Brahmamudi, June 17th Episode: సుభాష్‌ విషయంలో కఠినంగా అపర్ణ.. అసలు మాయకు మెలకువ..

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. అపర్ణ త్వరగా కోలుకోవాలని ఇంట్లో సుభాష్ పూజ పెట్టిస్తాడు. ఆ పూజలో సుభాష్, అపర్ణలు కూర్చోవాలి. కానీ అపర్ణ కూర్చోదు. దీంతో సుభాష్ కూర్చొంటాడు. నన్ను చావు అంచుల దాకా తీసుకెళ్లిన మనిషి.. నా కోసం ఇప్పుడు పూజలో కూర్చోవడం ఏంటి? అవసరం అయితే నేను చచ్చినా పర్వాలేదు. ఈ పూజను ఆపించండి. విలువలు లేని మనిషి చేసే పూజ నాకు శుభం జరగదు. లెగమనండి అని అపర్ణ అంటుంది. రాజ్ సర్ది చెప్పినా..

Brahmamudi, June 17th Episode: సుభాష్‌ విషయంలో కఠినంగా అపర్ణ.. అసలు మాయకు మెలకువ..
Brahmamudi (1)
Follow us

|

Updated on: Jun 17, 2024 | 1:10 PM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. అపర్ణ త్వరగా కోలుకోవాలని ఇంట్లో సుభాష్ పూజ పెట్టిస్తాడు. ఆ పూజలో సుభాష్, అపర్ణలు కూర్చోవాలి. కానీ అపర్ణ కూర్చోదు. దీంతో సుభాష్ కూర్చొంటాడు. నన్ను చావు అంచుల దాకా తీసుకెళ్లిన మనిషి.. నా కోసం ఇప్పుడు పూజలో కూర్చోవడం ఏంటి? అవసరం అయితే నేను చచ్చినా పర్వాలేదు. ఈ పూజను ఆపించండి. విలువలు లేని మనిషి చేసే పూజ నాకు శుభం జరగదు. లెగమనండి అని అపర్ణ అంటుంది. రాజ్ సర్ది చెప్పినా అపర్ణ వినిపించుకోదు. నా గుండె ఆగిపోయినా పర్వాలేదు. ఆ మనిషి ఇంకా ఇక్కడే ఉంటే నేను ఊరుకోను.. వెళ్లిపొమ్మను అని అపర్ణ అంటే.. ఇంతలో రుద్రాణి ఆజ్యం పోస్తుంది. ఇక అందరూ చెప్పే ప్రయత్నం చేసినా అపర్ణ అస్సలు వినిపించుకోదు. పాపాలు చేసేవారు ఇలాంటి పుణ్య కార్యాలు చేయడానికి పోగొట్టుకున్నారని అపర్ణ అంటుంది. దీంతో కూర్చున్న సుభాష్ లేచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత కావ్య, రాజ్‌ల చేతుల మీదుగా పూజ చేయమంటుంది. ఇక నుంచి నేను చేయాల్సిన ఎలాంటి పుణ్యకార్యాలైనా నా కొడుకు, కోడలి చేతుల మీదుగా జరిపించమని అపర్ణ చెబుతుంది. సరే అని ఇందిరా దేవి అంటుంది.

నీ మొగుడిని, ఇంటిని నీ గ్రిప్‌లోకి తెచ్చుకో..

అపర్ణ చెప్పినట్టుగా రాజ్‌, కావ్యలు పూజలో కూర్చొంటారు. రుద్రాణి.. కావ్య నగలు ఆ దొంగ మాయ ఎత్తుకెళ్లిపోయిందా.. ఇచ్చేసి వెళ్లిందా అని అడిగితే.. అవి అమ్మకే ఇచ్చేశాను వదినా అని రుద్రాణి చెబుతుంది. అత్తయ్యా వాటిని పాలల్లో కడిగేసి మీ మనవరాలికి ఇవ్వండని అపర్ణ అంటుంది. ఆ తర్వాత పూజ పూర్తి అవుతుంది. అనామిక, శైలు, సుబ్రమణ్యంలు బయటకు వస్తారు. చూశావా ఆ కావ్యని వాళ్ల అత్తగారు శత్రువులా చూసేది. కానీ ఇప్పుడు మనల్ని పక్కకు పెట్టేసి ఆ కనకం ఫ్యామిలీకి మర్యాదలు చేస్తుంది. అత్తాగారిని ఎలా మార్చేసిందో చూశావా.. ఆవిడ పైకి కోపాన్ని నటిస్తుంది కానీ కావ్య మీద చాలా ప్రేమను పెంచుకుంది. కానీ నువ్వేం చేశావ్? ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి గొడవలు పెట్టుకోవడం తప్ప ఏమైనా సాధించగలిగావా? అని శైలు అంటూ.. నేను ఏం చేయాను నా సిచ్యువేషన్ అలా ఉందని అనామిక అంటే.. అరుస్తూ మొరపెట్టుకుంటే ఏ మొగుడు వింటాడు బేబీ.. లాలించి.. పాలించాలి.. అప్పుడే మన మాట వింటారు. వీలైనంత త్వరగా నీ మొగుడిని, ఇంటిని నీ గ్రిప్‌లోకి తెచ్చుకోమని శైలు చెబుతుంది.

కనకం ఫ్యామిలీ హ్యాపీ..

ఆ తర్వాత కావ్య, కనకం వాళ్లు కూడా బయటకు వస్తారు. కావ్యా ఏం మాయ చేశావే నువ్వు.. మీ అత్తగారు మారిపోయేంతలా ఏం చేశావు? అని కనకం అడుగుతుంది. ఓర్పుతో ఎదురు చూశాను అమ్మా అంతకంటే ఏమీ చేయలేదని కావ్య అంటుంది. నువ్వు ప్రతీదానికి ఓపిక పట్టాలి అంటే.. నాకు చిరాకు వచ్చేది అక్కా.. కానీ నువ్వే కరెక్ట్ అని అప్పూ అంటుంది. మాకు సంతోషంగా ఉంది. ఎప్పుడూ గుండె భారంతో తిరిగి వెళ్లేవాళ్లం. కానీ ఇప్పుడు సంతోషంగా వెళ్తున్నాం. ఇప్పుడు ఇంతకంటే ఇంకేముందని కృష్ణ మూర్తి అంటుంది. నేను చేయాల్సింది ఇంకా ఉంది. మావయ్య గారిని మోసం చేస్తున్న మనిషిని పట్టుకోవాలి. అప్పూ ఆ మాయకి మెలకువ వచ్చిందో లేదో కనుక్కుంటూ ఉండని కావ్య చెబుతుంది. ఇక కనకం వాళ్లు ఇంటికి బయలు దేరతారు.

ఇవి కూడా చదవండి

అపర్ణ – కావ్యల మధ్య చిచ్చు పెట్టేందుకు సిద్ధమైన రుద్రాణి..

ఆ నెక్ట్స్.. అపర్ణలో మార్పుకు రుద్రాణి షాక్ అయిపోతుంది. దీంతో రాహుల్ నీళ్లు కొట్టి.. లేపుతాడు. మా వదిన చేస్తుంది చూస్తుంటే.. హార్ట్ ఎటాక్ వచ్చిపోయేలా ఉన్నాను. కావ్య మీద కోపంగా ఉన్నట్టు చేస్తుంది. కానీ అది ప్రేమను చూపుతుందని రుద్రాణి అంటే.. అదేంటి మామ్.. సీరియస్‌గానే ఉంది కదా అని రాహుల్ అంటాడు. పిచ్చోడా అది కూడా ప్రేమేరా. తన జీవితాన్ని పణంగా పెట్టి.. రాజ్‌కు పెళ్లి చేయాలని చూసిందని కావ్యపై ప్రేమను పెంచుకుంది. అనామిక ఫ్యామిలీని అస్సలు పట్టించుకోలేదు. కానీ కనకం ఫ్యామిలీకి మర్యాదలు చేయించింది. ఇది మనకు అస్సలు మంచిది కాదు. వదిన మనసు విరగగొట్టేయాలి. తను చేసిదంతా మోసం అని నమ్మిస్తాను అని రుద్రాణి మరో ప్లాన్ చేస్తుంది.

మనల్ని సేవ్ చేయడానికి ఆయన దూరమవుతున్నారు..

ఈ సీన్ కట్ చేస్తే.. కావ్య దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే రాజ్ ఏంటి? దీర్ఘంగా ఆలోచిస్తున్నావ్? మళ్లీ ఏం చేయబోతున్నావా అని భయంగా ఉందని రాజ్ అంటే.. నేను ఆలోచించేది మావయ్య గారి గురించి. పూజలో ఏం జరిగిందో చూశారు కదా.. అత్తయ్య గారు ఆయన్ని పూజలో కూడా కూర్చోనివ్వలేదు. ఇలానే వదిలేస్తే ఇద్దరి మధ్య దూరం మరింత పెరుగుతుందేమో అని కావ్య అంటుంది. ఆల్రెడీ వాళ్లిద్దరి మధ్య దూరం పెరిగిపోయిందని రాజ్ అంటాడు. మనిద్దరినీ సేవ్ చేయడానికి మావయ్య నిజం చెప్పి.. ఇప్పుడు ఆయన దూరం అయ్యారని కావ్య అంటే.. మా నాన్న గురించి నచ్చజెప్పాలని చూస్తే మమ్మీ అస్సలు ఊరుకోవడం లేదని రాజ్ అంటాడు.

సుభాష్‌కు రాజ్, కావ్యల ఓదార్పు..

ఆయన ఇప్పుడు ప్రాణం తీసుకోవడానికి కూడా వెనకాడటం లేదు. అందరూ ఉన్నప్పుడే ఆయన చేయి కోసుకున్నారు. మీరు కొంచెం కూడా బుర్ర వాడటం లేదని కావ్య అంటే.. రాజ్ సీరియస్ అవుతాడు. ఎప్పుడూ నేనే కుటుంబం గురించి ఆలోచించాలా? మీరేం ఆలోచించరా.. వెళ్లి మావయ్యతో మాట్లాడుతూ ఉండాలని కావ్య అంటే.. సరే పదా అని రాజ్ అంటాడు. సుభాష్ దగ్గరకు వెళ్లి.. ఏంటి డాడీ ఇది. ఒంటరిగా మీరే బాధ పడుతున్నారా. అందరిలో ఉండొచ్చు కదా అని రాజ్ అంటాడు. అందరిలో ఉంటే ఇంకా ఒంటరితనంగా అనిపిస్తుంది. అందరూ నన్ను దోషిలా చూస్తున్నారని సుభాష్ బాధ పడతాడు. అవన్నీ మీరు పట్టించుకోకండి.. మీరు అత్తయ్యకు దగ్గరగా అయ్యే ప్రయత్నం చేయండి. ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేయండి. మీ మనసులో బాధను చెప్పండి. తప్పకుండా క్షమిస్తారని రాజ్, కావ్యలు అంటారు.

ఆ బిడ్డ సుభాష్ కొడుకు కాదా?

కట్ చేస్తే.. అపర్ణ బయట కూర్చొని ఉంటుంది. సుభాష్ వెళ్లి అపర్ణ దగ్గర కూర్చుండగా.. అపర్ణ పక్కకు తిరుగుతుంది. సుభాష్ మాట్లాడాలని ప్రయత్నించినా.. పట్టించుకోదు. సుభాష్ నచ్చజెప్పాలని ట్రై చేసినా.. దారుణంగా మాట్లాడుతుంది అపర్ణ. దీంతో సుభాష్ మరింత కృంగిపోతాడు. అదంతా రాజ్, కావ్యలు వింటారు. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్‌ ముగుస్తుంది. రేపటి ఎపిసోడ్‌లో.. మాకు మెలకువ వచ్చిందని రౌడీ బేబీ చెప్తే.. కావ్య ఆస్పత్రికి వెళ్తుంది. అప్పటికే ఇద్దరు వచ్చి మయాని తీసుకెళ్లిపోతారు.