తెలంగాణ అసెంబ్లీలో సంధ్య థియేటర్ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. ” థియేటర్‌కు రావొద్దని పోలీసులు ముందే చెప్పారు. అయినా సినిమా యూనిట్ వినిపించుకోలేదు అని అన్నారు. అలాగే పోలీసులు దరఖాస్తు తిరస్కరించినా థియేటర్‌కు వచ్చారు. హీరో రోడ్ షో కారణంగా జనం భారీగా వచ్చారు. హీరోని చూసేందుకు వేల సంఖ్యలో అభిమానులు వచ్చారు. దాంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో మహిళ మృతి చెందింది. ఓ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. తొక్కిసలాట తర్వాత హీరోను అక్కడి నుంచి పోలీసులు పంపించారు. తిరిగి వెళ్లే సమయంలో కూడా రోడ్‌షో చేశారు అని రేవంత్ రెడ్డి అన్నారు.
తొక్కిసలాట ఘటనలో పలువురిని అరెస్ట్ చేశాం. ఏ11గా ఉన్న హీరోను కూడా అరెస్ట్ చేశాం. అరెస్ట్ సమయంలో పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. సినీ పరిశ్రమను ప్రోత్సహించాలన్నది మా విధానం. టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చాం. ప్రాణాలు పోతుంటే చూస్తూ ఊరుకోం అని రేవంత్ రెడ్డి అన్నారు.
అదేవిధంగా బాలుడిని పరామర్శించేందుకు ఎవరూ వెళ్లలేదు. హీరో అరెస్ట్ అయితే ఇండస్ట్రీ తరలివెళ్లింది. అరెస్ట్‌పై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేశాయి అని రేవంత్ రెడ్డి సభలో మాట్లాడారు. కాగా పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భగా సంద్యథియేటర్ లో ప్రీమియర్ షోలు వేశారు. కాగాప్రీమియర్స్ సమయంలో హీరో అల్లు అర్జున్ అక్కడికి వచ్చారు. అల్లు అర్జున్ ను చూసేందుకు పెద్దెఎత్తున అభిమానులు అక్కడికి చేరుకున్నారు. దాంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందింది. ఆమె కొడుకు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఆ బాలుడుకి హాస్పటల్ లో చికిత్స జరుగుతుంది.