ప్రియాంక సోదరుడి పెళ్లి క్యాన్సిల్.. కన్ఫర్మ్ చేసిన ఇషిత

| Edited By:

May 04, 2019 | 11:36 AM

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా సోదరుడు సిద్దార్థ చోప్రా పెళ్లి ఆగిపోయినట్లేనని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఇషిత తన సోషల్ మీడియాలో కన్ఫర్మ్ చేసినట్లు స్పష్టమౌతోంది. కాగా తన చిరకాల స్నేహితురాలు ఇషితా కుమార్‌తో కొంతకాలం కిందట సిద్దార్థ నిశ్చితార్థం జరిగింది. రీసెంట్‌గా వీరి పెళ్లికి ముహూర్తాన్ని ఖరారు చేశారని.. అందుకే ప్రియాంక ఇండియాకు వచ్చిందని వార్తలొచ్చాయి. అయితే అదే సమయంలో ఇషితా అనారోగ్యంతో బాధపడుతుంటంతో.. పెళ్లి వాయిదా పడ్డట్లు తెలిసింది. కానీ తాజా సమాచారం ప్రకారం […]

ప్రియాంక సోదరుడి పెళ్లి క్యాన్సిల్.. కన్ఫర్మ్ చేసిన ఇషిత
Follow us on

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా సోదరుడు సిద్దార్థ చోప్రా పెళ్లి ఆగిపోయినట్లేనని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఇషిత తన సోషల్ మీడియాలో కన్ఫర్మ్ చేసినట్లు స్పష్టమౌతోంది. కాగా తన చిరకాల స్నేహితురాలు ఇషితా కుమార్‌తో కొంతకాలం కిందట సిద్దార్థ నిశ్చితార్థం జరిగింది. రీసెంట్‌గా వీరి పెళ్లికి ముహూర్తాన్ని ఖరారు చేశారని.. అందుకే ప్రియాంక ఇండియాకు వచ్చిందని వార్తలొచ్చాయి. అయితే అదే సమయంలో ఇషితా అనారోగ్యంతో బాధపడుతుంటంతో.. పెళ్లి వాయిదా పడ్డట్లు తెలిసింది. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ వివాహం ఆగిపోయినట్లు స్పష్టత వచ్చేసింది.

ఇటీవలే సిద్ధార్థ్‌తో తన ఎంగేజ్‌మెంట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి తొలగించిన ఇషితా.. తాజాగా ‘‘కొత్త ఆరంభాలకు చీర్స్.. అందమైన ముగింపుకు గుడ్ బై కిస్‌తో వీడ్కోలు’’ అంటూ ఓ ఫొటోను షేర్ చేసింది. దానికి ఆమె తండ్రి అనిరుధ్.. ‘‘మేము ఎప్పుడూ నీతోనే ఉంటాం. విశ్వంలో వెలిగే సరికొత్త తారలా నువ్వు ఉండాలి’’ అని, ‘‘పాత పుస్తకం మూసెయ్.. కొత్తది రచించు’’ అంటూ తల్లి నిధి కుమార్ కామెంట్లు పెట్టారు. ఇక ఈ ట్వీట్‌పై మరికొందరు స్పందిస్తూ.. ‘‘అతడు నీకు సరైన వాడు కాదు. నువ్వు ఎప్పుడూ స్ట్రాంగ్‌గా ఉండు’’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. దీంతో వీరి వివాహం ఆగిపోయిందని స్పష్టంగా అర్థమౌతోంది.