
ఇప్పుడు వస్తున్న సినిమాలు ఓటీటీలను కూడా దృష్టిలో పెట్టుకోని తెరకెక్కిస్తున్నారు దర్శక నిర్మాతలు. కొన్ని సినిమాలు థియేటర్స్ లో ఫ్లాప్ అయినా కూడా ఓటీటీల్లో విడుదలై సంచలన విజయాలను అందుకుంటున్నాయి. అలాగే కొన్ని సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీల్లో రిలీజ్ అయ్యి మంచి విజయాలను అందుకుంటున్నాయి. ఓటీటీల్లో ఎక్కువగా ట్రెండ్ అయ్యే సినిమాల్లో హారర్, థ్రిల్లర్, రొమాంటిక్ సినిమాలే ఎక్కువ ఉంటాయి. ఆడియన్స్ కూడా ఇలాంటి సినిమాలే చూడటానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. దాంతో దర్శక నిర్మాతలు ఇలాంటి సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కాగా ఇప్పుడు మనం కొన్ని థ్రిల్లర్ సినిమాల గురించి మాట్లాడుకుందాం..! ఈ సినిమాలు క్రైమ్ థ్రిల్లర్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కించారు. అంతే కాదు ఈ సినిమాలు సంచలన విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు ఓటీటీని ఊపేస్తున్నాయి.
ప్రస్తుతం ఓటీటీలో ఉన్న బెస్ట్ థ్రిల్లర్ సినిమాల్లో మొదటిగా చెప్పుకోవాల్సింది.. సెక్టార్ 36:2006 సినిమా గురించి ఈ సినిమా నిజజీవిత ఘటన ఆదారంగా తెరకెక్కించారు. ఒక నగరంలో చిన్న పిల్లలు వరుసగా కనిపించకుండా పోతుంటారు. మొదట ఈ కేసులను పోలీసులు పెద్దగా పట్టించుకోరు. కానీ మిస్సింగ్ కేసులు పెరుగుతుండటంతో ఒక పోలీస్ ఆఫీసర్ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తాడు ఆతర్వాత ఏం జరిగింది ఎలాంటి నిజాలు బయటపడ్డాయి అనే డి కథ.. ఈ సినిమా నెట్ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.
అలాగే రెండో సినిమా మండల మర్డర్స్.. ఒక చిన్న పట్టణంలో వరుసగా భయంకరమైన హత్యలు జరుగుతుంటాయి. ప్రతి మర్డర్ ఒక ప్రత్యేకమైన ప్యాటర్న్‌లో జరుగుతుంది. శవాల దగ్గర కొన్ని గుర్తులు వదిలి వెళ్తారు. ఇవి ఒక రకంగా మండల ఆకారాలను పోలి ఉంటాయి. ఆ హత్యలను ఓ పోలీస్ ఆఫీసర్ దర్యాప్తు చేస్తుంటాడు. ప్రతి హత్యకు లింక్ ఉంటుందని కనిపెడతాడు. ఆతర్వాత ఏం జరిగింది.? ఆ హత్యలు చేసేది ఎవరు అనేది సినిమాలోనే చూడాలి.. ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.
మరో సినిమా దల్దల్.. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ డ్రామా.. ఒక సాధారణ మనిషి (హీరో) తన కుటుంబంతో సాదాసీదా జీవితం గడుపుతుంటాడు. కానీ ఒక రోజు అతను అనుకోకుండా ఒక క్రైమ్‌లో ఇరుక్కుపోతాడు .అది మర్డర్ కేసు. దాని నుంచి అతను ఎలా బయట పడ్డాడు.? ఆశకు ఆ హత్య చేసింది ఎవరు.? అనేది కథ. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది.
మరో సినిమా జానే జాన్.. ఈ సినిమా మిస్టరీ థ్రిల్లర్. మాయా అనే సింగిల్ మదర్ తన కుమార్తెతో ప్రశాంతంగా జీవిస్తుంది. ఆమె గతాన్ని దాచిపెట్టి కొత్త జీవితం మొదలుపెడుతుంది. ఒక రోజు ఆమెకు చాలా ప్రమాదకరమైన పరిస్థితి వస్తుంది. ఆమె ఎక్స్-హస్బండ్ అకస్మాత్తుగా తిరిగి వస్తాడు. అతను చెడ్డవాడు. ఓ రోజు గొడవలో అతను చనిపోతాడు. అది యాక్సిడెంటా లేదా మర్డరా అన్నది పెద్ద ప్రశ్నగా మారుతుంది. దాని నుంచి ఆమె ఎలా తప్పించుకుంది అన్నది సినిమా కథ.. ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.
అలాగే మరో ఇంట్రెస్టింగ్ సినిమా మెర్రీ క్రిస్మస్. ఈ సినిమా కథ క్రిస్మస్ ఈవ్ రోజున జరుగుతుంది. అల్బర్ట్ (విజయ్ సేతుపతి) చాలా సంవత్సరాల తర్వాత నగరానికి తిరిగి వస్తాడు. ఆ రోజు అతను మరియా (కత్రినా కైఫ్) అనే మహిళను కలుస్తాడు. ఆమె తన చిన్న కూతురితో జీవిస్తోంది. వాళ్లు యాదృచ్ఛికంగా కలుసుకుని, రాత్రంతా కలిసి గడుపుతారు. మాట్లాడుకుంటారు, నగరంలో తిరుగుతారు. ఇద్దరి మధ్య ఒక విచిత్రమైన కనెక్షన్ ఏర్పడుతుంది. కాగా మరియా ఇంటికి వెళ్లిన తర్వాత ఒక మర్డర్ జరిగిందని తెలుస్తుంది. ఆ మృతుడు మరియా జీవితంతో సంబంధం ఉన్న వ్యక్తి (ఆమె భర్త). ఇక్కడి నుంచి కథ పూర్తిగా మిస్టరీగా మారుతుంది. అసలు ఏం జరిగింది ఆ హత్య చేసింది ఎవరు అనేది సినిమాలో చూడాలి. ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి