Prerana Kambam: ఘనంగా కృష్ణ ముకుంద మురారి హీరోయిన్ ప్రేరణ పెళ్లి.. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటున్న ఫ్యాన్స్

| Edited By: Ravi Kiran

Nov 23, 2023 | 4:06 PM

మూడు ముళ్ళతో వివాహ బంధంలో అడుగు పెట్టిన ప్రేరణ.. శ్రీపాద జంట ఉన్న ఫోటోలను నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. కన్నడ సంప్రదాయం ప్రకారం ప్రేరణ, శ్రీపాద ల పెళ్లి జరిగింది. పెళ్లి వేడుకకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. శ్రీపాద్ కూడా హీరో అనిపించేటంత అందంగా గా హ్యాండ్ సమ్ గా ఉన్నాడు. ప్రేరణ, శ్రీపాద్ జంట మెడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ ఫ్యాన్స్ శుభాకాంక్షలు చెబుతున్నారు. కొత్త జంటని ఆశీర్వదిస్తున్నారు.

Prerana Kambam: ఘనంగా కృష్ణ ముకుంద మురారి హీరోయిన్ ప్రేరణ పెళ్లి.. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటున్న ఫ్యాన్స్
Prerana Wedding
Follow us on

కన్నడ రంగం  నుంచి తెలుగు బుల్లి తెరపై అడుగు పెట్టి తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్న హీరోయిన్ల లో ఒకరు ప్రేరణ కంభం. కృష్ణ ముకుంద మురారీ సీరియల్ లో కృష్ణగా తనదైన నటనతో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది ఈ తెలుగమ్మాయి. హైదరాబాద్ లో పుట్టి బెంగళూరులో పెరిగిన ఈ క్యూట్ భామ ప్రేరణ తనకు నచ్చిన మెచ్చిన శ్రీ పాద అనే యువకుడిని పెళ్లి చేసుకుంది.

మూడు ముళ్ళతో వివాహ బంధంలో అడుగు పెట్టిన ప్రేరణ.. శ్రీపాద జంట ఉన్న ఫోటోలను నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. కన్నడ సంప్రదాయం ప్రకారం ప్రేరణ, శ్రీపాద ల పెళ్లి జరిగింది. పెళ్లి వేడుకకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. శ్రీపాద్ కూడా హీరో అనిపించేటంత అందంగా గా హ్యాండ్ సమ్ గా ఉన్నాడు. ప్రేరణ, శ్రీపాద్ జంట మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ ఫ్యాన్స్ శుభాకాంక్షలు చెబుతున్నారు. కొత్త జంటని ఆశీర్వదిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మోడల్ రంగం నుంచి కన్నడ బుల్లి తెరపై అడుగు పెట్టి అక్కడ నుంచి కొన్ని కన్నడ సినిమాల్లో నటించి మంచి నటిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ప్రేరణ కంభం. వాస్తవానికి ప్రేరణ కు నటిగా అవకాశం తన బంధువు నటిస్తున్న ఓ సీరియల్ లో అవకాశం అందుకుని నటిగా బుల్లి తెరపై ‘హరహర మహాదేవ’ సీరియల్‌తో అడుగు పెట్టింది.

సీరియల్స్ తర్వాత ప్రేరణ తొలిసారి ‘చూరికట్టె’ సినిమాలో హీరోయిన్‌గా కనిపించింది. ఈ సినిమా 2018లో విడుదలైంది. ఆ తర్వాత ‘పెంటగాన్‌’, ‘ఒడంకె కాదు’, ‘అనా’, ‘ఫిజిక్స్‌ టీచర్‌’ వంటి సినిమాల్లో కూడా ప్రేరణ కంబం నటించింది. బెంగళూరు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘ఫిజిక్స్ టీచర్’ చిత్రాన్ని ప్రదర్శించారు. ఆ తర్వాత మరెక్కడా కనిపించలేదు. ‘రంగనాయకి’ సీరియల్‌లో హీరోయిన్‌గా బంగారి పాత్రతో మంచి నటిగా పేరు తెచ్చుకున్న ఈ తెలుగమ్మాయి కృష్ణ ముకుంద మురారీ సీరియల్ తో కృష్ణగా తెలుగు సీరియల్ లో అడుగు పెట్టింది.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..