Liger Movie OTT: ఓటీటీలోకి వచ్చేస్తోన్న లైగర్.. ఎప్పుడు.. ఎక్కడ స్ట్రీమింగ్ అంటే.. ?

|

Sep 20, 2022 | 6:20 PM

ఈ మూవీ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు.. కానీ మరోవైపు సాంగ్స్ యూట్యూబ్‏ను షేక్ చేశాయి. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‏కు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది.

Liger Movie OTT: ఓటీటీలోకి వచ్చేస్తోన్న లైగర్.. ఎప్పుడు.. ఎక్కడ స్ట్రీమింగ్ అంటే.. ?
Liger
Follow us on

మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన చిత్రం లైగర్ (Liger ). ఎన్నో అంచనాల మధ్య ఆగస్ట్ 25న విడుదలైన ఈ మూవీ ఆశించినంత స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ, బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే జంటగా నటించిన ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ అయి భారీగానే నష్టాలను తెచ్చిపెట్టింది. ముఖ్యంగా డైరెక్టర్ పూరీ జగన్నాథ్, విజయ్ కెరీర్‏లోనే అతిపెద్ద డిజాస్టర్‏గా నిలిచింది. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో రమ్యకృష్ణ, మైక్ టైసన్ కీలకపాత్రలలో నటించారు. ఈ మూవీ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు.. కానీ మరోవైపు సాంగ్స్ యూట్యూబ్‏ను షేక్ చేశాయి. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‏కు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది.

తాజా సమాచారం ప్రకారం లైగర్ ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ప్లాట్ ఫాం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకుంది. సెప్టెంబర్ 22 నుంచి లైగర్ చిత్రం స్ట్రీమింగ్ కానున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక మరో రెండు రోజుల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ పై అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఛార్మి, పూరి జగన్నాథ్, కరణ్ జోహర్ సంయుక్తంగా నిర్మించారు.