సుశాంత్‌ కేసులో మరో ట్విస్ట్‌.. వీడియో లీక్‌

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య చేసుకొని మరణించాడని పోస్ట్‌మార్టంలో తేలినప్పటికీ.. అతడిది హత్య అని ఫ్యాన్స్ ముందు నుంచి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

సుశాంత్‌ కేసులో మరో ట్విస్ట్‌.. వీడియో లీక్‌
Follow us

| Edited By:

Updated on: Jul 30, 2020 | 4:43 PM

Sushant case Twist: బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య చేసుకొని మరణించాడని పోస్ట్‌మార్టంలో తేలినప్పటికీ.. అతడిది హత్య అని ఫ్యాన్స్ ముందు నుంచి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ కేసును ముంబయి పోలీసులు తప్పుదోవ పట్టించేలా చేస్తున్నారని, బాలీవుడ్‌లోని మాఫియాతో  జత కట్టి నిందితులను తప్పించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఓ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

సుశాంత్‌ కేసును విచారించే సమయంలో ఫోరెన్సిక్ నిపుణులు గుసగుసలాడుకుంటున్న ఓ వీడియో సోషల్ మీడియాలో లీక్‌ అయ్యింది. అందులో సుశాంత్ బెడ్‌రూంకి వెళ్లి తనిఖీలు చేస్తోన్న వారు, ఈ వీడియో బ‌య‌ట‌కి వ‌స్తే దర్యాప్తుకి ఇబ్బంది క‌లుగుతుంద‌ని మాట్లాడారు. దీంతో సుశాంత్ కేసులో ఎవ‌రో పోలీస్ నిందితులకు సాయం చేస్తున్నారా అనే వాద‌న వినిపిస్తుంది. అయితే నిజంగానే వారు అలా మాట్లాడారా..? లేదా ఆడియోను మార్ఫింగ్ చేశారా..? సుశాంత్‌ కేసును పోలీసులు తప్పుదోవ పట్టిస్తున్నారా..? వంటి ప్రశ్నలకు సమాధానం త్వరలో వస్తుందేమో చూడాలి. ఇదిలా ఉంటే సుశాంత్‌ కేసును సీబీఐకి అప్పగించాలంటూ దాఖలైన పిటిషన్‌ని సుప్రీం కొట్టివేసిన విషయం తెలిసిందే.

Read This Story Also: ప్రభాకర్‌ రెడ్డి, అస్మిత్‌ రెడ్డిల బెయిల్‌ పిటిషన్లు తిరస్కరణ

Latest Articles