Actor Nani: మెగాఫోన్ పట్టిన నాని సిస్టర్.. ‘మీట్ క్యూట్’ అంటూ సినిమా మొదలు పెట్టేసిన నేచురల్ స్టార్..

Meet Cute Movie: టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని అటూ హీరోగానే కాకుండా.. నిర్మాతగానూ దూసుకుపోతున్నారు. వాల్ పోస్టర్ ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మించిన

Actor Nani: మెగాఫోన్ పట్టిన నాని సిస్టర్.. మీట్ క్యూట్ అంటూ సినిమా మొదలు పెట్టేసిన నేచురల్ స్టార్..
Nani

Updated on: Jun 15, 2021 | 2:13 PM

Meet Cute Movie: టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని అటూ హీరోగానే కాకుండా.. నిర్మాతగానూ దూసుకుపోతున్నారు. వాల్ పోస్టర్ ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మించిన అ, hit వంటి సినిమాలు సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. తాజాగా నాని నిర్మా్ణంలో మీట్ క్యూట్ అనే సినిమా రూపొందుతుంది. ఈ ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలను నాని సోదరి దీప్తి గంటా చేపట్టింది. ఇప్పటికే దీప్తి.. అనగనగా ఒక నాన్న అనే షార్ట్ ఫిల్మ్ తెరకెక్కించి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు ఏకంగా సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ విషయాన్ని నాని ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. నేడు కొత్త ప్రయాణం మొదలైంది. ఇది నాకెంతో ప్రత్యేకం అంటూ మీట్ క్యూట్ కు సంబంధించిన ఫోటోలను షేర్ చేసుకున్నారు. అందులో సత్యరాజ్ కూర్చుని ఉండగా.. నాని క్లాప్ కొడుతున్న ఫోటోతో పాటు మరో ఫోటో పంచుకున్నారు. ఇక ఈ సినిమాలో సత్యరాజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు ప్రకటించనున్నారు.

ఇదిలా ఉంటే.. నాని సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం టక్ జగదీష్, శ్యాం సింగరాయ్ సినిమాలు చేస్తున్నాడు నాని. అయితే ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న టక్ జగదీశ్ సినిమా విడుదల కావాల్సి ఉండగా.. కరోనా వల్ల వాయిదా పడింది. ఇప్పుడు నాని బ్యానర్ లో నిర్మిస్తున్న మీట్ క్యూట్ సినిమా నాలుగోది.

ట్వీట్..

Also Read: Rhea Chakraborty: ‘నువ్వు లేకుండా జీవితం లేదు.. తలచిన ప్రతిసారీ గుండెకు భారమే’.. సుశాంత్ సింగ్ గురించి రియా భావోద్వేగ పోస్ట్..

Kangana Ranaut: గుర్రపు స్వారీ చేస్తున్న కంగనా.. ఆశ్చర్యపోతున్న అభిమానులు.. వైరల్ అవుతున్న వీడియో..

Loading...
Unable to load recommendations.
Follow Us