Tollywood: ఏం ఛేంజ్ భయ్యా.. మెంటలెక్కిస్తోన్న 143 హీరోయిన్.. ఇప్పుడు చూస్తే మైండ్ బ్లాంకే..

|

Oct 27, 2024 | 11:23 AM

డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన సూపర్ హిట్ చిత్రాల్లో 143 ఒకటి. 2004లో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న ఈ మూవీలో పూరి సోదరుడు సాయి రామ్ శంకర్ హీరోగా నటించగా.. సమీక్ష సింగ్ కథానాయికాగ నటించింది. ఈ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది సమీక్ష.

Tollywood: ఏం ఛేంజ్ భయ్యా.. మెంటలెక్కిస్తోన్న 143 హీరోయిన్.. ఇప్పుడు చూస్తే మైండ్ బ్లాంకే..
143 Movie
Follow us on

సాధారణంగా సినీరంగంలో ఒక్క సినిమాతోనే తెలుగు అడియన్స్ హృదయాల్లో నిలిచిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. మొదటి సినిమాతోనే అందం, అభినయంతో కట్టిపడేసి ఒక్కసారిగా సెన్సెషన్ అయ్యారు పలువురు తారలు. ఆ తర్వాత తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంటూ స్టార్ డమ్ సంపాదించుకోవాల్సిన ఆ హీరోయిన్స్..అనుహ్యంగా సినిమాలకు దూరమయ్యారు. అందులో సమీక్ష సింగ్ ఒకరు. ఈ పేరు చెబితే అసలు గుర్తుపట్టలేరు. కానీ ఒకప్పుడు సూపర్ హిట్ అయిన 143 మూవీ హీరోయిన్ అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన చిత్రాల్లో 143 ఒకటి. 2004లో విడుదలైన భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో పూరి జగన్నాథ్ తమ్ముడు సాయి రామ్ శంకర్ హీరోగా నటించాడు.

అలాగే ఈ సినిమాలో బ్రహ్మానందం, బ్రహ్మాజీ, ఎంఎస్ నారాయణ, అలీ, ధర్మవరపు సుబ్రమణ్యం, ఆశా సైని కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమాలో సాయి రామ్ శంకర్ కు జోడీగా నటించింది సమీక్ష సింగ్. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, పంజాబీ, హిందీ భాషలలో పలు చిత్రాల్లో అభిమానులను సంపాదించుకుంది. అంతేకాదు అప్పట్లో మ్యూజిక్ వీడియోస్ చేసి చాలా పాపులర్ అయ్యింది. కానీ హీరోయిన్ గా ఆమెకు 143 సినిమా. ఈమూవీతో చాలా ఫేమస్ అయ్యింది. ఈ సినిమా తర్వాత అరింతుమ్ అరియమలుమ్ అనే సినిమాతో కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.

తెలుగులో కొత్త కథ, ఇది సంగతి, బ్రహ్మానందం డ్రామా కంపెనీ, సామ్రాజ్యం, దడ, కులుమనాలి వంటి చిత్రాల్లో నటించింది. కానీ 143 తర్వాత సమీక్షకు సరైన బ్రేక్ మాత్రం రాలేదు. బుల్లితెరపై పలు సీరియల్స్ చేసింది. 2020లో సింగపూర్ లో సింగర్ షేల్ ఓస్వాల్ ను వివాహం చేసుకున్న సమీక్ష ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉంటుంది. తన భర్తతో కలిసి మాక్స్, మిన్, మియోజాకి సినిమాలను నిర్మించింది. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.

ఇది చదవండి : Santhosham Movie : నాగార్జున సంతోషం మూవీ హీరోయిన్ గుర్తుందా.. ? ఇప్పుడు గుర్తుపట్టడం కష్టమే..

Arjun Reddy: తస్సాదియ్యా.. ఏం మేకోవర్ భయ్యా.. ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీని ఇప్పుడు చూస్తే ప్రేమలో పడాల్సిందే..

Jr.NTR: వార్ 2 నుంచి ఎన్టీఆర్ ఫోటో లీక్.. మాస్ అండ్ రగ్గడ్‍ లుక్‏లో తారక్.. వేరేలెవల్ అంతే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.