OTT Movie: ‘మార్కో’కు మించి వయలెన్స్.. ఓటీటీలో ఒళ్లుగగుర్పొడిచే యాక్షన్ థ్రిల్లర్.. పిల్లలతో కలిసి చూడొద్దు
కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఓ మోస్తరుగా ఆడింది. అయితే హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో హింసాత్మక సన్నివేశాలు చాలా ఉన్నాయి. దీంతో ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ సినిమా చూసేందుకు వెనకడుగు వేశారు.

తెలుగులో డిఫరెంట్ కథలతో సినిమాలు చేస్తాడని డైరెక్టర్ రవిబాబుకు మంచి గుర్తింపు ఉంది. అవును, అనసూయ, అమరావతి వంటి క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు రవిబాబుకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. రీసెంట్ గా అతని దర్శకత్వంలో వచ్చిన మరో యాక్షన్ థ్రిల్లర్ రేజర్. దర్శకత్వంతో పాటు హీరోగానూ ఇతనే నటించాడు. మే 8న ప్రేక్షకుల ముందుకు వచ్చిన రేజర్ సినిమా ఓ మోస్తరుగా ఆడింది. యాక్షన్ ప్రియులను బాగా ఆకట్టుకుంది. అయితే ఈ సినిమాలో మోతాదుకు మించి హింసాత్మక సన్నివేశాలు ఉన్నాయి. తెరనిండా రక్తపాతమే కనిపిస్తుంటుంది. దీంతో ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ సినిమా చూసేందుకు వెనకడుగు వేశారు. అయితే ఈ సినిమాను ఓటీటీలో చూడాలని చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొత్తానికి ఇప్పుడీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. రేజర్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో జూన్ 19( శుక్రవారం) నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనుంది. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా ఒక పోస్టర్ ను రిలీజ్ చేసింది ఆహా. ‘ఒక సీసీ టీవీ దృశ్యం. ప్రమాదంలో ఉన్న ఓ చిన్నారి. వాస్తవం కంటే భయంకరమైన గతం కలిగిన ఓ వ్యక్తి.’ అంటూ దీనికి క్యాప్షన్ ఇచ్చింది.
ఫ్లయింగ్ ఫ్రాంగ్స్ బ్యానర్‌పై తెరకెక్కిన రేజర్ సినిమాలో రవిబాబుతో పాటు తనీష్, ఇనయ సుల్తానా, మీనా వాసు, చైల్డ్ ఆర్టిస్ట్ తేజల్ విఖ్యాతి తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. రాష్ట్ర హోంమంత్రి (కనకరాజు) తన కుటుంబంతో కలిసి ముఖ్యమంత్రిని హత్య చేస్తాడు. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ విష్ణు (తనీష్) చేతికి చిక్కుతుంది. దీంతో హోంమంత్రి ముఠా విష్ణును, అతని భార్యని కూడా చంపేస్తారు. ప్రాణాలతో బయటపడిన విష్ణు కూతురు తేజును కాపాడే బాధ్యతలను రేజర్ (రవిబాబు) తీసుకుంటాడు. మరి హోం మంత్రి గ్యాంగ్ నుంచి ఆ చిన్నారిని రవిబాబు ఎలా కాపాడడన్నదే మిగతా కథ. యాక్షన్ సినిమాలు ఇష్టపడేవారు రేజర్ మూవీపై ఒక లుక్కేసుకోవచ్చు.
ఆహా ఓటీటీలో రవిబాబు రేజర్ సినిమా..
View this post on Instagram
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




