AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Siri Hanmanth: ట్రోల్స్ చూసి డిప్రెషన్‏లోకి వెళ్లాను.. షన్నూ.. దీప్తి బ్రేకప్‏కు నేను కారణం కాదు.. సిరి షాకింగ్ కామెంట్స్..

బిగ్‏బాస్ సీజన్ 5 ముగిసిపోయింది. బిగ్‏బాస్ ఇంట్లో ఉన్నప్పుడు సిరి, షణ్ముఖ్ తమ ప్రవర్తనతో వారిద్దరి ఇమేజ్ పూర్తిగా తగ్గిపోయింది.

Siri Hanmanth: ట్రోల్స్ చూసి డిప్రెషన్‏లోకి వెళ్లాను.. షన్నూ.. దీప్తి బ్రేకప్‏కు నేను కారణం కాదు.. సిరి షాకింగ్ కామెంట్స్..
Siri
Rajitha Chanti
|

Updated on: Jan 16, 2022 | 7:20 AM

Share

బిగ్‏బాస్ సీజన్ 5 ముగిసిపోయింది. బిగ్‏బాస్ ఇంట్లో ఉన్నప్పుడు సిరి, షణ్ముఖ్ తమ ప్రవర్తనతో వారిద్దరి ఇమేజ్ పూర్తిగా తగ్గిపోయింది. అంతేకాకుండా.. వీరిద్దరిపై దారుణంగా ట్రోల్స్ జరిగాయి. అయితే బిగ్‏బాస్ లో ఉన్నప్పుడు షన్నూకు సపోర్ట్ చేస్తూ వచ్చిన అతని ప్రియురాలు దీప్తి.. బిగ్‏బాస్ ముగిసిన తర్వాత మాత్రం షన్నూకు బ్రేకప్ చెప్పి షాకిచ్చింది. దీంతో షణ్ముఖ్, దీప్తి విడిపోవడానికి సిరినే కారణమంటూ ఆమెపై నెటిజన్స్ విరుచుకుపడ్డారు. సోషల్ మీడియాలో సిరిపై నెగిటివ్ కామెంట్స్ చేశారు. బయట ఇద్దరూ వేరే వారితో రిలేషన్ లో ఉన్నప్పటికీ వీరిద్దరూ బిగ్‏బాస్ ఇంట్లో ఎమోషనల్ కనెక్ట్ అయ్యామంటూ.. హగ్గులు, ముద్దులతో ప్రేక్షకులకు విసుగు తెప్పించారు. దీంతో సిరి షణ్ముఖ్ పై లెక్కలేనంత నెగిటివిటి వచ్చేసింది. అందుకే దీప్తి షన్నూకు బ్రేకప్ చెప్పిందని.. ఇందుకు కారణం సిరి అంటూ నెట్టింట్లో ఆమెను ఓ రేంజ్ లో ఆడుకున్నారు. అయితే షన్నూ, దీప్తి బ్రేకప్ అనంతరం తన ఇన్‏స్టాలో పరోక్షంగా స్పందించింది సిరి. షన్నూ.. దీప్తి నావల్ల విడిపోలేదంటూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.

సిరి మాట్లాడుతూ.. బిగ్‏బాస్ షోలో నాకు షణ్ముఖ్, జెస్సీ బెస్ట్ ఫ్రెండ్స్. షన్నూకు నాకు మధ్య ఉన్నది ఫ్రెండ్ షిప్ మాత్రమే. కాకపోతే కొద్దిగా ఎక్కువగా ఎమోషనల్ అయ్యాం. దీప్తి సునయన కూడా నాకు ఫ్రెండే.. తనతో కలిసి వర్క్ చేశాను. బిగ్‏బాస్ నుంచి బయటకు వచ్చాక ఈ ట్రోలింగ్ చూసి డిప్రెషన్‏లోకి వెళ్లాను. దాని నుంచి కాస్త బయటపడిన సమయంలో దీప్తి షన్నూకు బ్రేకప్ చేప్పింది. దీంతో మళ్లీ నామీద నెగిటివిటి పెరిగింది. నావల్ల బ్రేకప్ జరిగేంత బలహీనమైన ప్రేమ కాదు వాళ్లది. నావల్లే అంటే ఆ బ్రేకప్ ఎప్పుడో జరిగేది. ఒక్క బిగ్‏బాస్ వల్లే.. అది కూడా నావల్లే బ్రేకప్ జరగలేదు అంటూ చెప్పుకొచ్చింది.

Also Read: Naga Chaitanya: ఆ విష‌యంలో నాకు స‌మంతే బెస్ట్‌.. ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన నాగ‌చైత‌న్య‌..

Sumanth’s Malli Modalaindi: ఓటీటీకే ఓటేసిన అక్కినేని హీరో.. డైరెక్ట్ డిజిటల్ రిలీజ్‌కు రెడీ అయిన ‘మళ్లీ మొదలైంది’.

Pushpa Srivalli Dance: శ్రీవల్లి పాటకు స్టెప్పులేసి టీమిండియా క్రికెటర్లు.. అదరగొట్టేశారుగా.!

Anasuya Bharadwaj: అనసూయ తమిళ్ మూవీ నయా పోస్టర్ చూశారా.. ఆకట్టుకుంటోన్న అందాల భామ..

రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్