ZEE Telugu Sa Re Ga Ma Pa: యంగ్ సింగర్స్‌కు సూపర్ ఛాన్స్.. హైదరాబాద్‌లో సరిగమప ఆడిషన్స్.. తేదీ, టైమ్ వివరాలివే

మీకు పాటలు పాడడమంటే ఇష్టమా? సంగీత ప్రపంచంలో సత్తా చాటాలని అనుకుంటున్నారా? అయితే మీకిదే సువర్ణావకాశం. యువ గాయకుల కోసం జీ తెలుగు 'సరిగమప - ది నెక్స్ట్ సింగింగ్ సెన్సేషన్' పేరుతో సరికొత్త సీజన్‌ను లాంచ్ చేసింది. ఇందుకోసం మన హైదరాబాద్ లోనే ఆడిషన్స్ నిర్వహిస్తోంది.

ZEE Telugu Sa Re Ga Ma Pa: యంగ్ సింగర్స్‌కు సూపర్ ఛాన్స్.. హైదరాబాద్‌లో సరిగమప ఆడిషన్స్.. తేదీ, టైమ్ వివరాలివే
ZEE Telugu Sa Re Ga Ma Pa

Updated on: Jul 07, 2026 | 5:41 PM

తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని పంచడంలో ముందుండే ఛానల్ జీ తెలుగు. అంతులేని వినోదంతో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూనే ‘సరిగమప’ ద్వారా ప్రతిభావంతులను వెలికితీయడంలోనూ ప్రముఖ పాత్ర పోషిస్తోంది. జీ తెలుగు నిర్వహిస్తున్న పాపులర్ సింగింగ్ షో సరిగమప ఎంతోమంది గాయనీగాయకులను ప్రేక్షకులకు పరిచయం చేసింది. విజయవంతంగా 17 సీజన్లు పూర్తి చేసుకున్న జీ తెలుగు తదుపరి సీజన్ ‘సరిగమప‌- ది నెక్ట్స్ సింగింగ్ సెన్సేషన్’ ను ఘనంగా ప్రారంభించడానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా విస్తృతంగా ఆడిషన్స్ నిర్వహిస్తోంది. ప్రతిభావంతులైన గాయనీగాయకులు జీ తెలుగు అందిస్తున్న ఈ సువర్ణావకాశాన్ని అందిపుచ్చుకోండి. జీ తెలుగు సరిగమప తదుపరి సీజన్ కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బెంగళూరు వ్యాప్తంగా ఆడిషన్స్ నిర్వహిస్తోంది. ప్రతిభను ప్రోత్సహిస్తూ మట్టిలోని మాణిక్యాలను వెలికితీసేందుకు తెలుగు రాష్ట్రాలతోపాటు బెంగళూరులో ఆడిషన్స్ నిర్వహించిన అనంతరం ఈ ఆదివారం జులై 12న హైదరాబాద్లో ఆడిషన్స్ నిర్వహించేందుకు సిద్ధమైంది. 18-35 సంవత్సరాల వయసు గల గాయనీగాయకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ప్రతిభను నిరూపించుకోవచ్చు.

సరిగమప – ఇండియస్ నెక్ట్స్ సింగింగ్ సెన్సేషన్ ఆడిషన్స్ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జరుగుతాయి. జులై 12, ఆదివారం, హైదరాబాద్లోని శ్రీ సారథి స్టూడియోస్, అమీర్ పేట నందు ఆడిషన్స్ జరగనున్నాయి. ఆసక్తి గలవారు జీ తెలుగు అందిస్తున్న ఈ గోల్డెన్ ఛాన్స్ని మిస్ కావద్దు! ఇంకెందుకు ఆలస్యం.. జీ తెలుగు ‘సరిగమప – ది నెక్ట్స్ సింగింగ్ సెన్సేషన్’ టైటిల్ కోసం మీరూ పోటీపడండి!

ఇవి కూడా చదవండి

సారథి స్టూడియోలో ఆడిషన్స్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us