
తెలుగు సినిమా రంగంలో మెగాస్టార్ చిరంజీవి ప్రవేశానికి రజనీకాంత్, GV నారాయణ రావుల మార్గదర్శకత్వం ఎంతో కీలకంగా నిలిచిందని GV నారాయణ రావు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. బాలచందర్ తమ ప్రాక్టికల్స్‌ను చూసిన తర్వాత, ఫిల్మ్ ఛాంబర్ ఒక పుస్తకాన్ని ప్రచురించింది. దాని ద్వారా నారాయణ రావు, రజనీకాంత్, ప్రదీప్ శక్తిలను ఒకే బ్యాచ్ నుండి సెలెక్ట్ చేశారని అన్నారు. తాను, రజనీకాంత్ మంచి మిత్రులుగా ఉన్నారని గుర్తు చేసుకున్నారు.. ఒకే సిగరెట్లు పంచుకుంటూ, రజనీకాంత్ తరచుగా నారాయణ రావు ఇంటికి వచ్చి, ఆయన సోదరిని అక్కయ్యా అని పిలుస్తూ భోజనం చేసేవారని నారాయణ రావు గుర్తు చేసుకున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Actress : రాజమౌళి మాటలతో నా గుండె పగిలిపోయింది.. ఆ సినిమా వదులుకోకుండా ఉండాల్సింది.. టాలీవుడ్ హీరోయిన్..
చిలకమ్మ చెప్పింది వంటి చిత్రాలలో రజనీకాంత్‌తో కలిసి నటించానని కూడా ఆయన తెలిపారు. ఈ చిత్రం పాలకొల్లులో షూటింగ్ జరుగుతున్న సమయంలో, అప్పుడే చదువు పూర్తిచేసిన ఒక యువకుడు వారిని కలిశారని.. తనకు కూడా నటుడిని కావాలనే కోరిక ఉందని ఆ యువకుడు వారితో చెప్పగా, నారాయణ రావు మరియు, రజనీకాంత్ ఇద్దరూ తాము చదువుకున్న ఇన్‌స్టిట్యూట్‌లో చేరమని సలహా ఇచ్చారని అన్నారు. ఆ యువకుడే తర్వాతి కాలంలో మెగాస్టార్‌గా ఎదిగిన చిరంజీవి అని నారాయణ రావు పేర్కొన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Actress : ఏంట్రా బాబూ.. ఈ సీరియల్ బ్యూటీ ఇంతందంగా మారిపోయింది.. 100 పైగా సినిమాల్లో నటించింది..
GV నారాయణ రావు తండ్రి నవయుగ ఫిలిమ్స్ అనే ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థను నడిపేవారు. 1964లో సారధి స్టూడియోస్‌ను నిర్వహించడానికి ఆయన గుంటకల్ నుండి హైదరాబాద్‌కు మారారు. నారాయణ రావు తమ కుటుంబానికి చెందిన సారధి స్టూడియోస్ గురించి కూడా వివరించారు. ఒకప్పుడు సారధి స్టూడియోస్ ఆక్యుపై చేసిన అమీర్ పేట ప్రాంతం ఇప్పుడు వేల కోట్ల విలువైన ఆస్తిగా మారిందని, మెట్రో స్టేషన్ కూడా స్టూడియో గేటు ఉన్న చోటే ఉందని తెలిపారు. అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నా రెడ్డి ప్రోత్సాహంతో హైదరాబాద్‌కు పరిశ్రమ షిఫ్ట్ అయిందని తెలిపారు. అయితే నాగేశ్వరరావు గారికి సొంత స్టూడియో లేకపోవడంతో, మూతబడిన చల్లపల్లి రాజా గారి సారధి స్టూడియోస్‌లో నవయుగ ఫిలిమ్స్ 45% వాటాలను కొనుగోలు చేసి దానిని పునరుద్ధరించారుని అన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Ramya Krishna : రమ్యకృష్ణ కొడుకు ఇప్పుడేం చేస్తున్నాడంటే.. మొదటిసారి తనయుడి గురించి చెప్పిన కృష్ణ వంశీ..
ఎక్కువ మంది చదివినవి : Folk Song: ఏం పాట భయ్యా.. కుర్రాళ్లకు పిచ్చేక్కించేసింది.. యూట్యూబ్‌ను ఊపేసిన ఫోక్ సాంగ్..