దెయ్యాన్ని చూసిన యూపీ పోలీసులు…కానీ…

సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత రూమర్స్ ను ప్రచారం చేయడం చాలా ఈజీగా మారింది.  దెయ్యం కనిపించిందంటే చాలు జనం ఆ వీడియోను తెగ వైరల్ చేస్తుంటారు. ఇలాంటి ఓ దెయ్యం వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అది ఎంతలా అంటే వీడియోను చూసినవారు నిజమేనని నమ్మించేంత స్థాయిలో,,,  ఆ వీడియో మీడియాను నెటిజన్లు షేర్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ఓ ఓపెన్ జిమ్ లోని పరికరం ఒకటి దానంతట అదే కదులుతున్న వీడియో. […]

  • Sanjay Kasula
  • Publish Date - 7:13 pm, Sat, 13 June 20
దెయ్యాన్ని చూసిన యూపీ పోలీసులు...కానీ...

సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత రూమర్స్ ను ప్రచారం చేయడం చాలా ఈజీగా మారింది.  దెయ్యం కనిపించిందంటే చాలు జనం ఆ వీడియోను తెగ వైరల్ చేస్తుంటారు. ఇలాంటి ఓ దెయ్యం వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అది ఎంతలా అంటే వీడియోను చూసినవారు నిజమేనని నమ్మించేంత స్థాయిలో,,,  ఆ వీడియో మీడియాను నెటిజన్లు షేర్ చేశారు.

ఉత్తరప్రదేశ్‌లోని ఓ ఓపెన్ జిమ్ లోని పరికరం ఒకటి దానంతట అదే కదులుతున్న వీడియో. సోషల్ మీడియాలో ఈ వీడియోను చూసిన చాలామంది… దెయ్యం ఎక్సర్ సైజులు చేస్తోందని ప్రచారం మొదలు పెట్టారు. అదేంటో తేల్చేద్దామని ఝాన్సీ టౌన్ పోలీసులు రంగంలోకి దిగారు. మొదటగా వారికి కూడా ఆశ్చర్యానికి గురిచేసింది అక్కడి సీన్… అది దెయ్యం పనికాదు కొందు ఆకతాయిలు చేసిన ట్రిక్ అని  ఆ తర్వాత తేల్చేశారు.

ఆ పరికరానికి గ్రీజు ఎక్కువ పూస్తే దాని కదలికల్లో వేగం పెరుగుతుందని ఝాన్సీ పోలీసులు వెల్లడించారు. అంతేకాదు, పోలీసులు కూడా గ్రీజు పూసి ఈ పరికరాన్ని పరీక్షించి చూశారు. ఆ వీడియోను సోషల్ మీడియో పెట్టడంతో ఇది కూడా వైరల్ గా మారింది.