Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌పై ‘మీర్జాపూర్‌’ నటుడు పంకజ్‌ త్రిపాఠి ప్రశంసలు.. కారణమేంటంటే..

|

Oct 09, 2024 | 4:08 PM

ఓ ఇంటర్వ్యూలో పవన్‌ను ఉద్దేశించి పంకజ్‌ మాట్లాడుతూ.. పవన్‌ గొప్ప నటుడనీ పుస్తకాలు బాగా చదువుతారనీ ఎంతో దూరదృష్టి ఉన్న వ్యక్తి అనీ అన్నారు. ఈ విషయాన్ని తనకు కొందరు డైరెక్టర్లు కూడా చెప్పారనీ ఆయనకు అన్ని భాషల్లో అభిమానులు ఉన్నారనీ చెప్పారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌పై ‘మీర్జాపూర్‌’ నటుడు పంకజ్‌ త్రిపాఠి ప్రశంసలు.. కారణమేంటంటే..
Pawan Kalyan, Pankaj Tripat
Follow us on

హీరో పవన్ కల్యాణ్‌ హ్యాష్‌ట్యాగ్‌ ఎక్స్‌లో వైరల్‌గా మారింది. పవన్‌ కల్యాణ్‌కు ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ మామూలుగా ఉండదు . సినీ ప్రముఖులు కూడా ఆయనకు వీరాభిమానులే. పలు సందర్భాల్లో వారంతా పవన్‌పై ఉన్న అభిమానాన్ని చాటుకుంటూనే ఉంటారు. తాజాగా ‘మీర్జాపూర్‌’ నటుడు పంకజ్‌ త్రిపాఠి పవన్‌పై ప్రశంసలు కురిపించారు. ఓ ఇంటర్వ్యూలో పవన్‌ను ఉద్దేశించి పంకజ్‌ మాట్లాడుతూ.. పవన్‌ గొప్ప నటుడనీ పుస్తకాలు బాగా చదువుతారనీ ఎంతో దూరదృష్టి ఉన్న వ్యక్తి అనీ అన్నారు. ఈ విషయాన్ని తనకు కొందరు డైరెక్టర్లు కూడా చెప్పారనీ ఆయనకు అన్ని భాషల్లో అభిమానులు ఉన్నారనీ చెప్పారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.

మరోవైపు పవన్ కల్యాణ్‌ సినిమాలకు సంబంధించిన మరో రెండు వార్తలు ఎక్స్‌లో షేర్‌ అవుతున్నాయి. పవన్ కల్యాణ్‌ హీరోగా సుజీత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఓజీ’ (OG). ఈ సినిమాలో ఓ తమిళ హీరో పాట పాడనున్నట్లు వార్తలు వస్తున్నాయి. పవన్‌ కెరీర్‌లోనే అది బిగ్గెస్ట్‌ ఎలివేషన్‌ సాంగ్‌ అని టాక్. అలాగే ‘హరిహర వీరమల్లు’ సినిమాలో పవన్‌ కల్యాణ్‌ ఓ పాట పాడనున్నారట. వీటికి సంబంధించిన అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

ఇక పవన్‌ ప్రస్తుతం సినిమాలు, రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఆయన సినిమాల కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ‘ఓజీ’, ‘హరిహర వీరమల్లు’, ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ సినిమాల షూటింగ్‌ను ఆయన పూర్తి చేయాల్సిఉంది. సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఆ చిత్రాల షూటింగ్‌ వాయిదా పడింది. ఈ మూడు సినిమాల గ్లింప్స్‌ ఇప్పటికే మంచి ప్రేక్షకాదరణను సొంతం చేసుకున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.