AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coolie OTT: అఫీషియల్.. ఓటీటీలోకి ‘కూలీ’.. రజనీకాంత్ 500 కోట్ల సినిమా స్ట్రీమింగ్ ఎక్కడంటే?

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లేటెస్ట్ సినిమా కూలీ. లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఆగస్టు 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. రజనీ, నాగ్ ల మేనియాతో బాక్సాఫీస్ వద్ద రూ.500 కోట్ల కలెక్షన్లు రాబట్టింది.

Coolie OTT: అఫీషియల్.. ఓటీటీలోకి 'కూలీ'.. రజనీకాంత్ 500 కోట్ల సినిమా స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Coolie Movie
Basha Shek
|

Updated on: Sep 04, 2025 | 6:08 PM

Share

రజనీకాంత్‌ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ కూలీ. టాలీవుడ్‌ నుంచి నాగార్జున, బాలీవుడ్‌ నుంచి ఆమిర్‌ ఖాన్‌, మాలీవుడ్‌ నుంచి సౌబిన్‌ షాహిర్‌, సాండల్‌వుడ్‌ నుంచి ఉపేంద్ర తదితర స్టార్స్ కీలక పాత్రలు పోషించారు. అలాగే శ్రుతి హాసన్, రచితా రామ్, రెబామోనికాజన్, సత్యరాజ్ వివిధ పాత్రల్లో మెరిశారు. ఇక పూజా హెగ్డే మోనికా పాటతో ఆడియెన్స్ ను ఉర్రూతలూగించింది. లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొన్ని చోట్ల మిక్స్ డ్ టాక్ వచ్చినా ఓవరాల్ గా సూపర్ హిట్ గా నిలిచింది. కూలీ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్లకు పైగా వసూళ్లు వచ్చినట్లు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. రజనీ మార్క్ యాక్షన్, నాగార్జున విలనిజం, షౌబిన్ షాహిర్, రచితా రామ్ ల పెర్ఫామెన్స్ , ఉపేంద్ర, ఆమిర్ ఖాన్ ల కామియో రోల్స్ సినిమా విజయంలో హైలెట్ గా నిలిచాయి. అలాగే అనిరుధ్ స్వరాలు, బీజీఎమ్ కూడా కూలీ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి.  థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన కూలీ మూవీ ఇప్పుడు ఓటీటీలో సందడి చేయనుంది. తాజాగా దీనిపై అధికారిక ప్రకటన వెలువడింది. కూలీ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది.

ఈ నేపథ్యంలో సెప్టెంబర్‌ 11 నుంచి కూలీ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు రానుంది. ఈ మేరకు తమ సోషల్ మీడియా ఖాతాల్లో స్పెషల్‌ పోస్టర్‌ రిలీజ్ చేసింది అమెజాన్ ప్రైమ్ వీడియో. తమిళ్ తో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కు అందుబాటులోకి రానుంది. అయితే హిందీ వెర్షన్ ఓటీటీ రిలీజ్‌ గురించి మాత్రం ఎటువంటి అప్‌డేట్‌ ఇవ్వలేదు. బహుశా కూలీ హిందీ వర్షన్‌ మరో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి రానుందేమో. కూలీ సినిమాకు అనిరుధ్ స్వరాలు సమకూర్చారు. సన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జట్ తో ఈ సినిమాను నిర్మించింది.

ఇవి కూడా చదవండి

మరో వారం రోజుల్లో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
చనిపోదామని రైలు పట్టాలపైకి.. చివరకు ప్లాన్ మార్చిన సైకో కిల్లర్
చనిపోదామని రైలు పట్టాలపైకి.. చివరకు ప్లాన్ మార్చిన సైకో కిల్లర్
వింబుల్డన్‌‌లో మెరిసిన వైభవ్.. ఫేవరేట్ స్టార్ ఎవరో తెలుసా?
వింబుల్డన్‌‌లో మెరిసిన వైభవ్.. ఫేవరేట్ స్టార్ ఎవరో తెలుసా?
'మాకు పెళ్లైంది.. ఈ కుక్క పిల్లే సాక్ష్యం'.. ఓ జంట విచిత్ర పెళ్లి
'మాకు పెళ్లైంది.. ఈ కుక్క పిల్లే సాక్ష్యం'.. ఓ జంట విచిత్ర పెళ్లి
సామాన్యులకు కేంద్రం 5 అద్బుత స్కీమ్.. డబ్బులు ఆదా చేస్కోండి..
సామాన్యులకు కేంద్రం 5 అద్బుత స్కీమ్.. డబ్బులు ఆదా చేస్కోండి..
ఫౌల్ కోసం భారీ స్కెచ్.. రెఫరీ ఎంట్రీతో ఊహించని ట్విస్ట్..!
ఫౌల్ కోసం భారీ స్కెచ్.. రెఫరీ ఎంట్రీతో ఊహించని ట్విస్ట్..!
ఆలయ గర్భగుడిలో ప్రత్యక్షమైన నాగన్న.. చివరకు ఏం జరిగిందో తెలుసా..?
ఆలయ గర్భగుడిలో ప్రత్యక్షమైన నాగన్న.. చివరకు ఏం జరిగిందో తెలుసా..?
రద్దీ రోడ్డుపై ఆరేళ్ల మనవరాలితో కారు డ్రైవింగ్‌.. SI తాతపై కేసు
రద్దీ రోడ్డుపై ఆరేళ్ల మనవరాలితో కారు డ్రైవింగ్‌.. SI తాతపై కేసు
Video: కృత్రిమంగా పొదిగిన నాగుపాము గుడ్లు..!
Video: కృత్రిమంగా పొదిగిన నాగుపాము గుడ్లు..!
ఇరాన్‌పై అమెరికా ప్రతీకార దాడులు.. 140 లక్ష్యాలపై అటాక్..
ఇరాన్‌పై అమెరికా ప్రతీకార దాడులు.. 140 లక్ష్యాలపై అటాక్..
అభిమాని కన్నీళ్లకు కరిగిపోయిన విజయ్ దేవరకొండ..
అభిమాని కన్నీళ్లకు కరిగిపోయిన విజయ్ దేవరకొండ..