జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ కెవి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించిన చిత్రం ఫస్ట్ డే ఫస్ట్ షో (First Day First Show). ఇందులో శ్రీకాంత్ రెడ్డి, సంచిత బాషు హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు వంశీధర్ గౌడ్, లక్ష్మీ నారాయణ దర్శకత్వం వహించగా.. ఇటీవల విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంది. కామెడీ ఎంటర్టైనర్గా థియేటర్లలో విడుదలైన ఈమూవీని పూర్ణోదయ క్రియేషన్స్ బ్యానర్ పై ఏడిద శ్రీజ నిర్మించారు. ఇక ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో సందడి చేయనుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం ఆహాలో ఫస్ట్ డే ఫస్ట్ షో స్ట్రీమింగ్ కానుంది.
సినీ ప్రియులకు ఎప్పటికప్పుడు 100 శాతం వినోదాన్ని అందిస్తూ డిజిటల్ ప్లాట్ ఫాంలో దూసుకుపోతుంది ఆహా. ఇప్పటికే ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు, సస్పెన్స్ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్, డాన్స్ ఐకాన్ షో, గేమ్స్ ద్వారా ప్రేక్షకులను అలరిస్తున్న ఆహా.. ఇక ఇప్పుడు ఆడియన్స్ ను కడుపుబ్బా నవ్వించేందుకు సిద్ధమయ్యింది. కామెడీ ఎంటర్టైనర్ ఫస్ట్ డే ఫస్డ్ షో సినిమా ఆహాలో సెప్టెంబర్ 23 నుంచి స్ట్రీమింగ్ కానుంది. పవన్ కళ్యాణ్ ఖుషీ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్స్ హీరో ఎలా సంపాదించాడు.. అందుకు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొవాల్సి వచ్చిందనేది స్టోరీ. ఇందులో వెన్నెల కిషోర్, తనికెల్ల భరణి కీలకపాత్రలలో కనిపించారు.
Prema enno parikshalu pettindi. Kaani first day first show cinema ki tickets teeskoni raavadam kuda oka pariksha ani ippude telisindi.???#FirstDayFirstShowOnAHA premieres September 23
▶️https://t.co/qWXIICYj5r @Im_Srikanth_R @SanchitaBashu24 @Wamceee @lnputtamchetty pic.twitter.com/sH5DtMk26f— ahavideoin (@ahavideoIN) September 20, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.