ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. రాజ్ అత్తింటికి చేరుకుంటాడు. అయితే కనకం, కృష్ణమూర్తిలు రాజ్‌ని పట్టించుకోకుండా ఆట పట్టిస్తూ ఉంటారు. దీంతో రాజ్ ఉడుక్కుంటూ ఉంటాడు. కావ్యను, వాళ్ల బావను కలవకుండా చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈ లోపు సుభాష్.. ఇంట్లో ఫోన్‌లో సీరియస్‌గా మాట్లాడుతూ ఉంటాడు. తమ కంపెనీకి ఫైర్ యాక్సిడెంట్ కావడంతో 50 లక్షల రూపాయలు నష్టం వస్తుంది. దీంతో స్టాఫ్ మీద సీరియస్ అవుతాడు. ఇన్సూరెన్స్ చేయమని మీ తమ్ముడు ప్రకాష్‌కి చెప్పాం అని చెబుతారు స్టాఫ్. మా తమ్ముడికి లక్ష పనులు ఉంటాయి.. మిమ్మల్ని ఎందుకు పెట్టాను చూసుకోవాలి కదా అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఈ మాటల్ని ధాన్యలక్ష్మి, అపర్ణ వింటారు. ఏమైందని అపర్ణ అడుగుతుంది. ప్రకాష్ ఎక్కడ అని సుభాష్ సీరియస్‌గా అడుగుతాడు.
ఇంతలో ప్రకాష్ వచ్చి ఏమైందని కూల్‌గా అడుగుతాడు. గోడౌన్‌కి స్టాక్ రాగానే ఇన్సూరెన్స్ చేయించమని చెప్పాను కదా.. ఎందుకు చేయించలేదని గట్టిగా అడుగుతాడు. అయ్యో మర్చిపోయాను అన్నయ్యా అని ప్రకాష్ కంగారుగా చెప్తాడు. నీ మతిమరుపు వల్ల రూ.50 లక్షల నష్టం వచ్చిందని సుభాష్ అంటాడు. దీంతో సారీ అన్నయ్యా అని ప్రకాష్ అంటాడు. ఇలా ఎన్ని సార్లు సారీ చెప్తావురా.. ఒక్కసారి చెప్తే నీకు అర్థం కాదా.. ఎప్పుడూ అజాగ్రత్తగానే ఉంటావ్. ఇంతకు ముందు కూడా ఇలానే చేశావ్. నీ కింద మేనేజర్‌ని పెట్టాను కదా.. గుర్తు చేస్తూనే ఉంటారు. ఏం కాదులే అని వదిలేస్తావ్ అని సుభాష్ అంటే.. ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటాను అని ప్రకాష్ అంటాడు. ఏంటి నువ్వు చూసుకునేది.. ఇలా చాలా సార్లు జరుగుతుంది అని సుభాష్ అంటూ ఉండగా.. చాలు ఆపండి బావగారూ.. ఏంటి బావగారూ ఇది.. ఇందాకటి నుంచి చూస్తున్నా.. మీ కింద పని చేసే పనివాడిని తిడుతున్నట్టు తిడుతున్నారు? ఆయన ఏమన్నా చిన్న పిల్లాడు అనుకుంటున్నారా.. బానిసల్లా చూస్తున్నారని ధాన్య లక్ష్మి రెచ్చిపోతుంది.
మా అన్నయ్యా.. నేనూ ఏమన్నా మాట్లాడుకుంటాం. మధ్యలో నువ్వు రాకు. దయచేసి లోపలికి వెళ్లు అని ప్రకాష్ అంటాడు. దీంతో నన్ను క్షమించు అమ్మా.. తప్పు అయిపోయింది. ధాన్య లక్ష్మి చెప్పింది నిజమే. ఇన్నాళ్లూ నువ్వు నా తమ్ముడివి అనుకున్నా.. కానీ మన మధ్య కూడా ఇలాంటివి ఉంటాయి అనుకోలేదని సుభాష్ అనేసరికి.. ప్రకాష్, అపర్ణ షాక్ అవుతారు. చాలా అనుకున్నది సాధించావ్.. సొంత అన్నయ్య.. తమ్ముడికి క్షమాపణలు చెప్పేంత వరకూ తీసుకొచ్చావ్ అని అపర్ణ సీరియస్ అవుతుంది. ఏయ్.. లోపలికి పదా.. రా అని తీసుకెళ్లి ధాన్య లక్ష్మికి చివాట్లు పెడతాడు ప్రకాష్. నేనే తప్పు చేస్తే మా అన్నయ్యా అరిచాడు. ఇన్నాళ్లుగా అన్నయ్య న్ను భరిస్తున్నాడు. మధ్యలో నీకెందుకు అని ప్రకాష్ అంటే.. మీ గౌరవమే నా గౌరవం కాబట్టి.. ఇన్నాళ్లూ అదే చేశానని ధాన్య లక్ష్మి అంటే.. నువ్వు మారిపోయావ్.. పూర్తిగా మారిపోయావ్ అని ప్రకాష్.. ధాన్య లక్ష్మికి గట్టిగా క్లాస్ పీకుతాడు ప్రకాష్.
ఈ సీన్ కట్ చేస్తే.. అరిటాకు వేసి భాస్కర్ కోసం అన్నీ వంటకాలు సిద్ధం చేస్తారు కనకం ఫ్యామిలీ. అబ్బా బాగా ఆకలి వేస్తుంది. ఓ పట్టు పట్టాల్సిందే అని రాజ్ అనుకుంటాడు. అయితే కావాలని భాస్కర్‌ని భోజనానికి పిలుస్తుంది. పిలవకపోయినా రాజ్ కూడా వస్తాడు. భాస్కర్‌ని భోజనానికి పిలవడంతో షాక్ అవుతాడు. బావా నువ్వు ఇవన్నీ తినవు కదా.. పోయినసారి వచ్చినప్పుడు కూడా ఏమన్నావ్ గుర్తుకు తెచ్చుకో.. అందుకే నీ కోసం డైట్ ఫుడ్ తెప్పించా.. ఇదిగో తిను బావా అని అప్పూ తీసుకొచ్చి ఇస్తుంది. బుజ్జీ.. నాకు ఇంత ఫుడ్ పెట్టి.. అన్నియ్యకు అలాంటిది పెడితే పాపం ఫీల్ అవుతాడేమో అని భాస్కర్ అంటాడు. దీంతో రాజ్ చిర్రుబుర్రులాడుతూ ఉంటాడు.
ఆ తర్వాత కావ్య, భాస్కర్‌లు డ్రామా స్టార్ట్ చేస్తారు. కావాలనే కావ్య, భాస్కర్ సరదాగా మాట్లాడుతూ ఉంటారు. ఇక ఇక్కడ మంచి కామెడీ సీన్స్ ఉంటాయి. ఇవి చూస్తే నిజంగానే కడుపుబ్బా నవ్వాల్సిందే. ఇంతలో రాజ్ కావాలనే.. పెళ్లి టాపిక్ తీసుకొస్తాడు. ఇంతలో కనకం మా కావ్యని చేయాల్సింది కానీ ఏం చేస్తాం అని చెప్తూ బాధ పడుతుంది. సరేలే.. త్వరగా పెళ్లి చేసి.. అమెరికా పంపించేయండి అని రాజ్ అంటాడు. అప్పుడే కావ్యని చూసి సిగ్గు పడుతూ ఉంటాడు భాస్కర్. ఓయ్ ఇక్కడ చెప్పు.. అని రాజ్ అంటే.. అచ్చం మా బుజ్జిలా ఉండాలి అని చెప్తాడు భాస్కర్. ఈలోపు రాజ్‌కి ఒళ్లు మండిపోతూ ఉంటుంది. మరోవైపు ధాన్య లక్ష్మి అన్న మాటలకు సుభాష్ బాధ పడుతూ ఉంటాడు. ఇంతలో ప్రకాష్ వచ్చి ఒదార్చుతూ ఉంటాడు. ఇక ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది. మరో ఎపిసోడ్‌తో మళ్లీ కలుద్దాం.