Anchor Suma: కరోనా ఎఫక్ట్.. చేతులకే కాదు .. చీరలకు కూడా శానిటైజర్ అంటున్న యాంకర్ సుమ.. వీడియో వైరల్

Anchor Suma: తెలుగింటి కోడలు కేరళ కుట్టి సుమ సోషల్ మీడియాలో వీడియోలు షేర్ చేస్తూ.. అభిమానులను అలరిస్తుంది. బుల్లి తెరపై ఎంతమంది యాంకర్స్ ఉన్నా సుమ నే ఇప్పటికీ టాప్ యాంకర్. వరస షోలతో..

Anchor Suma: కరోనా ఎఫక్ట్.. చేతులకే కాదు .. చీరలకు కూడా శానిటైజర్ అంటున్న యాంకర్ సుమ.. వీడియో వైరల్
Suma

Updated on: Aug 21, 2021 | 7:47 AM

Anchor Suma: తెలుగింటి కోడలు కేరళ కుట్టి సుమ సోషల్ మీడియాలో వీడియోలు షేర్ చేస్తూ.. అభిమానులను అలరిస్తుంది. బుల్లి తెరపై ఎంతమంది యాంకర్స్ ఉన్నా సుమ నే ఇప్పటికీ టాప్ యాంకర్. వరస షోలతో బిజీబిజీగా ఉండే సుమ.. తాజాగా వరలక్ష్మి వ్రతం సందర్భంగా చేస్తున్న షో కి పట్టు చీర కట్టుకుంది. అయితే కరోనా నేపథ్యంలోషూటింగ్ ను కరోనా నిబంధనలు పాటిస్తూ.. తగు జాగ్రత్తలు తీసుకుని చేస్తున్నారు. చేతులకు శానిటైజ్ చేయడం తప్పని సరి అని అందరికీ తెలుసు.. అయితే సుమ కట్టుకున్న పట్టు చీరను కూడా ఆవిరిసాయంతో శానిటైజ్ చేస్తున్నది ఓ మహిళ. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

కేరళ కుట్టి.. సుమ మాత్రం గలగలా తెలుగు మాట్లాడుతూ.. బుల్లితెర ప్రేక్షకులకు ఇష్టమైన యాంకర్ గా మారిపోయింది. మలయాళీ అమ్మాయి సుమ.. అయితే తండ్రి ఉద్యోగ రీత్యా హైదరాబాద్ లో ఉండడంతో.. తెలుగు భాషపై పట్టుసాధించింది. నటి, డ్యాన్సర్, చక్కటి గాత్రం కలిగి సుమ మల్టీ టాలెంటెడ్ పర్సన్. స్పష్టమైన వ్యాఖ్యానం, చిరునవ్వు, సమయస్ఫూర్తి కలగలసిన సుమ ఈ రంగంలో ఎవరూ అందుకొలేని స్టేజ్ కు చేరుకుంది. తెలుగు, మలయాళంలతో పాటు హిందీ, ఆంగ్ల భాషలలోను మాట్లాడగలదు.ఓ వైపు షోలకు యాంకరింగ్ చేస్తూనే మరోవైపు పలు లైవ్ షో లకు వ్యాఖ్యాతగా కూడా వ్యవహరిస్తూ.. తనదైన శైలీలో అలరిస్తుంది సుమ కనకాల

అవును సుమ గత కొన్నేళ్లుగా బుల్లితెరపై టాప్ యాంకర్ గా దూసుకుపోతుంది. గలగలా మాట్లాడుతూ.. తన మాటల గారడితో ప్రేక్షకుల మనసులను దోచినుకున్న సుమ అంటే ప్రతి ఒక్కరికీ ఇష్టమే. బుల్లి తెరపై యాంకర్స్‌ ఓ రేంజ్‌లో క్రేజ్ తెచ్చింది సుమ. యాంకర్, వ్యాఖ్యాత.. నిర్మాత, సుమ కనకాల మల్టీటాలెంటెడ్ పర్సన్. క్వీన్ ఆఫ్ థ యాంకర్స్ అని ఖ్యాతిగాంచింది. కరోనా సమయం నుంచి అభిమానులను అవేర్ నెస్ చేస్తూనే ఉంది.

 

Also Read: Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజుకి స్పెషల్‌గా గ్రీటింగ్స్ చెప్పిన గద్వాల్ జిల్లా అభిమానులు..