Brahmamudi, October 30th Episode: కావ్య కొట్టిన దెబ్బ మామూలుగా లేదుగా.. పాపం అనామిక!

|

Oct 30, 2024 | 12:19 PM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. నష్టాల్లో ఉన్న అరవింద్ కంపెనీ కొనాలని కావ్య ఫిక్స్ అవుతుంది. అదే విషయం రాజ్‌కి తెలిసి.. కావ్యపై సీరియస్ అవుతాడు. హేయ్ నీకు మెంటలా? అని రాజ్ అడుగుతాడు. మిస్టర్ మేనేజర్ హోల్డ్ యువర్ టంగ్.. ఐ యామ్ సిఈవో.. రేపు వేలం పాటలో ఆ కంపెనీని కొనడానికి అన్ని ఏర్పాటు చేయండి. అందులో మనం పాల్గొంటున్నామని.. కావ్య అంటుంది. చూడు నువ్వు రాంగ్ డెసిషన్స్ తీసుకుంటున్నావ్. తాతయ్య నిన్ను నమ్మి ఈ కంపెనీ అప్పగిస్తే..

Brahmamudi, October 30th Episode: కావ్య కొట్టిన దెబ్బ మామూలుగా లేదుగా.. పాపం అనామిక!
Brahmamudi
Image Credit source: Disney hotstar
Follow us on

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. నష్టాల్లో ఉన్న అరవింద్ కంపెనీ కొనాలని కావ్య ఫిక్స్ అవుతుంది. అదే విషయం రాజ్‌కి తెలిసి.. కావ్యపై సీరియస్ అవుతాడు. హేయ్ నీకు మెంటలా? అని రాజ్ అడుగుతాడు. మిస్టర్ మేనేజర్ హోల్డ్ యువర్ టంగ్.. ఐ యామ్ సిఈవో.. రేపు వేలం పాటలో ఆ కంపెనీని కొనడానికి అన్ని ఏర్పాటు చేయండి. అందులో మనం పాల్గొంటున్నామని.. కావ్య అంటుంది. చూడు నువ్వు రాంగ్ డెసిషన్స్ తీసుకుంటున్నావ్. తాతయ్య నిన్ను నమ్మి ఈ కంపెనీ అప్పగిస్తే.. ఇలా చేస్తావా? అని రాజ్ అంటాడు. కానీ కావ్య వినకుండా రాజ్‌కి వార్నింగ్ ఇచ్చి పంపిస్తుంది. ఆ తర్వాత కావ్య.. స్వప్నకు ఫోన్ చేస్తుంది. రుద్రాణిని దెబ్బ కొట్టడానికి నీకు మంచి అవకాశం దొరికిందని చెబుతుంది. దీంతో స్వప్న చాలా సంబర పడుతుంది. ఏం చేయాలో చెప్పు అని స్వప్న ఆతృత పడుతుంది. సరేలా చెప్తున్నా విను.. అది రుద్రాణికి తెలిసేలా చేయమని అంటుంది.

రుద్రాణిని పిచ్చి దాన్ని చేసిన స్వప్న..

అలాంటి దాని కోసమే ఇన్ని రోజులూ వెయిట్ చేస్తున్నా. లాస్ట్ టైమ్‌ ముసుగు వేసి కొట్టినా సరిపోలేదు కానీ ఏం చేయాలో అచెప్పు అని అంటుంది. దీంతో కావ్య అంతా చెబుతుంది. అర్థమైంది.. మా అత్తను వాడుకుని.. ఆ అనామికను రెచ్చగొట్టాలి అంతేగా అని స్వప్న అంటే.. సరే జాగ్రత్తగా చేయి.. అనుమానం రాకుండా అని కావ్య అంటుంది. నమ్మించడంలో నేను కిలాడిని అని స్వప్న అంటుంది. ఇక రంగంలోకి దిగుతుంది. అనుకున్నట్టుగానే స్వప్న రుద్రాణి, రాహుల్‌ల ముందు వచ్చి మాట్లాడుతుంది. ఏంటే నువ్వు చెప్పేది నిజమా.. వావ్ కంగ్రాట్స్. వేలం పాటలో ఆ కంపెనీ కొంటే కోట్లలో లాభం వస్తుందా? అని రుద్రాణి, రాహుల్‌లు వినేలా మాట్లాడుతుంది. ఏంటీ ఆ అరవింద్ కంపెనీకి ఫారిన్ ఇన్వెస్టర్స్ ఉన్నారా.. నీ ఐడియా సూపర్ అంటుంది. ఆ తర్వాత ఏమీ తెలీనట్టు.. ఓహో మీరు ఇక్కడే ఉన్నారా? అని అంటుంది. కావ్యతో మాట్లాడుతున్నావ్ అని అర్థమైంది. ఇంతకీ ఏంటని నటిస్తూ రుద్రాణి అడుగుతంది. మీ లాంటి వాళ్లకు ఆ విషయం చెప్పి దాని విజయానికి అడ్డం రావడం ఎందుకు? తప్పుకుంటుంది స్వప్న.

అనామికకు రుద్రాణి ఫోన్..

ఇక కావ్య ప్లాన్ అనుకున్నట్టుగానే రుద్రాణి అనామికకు ఫోన్ చేస్తుంది. అరవింద్ కంపెనీ గురించి మొత్తం చెబుతుంది. అది విన్న సామంత్.. మనం ఏం చేస్తాం.. ఆ కంపెనీ అసలే దివాలా తీసిందని అంటాడు. ఆ కావ్య ఏదీ ఆలోచించకుండా చేయదు. ఇప్పుడు మనం ఆ వేలం పాటలో పాడి అరవింద్ కంపెనీకి కొంటున్నామని అనామిక అంటుంది. ఇక సరే అని అంటాడు అరవింద్. ఇక రాజ్ ఇంటికి వచ్చేసరికి అందరూ భోజనం చేస్తారు. వాళ్ల దగ్గరకు వెళ్లి.. ఏంటి అందరూ భోజనం చేస్తున్నారా? చేయండి.. రేపటి నుంచి మీ సిఈవో మిమ్మల్ని ప్రశాంతంగా భోజనం చేయనివ్వదని రాజ్ అంటే.. ఇప్పుడు ఏమైందని అపర్ణ అంటుంది. ఆ కళావతి క్యాన్సర్ కనకాన్ని మించిపోయి.. ఏవేవో చేస్తుంది. ఇది చాలా పెద్ద విషయం. మీ మనవరాలు నష్టాల్లో ఉన్న అరవింద్ కంపెనీని కొనడానికి రెడీ అయ్యింది. అది కొంటే కోట్లలో నష్టం వస్తుంది. కంపెనీ దివాలా తీయడం ఖాయం అని రాజ్ అంటే.. చిట్టీ ఈ కూర ఏంటే ఇంత ఘుమఘుమలాడుతుంది. నువ్వే వంట చేశావా? అని సీతారామయ్య అంటాడు. నేను ఏం మాట్లాడుతుంటే.. మీరు కూరల గురించి మాట్లడుతున్నారంటి?

ఇవి కూడా చదవండి

కావ్యని వేలం పాటకు వెళ్లకుండా చేయాలి..

కావ్య ఆ వేలం పాట పాడకుండా ఇక్కడే అడ్డుకోవాలి. కావ్య గెలిస్తే మా నాన్న కిరీటం పెట్టి పెడతాడని అంతలా చెబుతుంటే పట్టించుకోరేంటి? అని రుద్రాణి అంటుంది. నీ కొడుకు వెళ్లి పది కోట్లు నష్టం తెచ్చాడు.. ఏమైనా అన్నామా అని ఇందిరా దేవి అంటాడు. విన్నారా నాన్నా అని రుద్రాణి అంటే.. వంటలు చాలా బాగున్నాయని సీతారామయ్య పట్టించుకోనట్లు అంటాడు. అపర్ణ చేసింది.. అందుకే ఇంత బాగున్నాయని ఇందిరా దేవి అంటుంది. అయినా కావ్య చేసినట్టు ఏమున్నాయని.. అపర్ణ, ప్రకాశంలు కావ్య మీద పొగడ్తల వర్షం కురిపిస్తారు. ఇక రాజ్‌ తరపున ధాన్య లక్ష్మి కూడా మాటలు ఆడటంతో సీతారామయ్య లేచి.. సిఈవోని పెట్టా మొత్తం హక్కులన్నీ వారికే ఉంటాయి. అదేంటని ప్రశ్నించే అధికారం ఉండదు. కావ్యపై నాకు పూర్తి నమ్మకం ఉందని అనేసి వెళ్తాడు. విన్నావు కదా.. వచ్చి తిను అని ఇందిరా దేవి అంటే.. పెట్టారుగా గడ్డి.. నెమరేసుకుంటూ తిను అని రాజ్ కోపంగా వెళ్తాడు.

కళ్యాణ్‌ని వాడేసుకుంటున్న లిరిక్ లక్ష్మీ..

మరోవైపు లక్ష్మీ కాంత్ చెప్పిన అమ్మ పాటను ఫోన్‌లో పాడి వినిపిస్తాడు కళ్యాణ్. అద్భుతంగా ఉందని చప్పట్లు కొడతాడు. నువ్వు నీ గురించి ఇచ్చిన బిల్డప్‌ విని క్లాప్స్ కొట్టాలని పిస్తుంది. కానీ జస్ట్ యావరేజ్‌గా ఉందని చెప్పగానే.. అప్పూకి చాలా కోపం వస్తుంది. చూడు తమ్ముడు చెప్పాను కదా నీలో చాలా విషయం ఉందని.. దానికి పదును పెట్టాలి. నువ్వు పాడిన పాటను మెసేజ్ చేయి.. నీకు ఐదు వేలు పంపుతానని అంటాడు. సరే సర్ థాంక్యూ అని కళ్యాణ్ అంటాడు. వాడు నిన్ను వాడుకుంటున్నాడని నాకు అర్థమైందని అప్పూ సీరియస్ అవుతాడు. ఆ తర్వాత ఏంటి సార్ మీరు డబ్బులు ఇస్తున్నారా? అని పక్కన ఉన్న అతను అంటే.. వాడిలో చాలా విషయం ఉంది రా.. ఈ పాట జనాల్లోకి వెళ్తే ఆ విషయం వాడికి కూడా అర్థమై పోతుంది. ఇప్పుడు వాడికి డబ్బు ఇచ్చి గుప్పిట్లో పెట్టుకోపోతే.. వాడే సొంత ప్రయత్నాలు మొదలు పెడతాడని అంటాడు లిరిక్ లక్ష్మీ.

కావ్యకు సీతారామయ్య ఫోన్..

ఆ తర్వాత కావ్య భోజనం చేస్తుండగా సీతా రామయ్య ఫోన్ చేసి.. రాజ్ అన్న విషయం చెప్తాడు. కానీ నాకు నీ గురించి తెలుసు కాబట్టి.. అందరి ముందు వాడి మాటలు కొట్టి పారేశాను. కానీ ఎందుకైనా మంచిదని హెచ్చరించడానికి ఫోన్ చేశానని అంటాడు. తాతయ్య గారు మీరు కంగారు పడకండి.. నా వల్ల ఎలాంటి నష్టం రాదని కావ్య అంటుంది. మన ప్రయత్నం సరిగ్గా ఉన్నా.. మన చుట్టూ ఉన్నావళ్లు మోసం చేయడానికి సిద్ధంగా ఉంటారని సీతారామయ్య అంటాడు. ఇక ఇక్కడితో ఇవాళ్టి ఎపిసోడ్ ముగుస్తుంది. రేపటి ఎపిసోడ్‌లో కావ్య ప్లాన్ సక్సెస్ అవుతుంది. వేలం పాటలో అనామికను రెచ్చ గొట్టి వేలం పాటలో ఎక్కువగా పాడేలా చేస్తారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..