Siddarth-Aditi Rao: మరోసారి తెరపైకి సిద్ధార్థ్.. అదితిల ప్రేమాయణం.. ముంబైలో కెమెరాకు చిక్కిన లవ్ బర్డ్స్

|

Dec 01, 2022 | 5:32 PM

ఇటీవల అదితి రావు పుట్టిన రోజు సందర్భంగా తనతో కలిసి దిగిన పిక్ షేర్ చేస్తూ.. నా హృదయ రాణికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ సిద్ధూ పోస్ట్ చేయడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది.

Siddarth-Aditi Rao: మరోసారి తెరపైకి సిద్ధార్థ్.. అదితిల ప్రేమాయణం.. ముంబైలో కెమెరాకు చిక్కిన లవ్ బర్డ్స్
Siddarth
Follow us on

టాలీవుడ్ హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి రావు హైదరీ ప్రేమలో ఉన్నారంటూ గత కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల అదితి రావు పుట్టిన రోజు సందర్భంగా తనతో కలిసి దిగిన పిక్ షేర్ చేస్తూ.. నా హృదయ రాణికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ సిద్ధూ పోస్ట్ చేయడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. అంతేకాకుండా.. వీరు జంటగా చక్కర్లు కొట్టడం.. సినిమా ఈవెంట్స్ కలిసి హజరవుతుండడంతో నిత్యం వీరికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరలవుతుంది. తాజాగా మరోసారి ఈ జంట కెమెరాకు చిక్కారు. ముంబైలోని ఓ హోటల్లో సిద్దూ.. అదితి కలిసి కెమెరా కు చిక్కిన ఫోటోస్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. అయితే వీరిద్దరు తమ బంధం గురించి వస్తున్న వార్తలపై ఇప్పటివరకు స్పందించలేదు.

యంగ్ హీరో శర్వానంద్, సిద్ధార్థ్ కలిసి నటించిన మహా సముద్రం సినిమాలో అదితి రావు కథానాయికగా నటించింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమకు దారి తీసిందని తెలుస్తోంది. వీరిద్దరికి ఇదివరకే పెళ్లిళ్లు జరిగి విడాకులు కూడా జరిగాయి. సిద్ధార్థ్ 2003లో మేఘన అనే అభిమానిని వివాహం చేసుకుని 2007లో విడాకులు తీసుకున్నారు. మరోవైపు అదితి కూడా చిన్న వయసులోనే ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని విడాకులు తీసుకుందట.

ఇవి కూడా చదవండి

Siddarth Aditi

ఇటీవల బాలయ్య హోస్ట్ గా వ్యవహారిస్తున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే షోలో పాల్గొన్న శర్వానంద్ సైతం.. సిద్ధూ.. అదితి రిలేషన్ షిప్ పై స్పందించిన సంగతి తెలిసిందే. ఈ షోలో మహా సముద్రం సినిమా హీరోయిన్ అదితీ రావు హైదరీ ప్రస్తావన తీసుకువచ్చారు బాలయ్య. నిజ జీవితంలో సిద్ధార్థ్ కు జంటగా అదితి మారిందా ?.. అని శర్వానంద్ ను అడిగారు. అందుకు శర్వా స్పందిస్తూ.. ఏమో నాకేం తెలియదు.. సిద్ధార్థ్ పోస్ట్ చూశాను. కానీ అది నాకు అర్థం కాలేదు అని అన్నారు.