AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Oppenheimer OTT: ఓటీటీలోకి హాలీవుడ్ సూపర్‌ హిట్‌ మూవీ.. ఓపెన్‌ హైమర్‌ స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

ఈ ఏడాది హాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ఓపెన్‌ హైమర్‌ రికార్డు సృష్టించింది. భారతదేశంలోనూ ఈ హాలీవుడ్‌ మూవీకి భారీ కలెక్షన్లు వచ్చాయి. అదే సమయంలో ఇండియాలో ఈ సూపర్‌ హిట్ సినిమాపై విమర్శలు వచ్చాయి. సినిమాలో భగవద్గీతను కించ పరిచే సన్నివేశాలున్నాయంటూ పలువురు ప్రముఖులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలా థియేటర్లలో సెన్సేషన్‌ సృష్టించిన ఓపెన్‌ హైమర్‌ ఇప్పుడు డిజిటల్‌ స్ట్రీమింగ్‌ కు సిద్ధమైంది

Oppenheimer OTT: ఓటీటీలోకి హాలీవుడ్ సూపర్‌ హిట్‌ మూవీ.. ఓపెన్‌ హైమర్‌ స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
Oppenheimer Movie
Basha Shek
|

Updated on: Nov 09, 2023 | 5:55 PM

Share

ప్రముఖ హాలీవుడ్‌ దర్శకుడు క్రిస్టోఫర్‌ నోలన్‌ తెరకెక్కించిన చిత్రం ఓపెన్‌ హైమర్‌. అణుబాంబును క‌నిపెట్టిన శాస్త్రవేత్త ఓపెన్‌హైమ‌ర్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ఈ ఏడాది జులై 21న థియేటర్లలో విడుదలైన ఓపెన్‌ హైమర్‌ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఈ ఏడాది హాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ఓపెన్‌ హైమర్‌ రికార్డు సృష్టించింది. భారతదేశంలోనూ ఈ హాలీవుడ్‌ మూవీకి భారీ కలెక్షన్లు వచ్చాయి. అదే సమయంలో ఇండియాలో ఈ సూపర్‌ హిట్ సినిమాపై విమర్శలు వచ్చాయి. సినిమాలో భగవద్గీతను కించ పరిచే సన్నివేశాలున్నాయంటూ పలువురు ప్రముఖులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలా థియేటర్లలో సెన్సేషన్‌ సృష్టించిన ఓపెన్‌ హైమర్‌ ఇప్పుడు డిజిటల్‌ స్ట్రీమింగ్‌ కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో నవంబర్‌ 21 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు మేకర్స్‌. కాగా గురువారం (నవంబర్‌ 09) కొన్ని పైరసీ సైట్స్‌లో ఓపెన్‌ హైమర్‌ సినిమా హెచ్‌ డీ వెర్షన్‌ ప్రింట్‌ దర్శనమివ్వడం హాట్‌ టాపిక్‌గా మారింది. అందుకే అధికారికంగా ఓటీటీ రిలీజ్‌ డేట్‌ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

ఓపెన్ హైమ‌ర్ సినిమాలో సిలియ‌న్ మ‌ర్ఫీ, రాబ‌ర్ట్ డౌనీ జూనియ‌ర్‌, మాట్ డామ‌న్ కీల‌క పాత్ర‌లు పోషించారు. అణుబాంబును క‌నిపెట్ట‌డంలో ఓపెన్‌హైమర్ ఎదుర్కొన్న మానసిక సంఘ‌ర్ష‌ణ‌, అత‌నికి ఎదురైన ఒత్తిడుల‌ను ఈ సినిమాలో చక్కగా చూపించారు క్రిస్టోఫ‌ర్ నోల‌న్‌. అలాగే సిలియన్‌ మర్ఫీ నటన కూడా అందరినీ ఆకట్టుకుంది. అయితే ఇంగ్లిష్ తో పాటు తెలుగులో కూడా ఈ మూవీ ఓటీటీలోకి వస్తుందా? లేదా? అన్నది ఇంకా క్లారిటీ లేదు. అయితే ఓటీటీ వెర్షన్ కచ్చితంగా సబ్ టైటిల్స్ ఉంటాయి కాబట్టి పెద్దగా ప్రాబ్లమ్ ఉండదు. మరి థియేటర్లలో ఓపెన్‌ హైమర్‌ సినిమాను మిస్‌ అయ్యారా? ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

నవంబర్ 21 నుంచి అందుబాటులోకి..

అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్..

ఓపెన్‌ హైమర్‌ ట్రైలర్..

Follow Us
ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు.. ఈజీగా కమ్మగా ఈ లంచ్ చేసి పెట్టండి
ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు.. ఈజీగా కమ్మగా ఈ లంచ్ చేసి పెట్టండి
సుధీర్ పై సృష్టి చెత్త పని.. చప్పట్లు కొట్టి సంతోషపడిన శకుని..
సుధీర్ పై సృష్టి చెత్త పని.. చప్పట్లు కొట్టి సంతోషపడిన శకుని..
పెళ్లితోనే ఈ రాశుల వారి దశ తిరిగిపోతోంది.. అదృష్టం తలుపు తడుతుంది
పెళ్లితోనే ఈ రాశుల వారి దశ తిరిగిపోతోంది.. అదృష్టం తలుపు తడుతుంది
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవులు
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవులు
తగ్గుతున్న బంగారం ధరలు.. హైదరాబాద్, విజయవాడలో తులం ఎంతుందంటే..?
తగ్గుతున్న బంగారం ధరలు.. హైదరాబాద్, విజయవాడలో తులం ఎంతుందంటే..?
చాలా తక్కువ ధరలో కారు, ఇంటిని శుభ్రం చేసుకోవాలా?
చాలా తక్కువ ధరలో కారు, ఇంటిని శుభ్రం చేసుకోవాలా?
స్టూడెంట్స్, ఉద్యోగులకు బడ్జెట్ ల్యాప్‌టాప్.. ధర ఎంతంటే
స్టూడెంట్స్, ఉద్యోగులకు బడ్జెట్ ల్యాప్‌టాప్.. ధర ఎంతంటే
ఇంట్లోనే డీజే ఫీల్.. Ampnova పార్టీ స్పీకర్
ఇంట్లోనే డీజే ఫీల్.. Ampnova పార్టీ స్పీకర్
కవలలు మేలో పుట్టారు..కానీ బర్త్‌డే జూన్‌లో? UPSC ఇంటర్వ్యూ ప్రశ్న
కవలలు మేలో పుట్టారు..కానీ బర్త్‌డే జూన్‌లో? UPSC ఇంటర్వ్యూ ప్రశ్న
రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో గుడ్‌న్యూస్
రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో గుడ్‌న్యూస్