
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఇటీవలే మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో హిట్ అందుకున్న చిరు. ఇప్పుడు కాకా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇటీవలే ఈ సినిమా టైటిల్ టీజర్ ను విడుదల చేశారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో వాల్తేరు వీరయ్య సినిమా వచ్చిన విషయం తెలిసిందే.. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆతర్వాత ఇప్పుడు కాకా సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటు చిరంజీవి వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చాలా కాలంగా సాగుతుంది.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది విశ్వంభర. కాగా చిరంజీవికి ఎంతో మందిఅభిమానులు ఉన్నారు. అన్నయ అంటే ప్రాణం ఇచ్చే ఫ్యాన్స్ కు లెక్కేలేదు.
చిరంజీవి పుట్టిన రోజున అన్నదానాలు, రక్త దానాలు, పూలాభిషేకాలు, పాలాభిషేకాలు అంటూ ఫ్యాన్స్ తెగ సందడి చేస్తుంటారు. ఇదిలా ఉంటే ఓ నటుడు మెగాస్టార్ కు వీరాభిమాని, ఎంత వీరాభిమానంటే చిరంజీవి తాగిన టీ కప్పును ఏకంగా 20ఏళ్లకు పైగా భద్రంగా దాచుకున్నాడు. ఈ విషయాన్నీ ఆయనే స్వయంగా తెలిపాడు. ఇంతకూ ఆ నటుడు, మెగాస్టార్ వీరాభిమాని ఎవరో కాదు శివ రెడ్డి. ఒకప్పుడు తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను నవ్వించాడు. శివారెడ్డి .. ఈ కమెడియన్ తన కామెడీ టైమింగ్ తోనే కాదు మిమిక్రీతో పాపులర్ అయ్యారు.
ఎన్నో సినిమాల్లో హీరో ఫ్రెండ్ రోల్స్‌లో కనిపించాడు శివ రెడ్డి. అలాగే కొన్ని సినిమాల్లో నెగిటివ్ రోల్స్ లోనూ కనిపించి మెప్పించారు. ప్రస్తుతం సినిమాల స్పీడ్ తగ్గించిన శివ రెడ్డి గతంలో ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన హోమ్ టూర్ చేశారు. ఈ క్రమంలోనే ఆయన తనకు వచ్చిన అవార్డులు, జ్ఞాపికలు చూపించారు. వాటితో పాటు ఓ టీ కప్పు అందులో ఓ స్టార్ సింబల్ గురించి యాంకర్ అడగ్గా.. దానికి సమాధానమిస్తూ..ఇది మెగాస్టార్ చిరంజీవి గారు తాగిన టీ కప్పు.. ఆయన గుర్తిగా దాచుకున్న అందుకే ఇందులో స్టార్ సింబల్ పెట్టా.. ఆయన మెగాస్టార్ కదా..! లక్షల రూపాయిలు ఇచ్చినా కూడా ఈ టీ కప్పును ఎవ్వరికీ ఇవ్వను అని తెలిపారు శివారెడ్డి. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.