Brahmamudi, December 18th Episode: ఇంటికి వచ్చేసిన బ్యాంక్ వాళ్లు.. నడి రోడ్డు మీద నిలబడతారా..

|

Dec 18, 2024 | 11:14 AM

ఇంటి బాధ్యతల నుంచి తప్పించమని కావ్య అత్తగారిని వేడుకుంటుంది. కానీ కావ్యకు ధైర్యం చెప్పి పంపిస్తుంది అపర్ణ. మరోవైపు డబ్బులు ఈజీగా గుంజాలని రాహుల్ ప్లాన్ చేస్తాడు. అది తెలిసి స్వప్న, రుద్రాణిలు చివాట్లు పెడతారు. మరోవైపు బ్యాంక్ వాళ్లు ఇంటికి వచ్చేస్తారు..

Brahmamudi, December 18th Episode: ఇంటికి వచ్చేసిన బ్యాంక్ వాళ్లు.. నడి రోడ్డు మీద నిలబడతారా..
Brahmamudi
Image Credit source: Disney Hotstar
Follow us on

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. అత్తగారి దగ్గర కావ్య తన బాధ చెప్పుకుంటూ ఉంటుంది. నేను ఈ బాధ్యతలు మోయలేనని, దీని నుంచి నాకు విముక్తి కల్పించాలని అంటుంది. ఈ బరువును వదిలించుకుని మీరు చాలా సంతోషంగా ఉన్నారు. నాకు ఈ బాధ్యతలు వద్దు అత్తయ్యా అని కావ్య అంటే.. అపర్ణ నవ్వుతుంది. ఈ మాత్రం దానికి బెదిరిపోతే ఎలా? 25 ఏళ్లుగా ఈ బరువును మోస్తూనే ఉన్నాను కదా.. ఇది నీకు అలవాటు అవుతుందని ఇచ్చానని అపర్ణ అంటే.. అలవాటు అయ్యేసరికి ఈ ఖజానా మొత్తం ఖాళీ అవుతుందని కావ్య అంటే.. అందుకే పెద్దలు అంటారు పాత్రను ఎరిగి దానం చేయాలి అని.. అవతల వాళ్ల అవసరం తెలుసుకుని.. అది అవసరమో అనవసరమో తెలుసుకుని.. సగం ఆపి ఇచ్చి.. ఇతర ఖర్చులను ఆపి ఇస్తున్నట్టు ఇవ్వాలి. నోరు తెరిచి అడుగుతున్నారని కాదనలేక ఇస్తే.. సగం చల్లబడిపోతారు. మావయ్య గారికి తెలిస్తే నాకు చివాట్లు పెడతారని చెప్తే.. మిగతా చల్లబడతారని అపర్ణ అంటుంది.

బాధ్యతల నుంచి తప్పించమని కావ్య బాధ..

వాళ్లు మిమ్మల్ని అడిగినంత ఒదికగా అడుగుతున్నారు అనుకున్నారా.. ఏ పో తీసుకు రా పో.. ఇన్ని లక్షలా అని దీర్ఘాలు తీస్తున్నావ్ ఏంటి? అని దబాయిస్తున్నారు. నా వల్ల ఈ ఇంట్లో గొడవలు జరగడం నాకు ఇష్టం లేదు. అత్తయ్యా ప్లీజ్.. ఈ బాధ్యతల నుంచి నన్ను తప్పించమని కావ్య అంటే.. నువ్వేం దేవతవు కాదు అందరికీ నచ్చడానికి మనిషివి. ఉమ్మడి కుటుంబం అన్నాక గొడవలు రావడం సహజం. కాబట్టి అర్థమయ్యే విధంగా సర్ది చెప్పాలి. నువ్వు ఎప్పుడైతే తప్పును తప్పు అని ధైర్యంగా చెబితేనే.. అప్పుడే నీకు అలవాటు అవుతుంది. డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉంటేనే ఎదుటి వాళ్ల ఖర్చులు తగ్గుతాయి. తీసుకోనే నీ వెనుక నేను ఉన్నాను అపర్ణ.. కావ్యకి ధైర్యం చెబుతుంది.

రాహుల్ మనీ ప్లాన్..

మరోవైపు రాహుల్ డబ్బు గురించి ఆలోచిస్తూ.. ఈ ఇంట్లో డబ్బులు సంపాదించడం ఇంత తేలిక అని నాకు తెలీదు. తాతయ్య పేరు చెప్పి ఎవరు వచ్చి అడిగినా డబ్బులు ఇచ్చేస్తారు అన్నమాట. దీన్నే అడ్డం పెట్టుకుని.. నా ఫ్రెండ్స్‌ని రంగంలోకి దించి.. కోట్లు కొల్లగొడతానని రాహుల్ ప్లాన్ వేస్తాడు. అన్నట్టుగానే తన ఫ్రెండ్‌కి ఫోన్ చేసి.. మా తాతయ్య మాట ఇచ్చారని, రూ.50 లక్షలు కావాలని చెప్పు. ఆ డబ్బు నేను నీ దగ్గర నుంచి తర్వాత తీసుకుంటానని రాహుల్ చెబుతూ ఉండగా.. స్వప్న చప్పట్లు కొడుతుంది. ఇన్నాళ్లూ నీకు బుర్ర తక్కువ అని మాత్రమే అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు అర్థమైంది నీకు అసలు బుర్రే లేదని స్వప్న తిడుతుంది. నా ప్లాన్ నీకు అర్థం కాలేదా అని రాహుల్ అంటే.. అదొక ప్లాన్.. మళ్లీ దాన్ని నేను అర్థం చేసుకోవాలా.. ఇలా చీప్‌గా ఆలోచించడానికి సిగ్గుగా లేదా నీకు? అని స్పప్న అంటుంది. అప్పుడే రుద్రాణి వస్తుంది. ఎందుకు వాడిని తిడుతున్నావ్ అని అడుగుతుంది. ఇప్పుడు వాడు పాత రాహుల్ కాదు.. జీనియస్ అప్ డేటెడ్ వర్షన్ అని రుద్రాణి అంటే.. ఇప్పుడు నీ కొడుకు చేసిన పని తెలిస్తే.. మీరే అప్ డేట్ స్పెల్లింగ్ రాయిస్తారని స్వప్న అంటే.. ఏం చేశాడని రుద్రాణి అంటుంది.

ఇవి కూడా చదవండి

రాహుల్ మనీ ప్లాన్‌కి రుద్రాణి చివాట్లు..

అదే మామ్ ఎవరో బయట వాళ్లు వచ్చి.. తాతయ్య పేరు చెబితే ఐదు లక్షలు ఇచ్చారు కదా.. అలాగే మా ఫ్రెండ్స్‌కి ఫోన్ చేసి తాతయ్య చెప్పాడని రూ.50 లక్షలు అడగమని చెప్పానని రాహుల్ అంటే.. రుద్రాణి కోపంగా చూస్తుంది. బ్రెయిన్ తక్కువ అయింది దానికి కాదురా.. నీకు.. ఎవరో వచ్చి అడిగితే డబ్బులు ఎందుకు ఇస్తారు? వాళ్లు ఎవరు? ఏంటి? అని ఆరాలు తీసుకుంటారు కదా.. వేస్ట్ ఫెలో.. ఇప్పుడు ఈ ప్లాన్ నువ్వు చేసి ఉంటే రేపు అందరి ముందు తలదించుకుని నిలుచునేవాళ్లమని అని రుద్రాణి తిడుతుంది. మరోవైపు రాజ్ హాలులో అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు. రాజ్‌ని చూసిన కావ్య.. రాత్రి కాఫీ తీసుకెళ్తే చెడామడా తిట్టారు. ఇప్పుడు కాఫీ తీసుకొచ్చి ఇస్తే.. నా నెత్తిమీదనే పోసేలా ఉన్నారు. ఎందుకొచ్చిందిలే అని కావ్య వంటగదిలోకి వెళ్తుంది. మళ్లీ రాజ్ ఆలోచిస్తూ ఉంటాడు. కావ్య పట్టించుకోకుండా వెళ్తే.. ఏయ్ ఆగు.. ఇక్కడ నేనొకడిని ఉన్నాను కదా.. కాఫీ ఇవ్వాలని తెలీదా అని రాజ్ అంటే.. రాత్రి అంత రచ్చ చేశాక ఇప్పుడు కూడా మళ్లీ అరుస్తారేమోనని ఇవ్వలేదని కావ్య అంటే.. ఏయ్ ఏంటి నేనంత ట్రిపికల్ మైండ్ అనుకుంటున్నావా.. ప్రతీ దానికి చిరాకు పడతాను.. అగ్రిసివ్‌గా ఉంటాను అనుకుంటున్నావా అంటూ రాజ్ చెడామడా తిడతాడు.

వంద కోట్ల గురించి రాజ్ కంగారు..

మీరు నన్ను ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టారు.. అప్పుడే ఏమీ అనుకోలేదు.. ఇప్పుడు కూడా ఏం అనుకుంటానని కావ్య అంటుంది. సరే వెళ్లి కాఫీ తీసుకురమ్మని చెబుతాడు రాజ్. ఆ తర్వాత పోలీస్ ఇంటి దగ్గరకు వచ్చి ఫోన్ చేస్తాడు. దీంతో రాజ్ కూడా బయటకు వచ్చి పోలీస్‌ని కలుస్తాడు. అతను బ్యాంకాక్ వెళ్లాడని.. వాడిని పట్టుకోవడం చాలా కష్టమని పోలీస్ అంటే.. ప్లీజ్ వాడు నాకు కావాలి. ఎలాగైనా పట్టుకోవాలని రాజ్ చెబుతూ ఉంటే.. కావ్య కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది. దీంతో రాజ్ కసురుకుంటాడు. అదంతా చూసిన అపర్ణ.. రాజ్ అంటూ అరుస్తుంది. దీంతో పోలీస్ వెళ్లిపోతాడు. ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటూ ఉంటే కాఫీ ఇవ్వడం తప్పా.. ఏంటి అంత సీక్రెట్‌గా మాట్లాడుకునే విషయం. పరాయి మగవాడి ముందు నీ భార్యని అవమానిస్తావా? అన్నట్టుల్లా పడుతుంది కదా అని ఎవరి ముందు పడితే వారి ముందు తిడతావా.. నీ చదువు నీకు ఇదే నేర్పిందా.. ఇంటి ఇల్లాలిని చులకన చేసి మాట్లాడటం తప్పు అంటూ అపర్ణ తిడుతుంది. దీంతో రాజ్ కావ్యకి సారీ చెబుతాడు. రాజ్ సారీ చెప్పడంతో అపర్ణ, కావ్య ఆశ్చర్య పడతారు. ఏమైంది వీడికి.. చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. అప్పుడే అరిచి.. ఇప్పుడే సారీ చెప్పాడు. ఏంటో మీ వారు నాకేం అర్థం కావడం లేదని అపర్ణ అంటే.. అసలు ఏమైంది ఈయనకి అంటూ కావ్య అనుమాన పడుతుంది.

మీరు ఏదో దాస్తున్నారు..

ఇక రాజ్ దగ్గరకు వెళ్తుంది కావ్య. ఏంటి కంగారు పడుతున్నారని కావ్య అడిగితే.. అబ్బే లేదని రాజ్ అంటాడు. మీరు ఏదో దాస్తున్నారు ఏంటి? అని కావ్య అడిగితే.. రాజ్ చెప్పకుండా దబాయిస్తాడు. అసలు మీ సమస్య ఏంటి? చెప్పమని కావ్య అడిగితే.. అవును నేను చాలా సమస్యలో ఉన్నాను. అందరికీ చెప్పకుండా దాటేస్తున్నాను. అలా దాటేయడం కంటే నాకు చెబితే ఏదన్నా పరిష్కారం చెబుతానని కావ్య అంటే.. సరే ఒక శత్రు సైన్యం.. మన రాజ్యం మీద దండెత్తబోతుంది. వాళ్ల దగ్గర వందల మంది సైనికులు ఉన్నారు. నీ దగ్గర వంద మంది సైనికులు ఉంటే అప్పు ఇస్తావా అని రాజ్ అడుగుతాడు. అర్థంమైంది.. మీకు పెళ్లాం పక్కన పడుకుంటేనే గిట్టదు.. ఇక నాకు మీ రహస్యాలు చెబుతారా.. నేను ఎప్పుడూ ఒంటరిగానే పోరాడుతానని కావ్య అంటుంది.

ఇంటికి వచ్చిన బ్యాంక్ వాళ్లు..

ఆ తర్వాత బ్యాంక్ వాళ్లు ఇంటికి వస్తారు. ఎవరు మీరు ఇలా ఇంటికి వస్తున్నారు ఏంటి? అని సుభాష్ అడిగితే.. మేము బ్యాంక్ నుంచి వస్తున్నామని అంటారు. అందరూ హాలులోనే ఉంటారు. మీ నాన్న గారు దుగ్గిరాల సీతారామయ్య గారు ఆయన ఫ్రెండ్‌కి వంద కోట్లకు శూరిటీ పెట్టారు. ఇప్పుడు మీ ప్రాపర్టీస్ అంతా సీజ్ చేసి జప్తు చేస్తామని అంటారు. దీంతో అందరూ షాక్ అవుతారు. కనీసం నోటిసు కూడా ఇవ్వకుండా జప్తు చేస్తానంటే ఎలా? అని సుభాష్ అడిగితే.. మీ ఆఫీసులో ఎంట్రెన్స్‌లోనే నోటీసు అంటించాం. రాజ్ గారికి కూడా చెప్పాం.. టైమ్ ఇచ్చాం అది కూడా పూర్తి అయిపోయింది. ఇక మేము చేసేది ఏమీ లేదు ఆస్తుల్ని జప్తు చేయాల్సిందే. వెంటనే ఇల్లు ఖాళీ చేయమని బ్యాంక్ వాళ్లు అంటారు.

ఆస్తుల పోయినందుకు రుద్రాణి, ధాన్యలక్ష్మి బాధ..

వామ్మో వామ్మో అయిపోయింది.. అంతా అయిపోయింది.. ఆ ముసలోడు ఎంత పని చేశాడు. నడి రోడ్డు మీద నిలబెట్టేశాడని రుద్రాణి అంటే.. రుద్రాణి మీ నాన్న గురించి నోరు జారొద్దని ఇందిరా దేవి అంటే.. ఇంకా ఆ ముసలోడికి గౌరవం ఇచ్చేది ఏంటి? చూశావా ధాన్యలక్ష్మి.. నేను ముందు నుంచి చెబుతూనే ఉన్నాను. ఆస్తులు రాయించుకో జాగ్రత్త పడమని నా మాట ఎవరూ వినలేదని రుద్రాణి అంటుంది. వీళ్లు నా మాట విన్నారా.. ఇప్పుడు చూడండి ఆస్తులు లేకుండా చేశారు. అందరం కలిసి ఇప్పుడు నడి వీధిలో నిలబడాలి. మీకు ఏదన్నా పని చేయడం చేతనవుతుందా? మీ కొడుకు ఆటో నడిపి అందర్నీ పోషించాలి. కోడల్ని ఎప్పుడూ ఈ ఇంటికి రానివ్వ లేదు. అది ఇప్పుడు మనల్ని ఆ గుమ్మం తొక్కనిస్తుందా? అని ధాన్యలక్ష్మి నోరు పారేసుకుంటుంది. ధాన్యలక్ష్మి.. కష్టం అయినా.. నష్టం అయినా అందరం కలిసి పంచుకుందామని అపర్ణ అంటుంది. ఇక ఇక్కడితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..