
యూట్యూబ్, సోషల్ మీడియాలో మంచి గుర్తింపు తెచ్చుకుంది గీతూ రాయల్. అదే పాపులారిటీతో బిగ్ బాస్ రియాల్టీ షోలోకి సైతం అడుగుపెట్టింది. ఆ సమయంలో ఆమె ఆట తీరు, ప్రవర్తనపై విపరీతమైన నెగిటివిటీని మూటగట్టుకుంది. దీంతో తక్కువ సయమంలోనే ఆ షో నుంచి బయటకు వచ్చేసింది. ఇక తర్వాత సోషల్ మీడియాలో పలు వీడియోస్ చూస్తూ యాక్టివ్ గా ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా గీతూ రాయల్ చిక్కుల్లో పడింది. ఇటీవల తిరుమల శ్రీవారి ఆలయ సమీపంలో తన స్నేహితులతో కలిసి రీల్స్ చేసింది. నలుగురు యువకులతో కలిసి తిరుమల ఘాట్ రోడ్డుతోపాటు శ్రీవారి ఆలయం ఎదుట.. శ్రీవారి పుష్కరిణి సమీపంలో, కౌంటర్ వద్ద రీల్స్ చేసింది. ఖడ్గం సినిమాలోని గోవిందా గోవిందా పాటకు డ్యాన్స్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోస్ నెట్టింట వైరల్ అయ్యాయి. దీంతో ఆమె తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి.
ఎక్కువ మంది చదివినవి : Folk Singer : ఒక్క పాటతో యూట్యూబ్ సెన్సేషన్.. ఎర్ర ఎర్ర రుమాల్ పాటకు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారంటే..
అయితే పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రంలో సినిమా పాటకు డ్యాన్స్ చేస్తూ వీడియోస్ చేయడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఆమె పై నెటిజన్స్ మండిపడ్డారు. వీడియోస్ కోసం ఇలాంటి పనులు చేయడం ఏంటని సీరియస్ కావడంతో దెబ్బకు గీతూ ఆ వీడియోను డిలేట్ చేసింది. కానీ అప్పటికే ఈ వీడియో వైరల్ అయ్యింది. తిరుమల శ్రీవారి ఆలయ సమీపంలో రీల్స్ చేసిన గీతూపై చర్యలు తీసుకోవాలంటూ నెటిజన్స్ డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే ఆమెపై చర్యలు తీసుకోవడానికి టీటీడీ విజిలెన్స్ అధికారులు సిద్ధమయ్యారని తెలుస్తోంది. తాజాగా ఈ వివాదంపై స్పందిస్తూ గీతూ రాయల్ ఓ వీడియోను షేర్ చేసింది.
ఎక్కువ మంది చదివినవి : Jagapathi Babu: ఆ హీరోను ప్రతిరోజూ తలుచుకుంటా.. బతికితే అతడిలా బతకాలి.. జగపతి బాబు..
“అందరికీ గుడ్ న్యూస్.. నా మీద చర్యలు తీసుకుంటారంట. హ్యాపీగా ఉండండి. ఇంత చిన్న విషయాన్ని అంత పెద్దది చేసి అన్ని వీడియోస్ చేసినందుకు థ్యాంక్స్ సోమచ్. ఆల్రెడీ సగం జీవితం పోయింది. ఇంకా పోవడానికి ఏమీ లేదు. కొద్దో గొప్పో మిగిలి ఉంటే దానిని పూర్తిగా పోగొట్టేయండి. తర్వాత అందరూ ప్రశాంతంగా ఉండండి” అంటూ ఎమోషనల్ అయ్యింది. ఇక గీతూ వీడియోపై నెటిజన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : సందీప్ రెడ్డి వంగాకు మెసేజ్ చేసి పిచ్చోడిని అయిపోయా.. టాలీవుడ్ హీరో..
ఎక్కువ మంది చదివినవి : Tollywood : రజినీకాంత్ చేసిన ఆ ఒక్క హెల్ప్‌తో చిరంజీవి లైఫ్ మారిపోయింది.. టాలీవుడ్ నటుడు..