచే తామిద్దరం తరచుగా కలిసేవారని సుమంత్ తెలిపారు. మహేష్ బాబు మునుపటి చిత్రాలంటే తనకు చాలా ఇష్టమని ఆయన పేర్కొన్నారు.
నటుడిగా మహేష్ బాబుకు తాను అభిమానినని, ఆయన నటనలో ఒక ప్రత్యేకత ఉంటుందని సుమంత్ అన్నారు. ముఖ్యంగా ఒక్కడు చిత్రాన్ని మహేష్ బాబు కెరీర్‌లో తనకు అత్యంత ఇష్టమైన చిత్రంగా తెలిపారు. మహేష్ డైలాగ్ డెలివరీ చాలా ప్రత్యేకంగా ఉంటుందని, అలాగే ఆయన నటనలో అండర్‌ప్లే శైలి తనకెంతో నచ్చుతుందని సుమంత్ వివరించారు. కృష్ణ గారి కౌబాయ్, జేమ్స్ బాండ్ వంటి విభిన్న పాత్రలు చిన్నప్పుడు తనను ఆకట్టుకున్నాయని చెబుతూనే, మహేష్ బాబు నటన చాలా కొత్తగా, డిఫరెంట్‌గా ఉంటుందని సుమంత్ ప్రశంసించారు. స్నేహితుడిగా, నటుడిగా మహేష్ బాబు అంటే తనకు ఎంతో ఇష్టమని సుమంత్ చెప్పుకొచ్చారు.
ఇక ఇటీవల జరిగిన ఓ ప్రెస్ మీట్ లో సుమంత్ మాట్లాడుతూ.. విలన్ పాత్రల పట్ల తన ఆసక్తిని వెల్లడించారు. “ఇప్పటివరకు మిమ్మల్ని చాలా పాజిటివ్ క్యారెక్టర్స్ లో చూసాము, సో విలన్ గా చూడాలని ఉంది, ఒక మంచి విలన్ గా” అని ఓ జర్నలిస్ట్ ప్రశ్నించగా.. సుమంత్ తన మనసులోని మాటను నిర్మొహమాటంగా పంచుకున్నారు. “మీ కుటుంబంలో గానీ లేకపోతే ఇండస్ట్రీలో ఎవరికైనా యాంటీ రోల్ గా, యాంటాగనిస్ట్ గా చేయాలి అనుకుంటే ఎవరితో చేయాలి అనుకుంటారు సర్?” అని అడగగా, సుమంత్ తక్షణమే “ఫస్ట్ మహేష్ బాబు. హోప్ ఫుల్లీ యా అగైన్స్ట్ హిమ్” అని సమాధానమిచ్చారు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో తెరపై విలన్‌గా తలపడాలనే తన కోరికను ఆయన వ్యక్తం చేశారు. దాంతో మహేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. మరి భవిష్యత్తులో ఈ కాంబినేషన్ సెట్ అవుతుందా అని సినీ ప్రేక్షకులు, విశ్లేషకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ వ్యాఖ్యలు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.