Pawan Kalyan: ఇది బిగినింగ్ మాత్రమే బ్రదర్..! పవన్ ఓజీ పై హైప్ ఎక్కిస్తున్న తమన్..

పవన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేశారు. పవర్ స్టార్ నటిస్తున్న సినిమాల్లో ఓజీ సినిమా పై అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. సుజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రభాస్ తో సాహో  సినిమా చేసిన సుజిత్ ఇప్పుడు ఓజీ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సాహో సినిమా టాక్ ఎలా ఉన్న డార్లింగ్ అభిమానులకు కిక్ ఇచ్చింది. 

Pawan Kalyan: ఇది బిగినింగ్ మాత్రమే బ్రదర్..! పవన్ ఓజీ పై హైప్ ఎక్కిస్తున్న తమన్..
Og
Follow us

|

Updated on: Apr 19, 2024 | 8:39 AM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సినిమాలు చేస్తూనే మరో వైపు రాజకీయాలతో బిజీగాఉన్నారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు  ప్రచారంలో బిజీ బిజీగా ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికొస్తే .. పవన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేశారు. పవర్ స్టార్ నటిస్తున్న సినిమాల్లో ఓజీ సినిమా పై అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. సుజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రభాస్ తో సాహో  సినిమా చేసిన సుజిత్ ఇప్పుడు ఓజీ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సాహో సినిమా టాక్ ఎలా ఉన్న డార్లింగ్ అభిమానులకు కిక్ ఇచ్చింది.  దాంతో ఇప్పుడు ఓజీ సినిమా పై కూడా భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన గ్లింప్స్ సినిమా పై అంచనాలను ఆకాశానికి చేర్చాయి. ఈ సినిమాకు సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్నారు. గ్లింప్స్ కు తమన్ అందించిన మ్యూజిక్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించాయి. ఈ వీడియోలో మ్యూజిక్ హైలైట్ గా నిలిచింది. దాంతో సోషల్ మీడియాలో అభిమానులు ఈ మ్యూజిక్ కు రకరకాల వీడియోలు చేస్తున్నారు.

తాజాగా ఓ పవన్ అభిమాని ఈ మ్యూజిక్ తో ఓ వీడియోను క్రియేట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈవీడియోకు తమన్ రియాక్ట్ అయ్యాడు. పవన్ నడుచుకుంటూ వస్తుంటే వెనకాల బిల్డింగ్ బ్లాస్ట్ అయ్యేలా వీడియోను ఎడిట్ చేశారు. దీని పై తమన్ స్పందిస్తూ.. ఇది కేవలం బిగినింగ్ మాత్రమే అని అన్నారు దాంతో ఈ సినిమా మ్యూజిక్ వేరే లెవెల్ లో ఉండబోతుంది అంటూ హింట్ ఇచ్చారు తమన్. దాంతో ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు. ఓజీ సినిమాలో పవన్ కు జోడీగా ప్రియాంక మోహన్ నటిస్తుంది. ఈ సినిమాను సెప్టెంబర్ 27, 2024 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.