AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఆత్మహత్యలు కాదు హత్యలు.. ఓటీటీలో మైండ్ బ్లోయింగ్ మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది

ఈ దసరా సెలవుల్లో మంచి ట్విస్టులున్న క్రైమ్ థ్రిల్లర్ సినిమా కానీ వెబ్ సిరీస్ కానీ చూడాలనుకుంటున్నారా? అయితే మీకు ఈ మలయాళం మూవీ మంచి ఛాయిస్. ఈ సినిమాలో వచ్చే ట్విస్టులు నెక్ట్స్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఈ బ్లాక్ బస్టర్ మూవీ తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉంది.

OTT Movie: ఆత్మహత్యలు కాదు హత్యలు.. ఓటీటీలో మైండ్ బ్లోయింగ్ మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
OTT Movie
Basha Shek
|

Updated on: Oct 20, 2026 | 11:07 AM

Share

ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్ లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. భాషతో సంబంధం లేకుండా ఈ జానర్ సినిమాలను చూసేస్తున్నారు. అందులోనూ ఈ మధ్యన సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలంటే కేరాఫ్ మలయాళం ఇండస్ట్రీ అనే పేరే వినిపిస్తోంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఒక మలయాళం ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా గురించే. థియేటర్లలో ఆడియెన్స్ కు సూపర్ థ్రిల్ అందించిన ఈ మూవీ ఓటీటీలోనూ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ముఖ్యంగా తెలుగు ఆడియెన్స్ అయితే ఈ సినిమాను ఎగబడి చూశారు. ఐఎమ్ డీబీలోనూ ఈ సినిమాకు టాప్ రేటింగ్ ఉండడం విశేషం. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. హరి శంకర్ నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ గా డిపార్ట్ మెంట్ లో మంచి గుర్తింపు ఉంటుంది. ఒక రోజు అతని దగ్గరికి ఒక గోల్డ్ ఛైన్ మిస్సింగ్ కేసు వస్తుంది. దాన్ని విచారిస్తున్న క్రమంలోనే పోలీస్ ఆఫీసర్ హత్య కేసు వెలుగులోకి వస్తుంది. అలాగే తన పెద్ద కూతురు సూసైడ్ కేసు కనెక్ట్ అవుతుంది. తీగ లాగితే డొంక కదిలినట్లు.. ఈ కేసు మెల్లగా డ్రగ్స్ మాఫియా, బ్లాక్ మెయిల్, పిల్లలపై జరిగే క్రూరమైన నేరాల వైపు టర్న్ తీసుకుంటుంది. దీంతో అప్పటి వరకు కేవలం ఒక పోలీస్ ఆఫీసర్‌గా తన డ్యూటీ చేసిన హరిశంకర్‌కు ఈ కేసు ఒక్కసారిగా పర్సనల్ వార్‌లా, న్యాయం కోసం చేసే పోరాటంలా మారుతుంది. మరి అసలు హరిశంకర్‌కు ఈ కేసుకు ఉన్న సంబంధం ఏంటీ? ఈ బంగారు చైన్ కి ఆ రెండు కేసులకు ఉన్న కనెక్షన్ ఏంటి ? ఇంతకీ వారిద్దరి ఆత్మహత్యల వెనక ఉన్న వ్యక్తి ఎవరు? హరీశ్ శంకర్ ఈ మిస్టరీని ఎలా ఛేదించాడన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ఓటీటీలో ఉన్న ది బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్స్ లో ‘ఆఫీసర్ అన్ డ్యూటీ’ ఒకటి అని చెప్పవచ్చు. తెలుగు వారికి బాగా తెలిసిన కుంచకో బోబన్ ఇందులో హీరోగా నటించాడు . అలాగే ప్రియమణి ఆయన భార్యగా యాక్ట్ చేసింది. జీతూ ఆష్రాప్ ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాకు దర్శకత్వం వహించారు. కేవలం రూ.12 కోట్లతో నిర్మించిన ఈ సినిమా ఓవరాల్ గా రూ.55 కోట్లు వసూలు చేసింది. ఇప్పటికీ ఐఎమ్ డీబీలో ఈ సినిమాకు 7.5 రేటింగ్ ఉండడం విశేషం. ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. ఒరిజినల్ మలయాళం వెర్షన్ తో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లోనూ ఈ సినిమా చూడొచ్చు. క్షణక్షణం సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామాగా సాగుతున్న ఈ సినిమా దాదాపు 2 గంటల 14 నిమిషాల నిడివితో ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టకుండా సాగుతుంది.

ఆఫీసర్ ఆన్ డ్యూటీ సినిమా ట్రైలర్..

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us