69th National Film Awards 2023: ఉత్తమ నటుడిగా అవార్డ్ అందుకున్న అల్లు అర్జున్.. నేషనల్ అవార్డ్స్ విన్నర్స్ వీళ్లే..
ఈవేడుకలలో స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, ఎంఎం కీరవాణి, దేవీ శ్రీ ప్రసాద్, చంద్రబోస్, కృతి సనన్, అలియా భట్ జాతీయ చలనచిత్ర అవార్డులను అందుకున్నారు. పుష్ప చిత్రంలోని తన నటనక గానూ ఉత్తమ జాతీయ నటుడిగా రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డ్ అందుకున్నారు బన్నీ. ఈ స్పెషల్ మూమెంట్స్‌ను ఆయన సతీమణి స్నేహ రెడ్డి తన ఫోన్ లో బంధించారు. జాతీయ చలనచిత్ర అవార్డుల చరిత్రలో ఈ అవార్డును అందుకున్న తొలి తెలుగు స్టార్‌గా బన్నీ హిస్టరీ క్రియేట్ చేశారు.
National Film Awards
Follow us on
69వ జాతీయ చలనచిత్ర అవార్డులు 2023 ప్రధానోత్సవ వేడుకలు న్యూఢిల్లీలో అట్టహాసంగా జరుగుతున్నాయి. మంగళవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో విజేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ చలనచిత్ర అవార్డులు ప్రదానం చేశారు. ఈవేడుకలలో స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, ఎంఎం కీరవాణి, దేవీ శ్రీ ప్రసాద్, చంద్రబోస్, కృతి సనన్, అలియా భట్ జాతీయ చలనచిత్ర అవార్డులను అందుకున్నారు. పుష్ప చిత్రంలోని తన నటనక గానూ ఉత్తమ జాతీయ నటుడిగా రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డ్ అందుకున్నారు బన్నీ. ఈ స్పెషల్ మూమెంట్స్‌ను ఆయన సతీమణి స్నేహ రెడ్డి తన ఫోన్ లో బంధించారు. జాతీయ చలనచిత్ర అవార్డుల చరిత్రలో ఈ అవార్డును అందుకున్న తొలి తెలుగు స్టార్‌గా బన్నీ హిస్టరీ క్రియేట్ చేశారు. అలాగే “రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్”తో దర్శకుడిగా మారిన ఆర్ మాధవన్ ఉత్తమ ఫీచర్ ఫిల్మ్‌గా జాతీయ అవార్డును కూడా కైవసం చేసుకోగా, ఉత్తమ నటిగా గంగూబాయి కతియవాడి చిత్రానికి అలియా భట్ అవార్డ్ అందుకున్నారు. అలాగే నేషనల్ అవార్డ్స్ అందుకున్న విజేతల జాబితాపై ఓ లుక్కేయ్యండి.
A MONUMENTAL MOMENT FOR TELUGU CINEMA ❤️🔥❤️🔥
ఇవి కూడా చదవండి
Icon Star @alluarjun receives the ‘Best Actor’ Award at the ’69th National Film Awards’ Ceremony for #PushpaTheRise 🔥