OTT Horror Movie: ఓటీటీలో దడ పుట్టిస్తున్న హారర్ థ్రిల్లర్.. రూ.50 కోట్లతో తెరకెక్కి భారీ వసూళ్లు!

ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో భాషతో సంబంధం లేకుండా విభిన్న కథాంశాలతో తెరకెక్కిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ముఖ్యంగా హారర్, సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రాలకు మంచి క్రేజ్ ఉంది. రొటీన్ కథలకు భిన్నంగా సాగే సినిమాల కోసం ఎదురుచూసే వారికి ‘హెరెటిక్’ ఒక ఆసక్తికరమైన ఎంపికగా నిలుస్తుంది.

OTT Horror Movie: ఓటీటీలో దడ పుట్టిస్తున్న  హారర్ థ్రిల్లర్.. రూ.50 కోట్లతో తెరకెక్కి భారీ వసూళ్లు!
Horror Movie

Updated on: Oct 18, 2026 | 9:28 PM

ఓటీటీ ప్రేక్షకులకు హారర్ సినిమాలంటే ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. హారర్ సినిమాలను చాలా మంది ఇష్టపడుతుంటారు. అలాంటి ప్రేక్షకుల కోసం ఒక విభిన్నమైన హారర్ థ్రిల్లర్ అందుబాటులో ఉంది. భయపెట్టడమే కాకుండా మత విశ్వాసాలు, మానవ మనస్తత్వంలోని చీకటి కోణాలను ప్రశ్నించే ఈ సినిమా ఇప్పుడు ఓటీటీని షేక్ చేస్తుంది. ఈ సినిమా పేరు ‘హెరెటిక్’. 2024లో విడుదలైన ఈ ఇంగ్లిష్ హారర్ థ్రిల్లర్‌కు స్కాట్ బెక్, బ్రయాన్ వుడ్స్ దర్శకత్వం వహించారు. ప్రముఖ నటుడు హ్యూ గ్రాంట్‌తో పాటు సోఫీ థాచర్, క్లోయ్ ఈస్ట్ ప్రధాన పాత్రల్లో నటించారు. సాధారణంగా రొమాంటిక్, కామెడీ పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న హ్యూ గ్రాంట్ ఇందులో పూర్తిగా భిన్నమైన పాత్రలో కనిపించడం విశేషం. ఈ సినిమా కథ ఇద్దరు యువ మోర్మన్ మిషనరీలు సిస్టర్ బార్న్స్, సిస్టర్ పాక్స్టన్ చుట్టూ తిరుగుతుంది. తమ మత విశ్వాసాల గురించి ప్రజలకు వివరించేందుకు ఇంటింటికీ వెళ్లే వీరిద్దరూ ఒకరోజు మిస్టర్ రీడ్ అనే వ్యక్తి ఇంటికి చేరుకుంటారు.

మొదట్లో అతను ఎంతో మర్యాదగా మాట్లాడతాడు. మతం, విశ్వాసాల గురించి చర్చించేందుకు ఆసక్తి చూపిస్తాడు. దీంతో ఆ యువతులు కూడా అతని మాటలను నమ్ముతారు. కానీ కొద్దిసేపటికే పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి. రీడ్ ప్రవర్తనలోని అసలు కోణం బయటపడుతుంది. అతని ఇంట్లోకి అడుగుపెట్టిన యువతులు ప్రమాదంలో చిక్కుకున్నట్లు తెలుసుకుంటారు. ఆ తర్వాత మొదలయ్యే పరిణామాలు ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తాయి. రీడ్ వారిని తన ఇంట్లో బంధించి, వారి నమ్మకాలను పరీక్షించే ప్రమాదకరమైన ఆటలోకి లాగుతాడు. అతను వేసే ప్రశ్నలు, చేసే వాదనలు, సృష్టించే భయానక పరిస్థితుల నుంచి బయటపడేందుకు ఆ యువతులు తీవ్రంగా ప్రయత్నిస్తారు.

‘హెరెటిక్’లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది దాని కథనమే. సాధారణ హారర్ సినిమాల మాదిరిగా కేవలం దెయ్యాలు, వింత ఆకారాలు, ఆకస్మిక శబ్దాలపై ఆధారపడకుండా.. మనిషి ఆలోచనలు, భయాలు, విశ్వాసాలను కథలో భాగం చేశారు. మిస్టర్ రీడ్ తన వాదనలతో యువతులను మానసికంగా ఒత్తిడికి గురిచేస్తుంటాడు. అతని మాటల్లోని నిజానిజాలను అర్థం చేసుకోవడం, అతను సృష్టించిన ప్రమాదకర పరిస్థితుల నుంచి బయటపడటం వారికి సవాలుగా మారుతుంది.  సుమారు 50 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ‘హెరెటిక్’ ప్రపంచవ్యాప్తంగా మంచి వసూళ్లు సాధించింది. భారత కరెన్సీలో దీని నిర్మాణ వ్యయం సుమారు రూ.415 కోట్లకు సమానం. ప్రపంచవ్యాప్తంగా సుమారు 60 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ హాలీవుడ్ హారర్ థ్రిల్లర్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us