AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఇప్పటిదాకా ఇలాంటి సినిమాను చూసి ఉండరు.. ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్

గత వారం ఓటీటీలోకి వచ్చిన ఈ తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంటోంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఓటీటీ టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సైతం ఈ సినిమాను చూసి ఫిదా అయ్యారు.

OTT Movie: ఇప్పటిదాకా ఇలాంటి సినిమాను చూసి ఉండరు.. ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్
OTT Movie
Basha Shek
|

Updated on: Jul 05, 2026 | 11:39 AM

Share

గత వారం ఓటీటీలోకి పలు సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చాయి. అబ్సెషన్, మాలీవుడ్ టైమ్స్, వంటి సినిమాలతో పాటు సూపర్ సుబ్బు, ఇసకపట్నం, మర్మదేశం వంటి ఆసక్తికరమైన వెబ్ సిరీస్ లు డిజిటల్ స్ట్రీమింగ్ పై సందడ చేస్తున్నాయి. అయితే వీటితో పాటు ఓటీటీలోకి వచ్చిన ఒక తెలుగు సినిమా ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంటోంది. వైవిధ్యమైన కథాంశంతో, సమాజంలో పెద్దగా ఎవరికీ తెలియని ఒక వృత్తి నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఈ సినిమాను చూసి ఫిదా అయ్యాడు. సినిమా సూపర్బ్ గా ఉంది ‘వావ్’ అంటూ రివ్యూ కూడా ఇచ్చాడు. ప్రశంసలకు తగ్గట్టుగానే ఈ సినిమా స్టోరీ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. జైళ్లలో మరణ శిక్ష పడ్డ ఖైదీలను ఉరి తీసే ‘తలారి’ జీవితం ఎలా ఉంటుంది? ఒక ప్రాణాన్ని తీసేటప్పుడు అతను ఎలాంటి మానసిక సంఘర్షణకు లోనవుతాడు? ఉరి తీయడానకి అతను ఎలా సంసిద్ధమవుతాడు? అనే ఆసక్తికర అంశాలను ఇందులో చక్కగా చూపించారు డైరెక్టర్. అలాగే తన కుమారుడికి కూడా ఈ తలారి వృత్తిని ఎలా నేర్పించాడన్నది ఈ సినిమాలో హైలెట్ గా నిలిచింది.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం ఓటీటీ టాప్ ట్రెండింగ్ లో రన్ అవుతోన్న ఈ సినిమా పేరు హ్యాంగ్ మ్యాన్ (Hang Man). సీనియర్ నటుడు బ్రహ్మాజీ ఇందులో ప్రధాన పాత్ర పోషించారు. అనుకోని కారణాలతో థియేటర్లలో రిలీజ్ కాని ఈ సినిమాను డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ చేశారు. శుక్రవారం డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసిన మూవీ ట్రెండ్ అవుతోంది. బ్రహ్మాజీతో పాటు బన్నీ అభిరాన్, వినయ్ నల్లకడి తదితరులు కీలకపాత్రలు పోషించారు. విహాన్ దర్శకత్వం వహించారు. క్లోరో ఫిల్మ్ పిక్చర్స్, డార్క్ హార్స్ విజువల్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. ప్రస్తుతం హ్యాంగ్ మ్యాన్ సినిమా సన్ నెక్ట్స్ ఓటీటీలో టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది.

సన్ నెక్ట్స్ ఓటీటీలో బ్రహ్మాజీ హ్యాంగ్ మ్యాన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఘనంగా గాంధీ, శాస్త్రి జయంతి.. ప్రధాని మోదీ నివాళులు
ఘనంగా గాంధీ, శాస్త్రి జయంతి.. ప్రధాని మోదీ నివాళులు
కలలో మెట్లు ఎక్కుతున్నారా? దిగుతున్నారా? స్వప్న శాస్త్రం చెప్పే..
కలలో మెట్లు ఎక్కుతున్నారా? దిగుతున్నారా? స్వప్న శాస్త్రం చెప్పే..
కీళ్ళ నొప్పులు ఎంతకీ తగ్గడం లేదా? ఇవి తింటే పూర్తిగా మాయం
కీళ్ళ నొప్పులు ఎంతకీ తగ్గడం లేదా? ఇవి తింటే పూర్తిగా మాయం
శంషాబాద్ నుంచి కడప వెళ్తున్న విమానంలో కలకలం..!
శంషాబాద్ నుంచి కడప వెళ్తున్న విమానంలో కలకలం..!
తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు.. వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు.. వెదర్ రిపోర్ట్
ఉడకబెట్టిన గుడ్లు ఎంతసేపు బయట ఉంచవచ్చు? నిపుణుల సూచనలు!
ఉడకబెట్టిన గుడ్లు ఎంతసేపు బయట ఉంచవచ్చు? నిపుణుల సూచనలు!
గుండె వేగం, నిద్ర.. వెల్‌నెస్ బ్యాండ్ ప్రత్యేకతలు ఇవే
గుండె వేగం, నిద్ర.. వెల్‌నెస్ బ్యాండ్ ప్రత్యేకతలు ఇవే
అంకిత భకత్‌, కీర్తి, కుంకుమ్‌ దుమ్మురేపారు.. భారత్‌కు మరో గోల్డ్
అంకిత భకత్‌, కీర్తి, కుంకుమ్‌ దుమ్మురేపారు.. భారత్‌కు మరో గోల్డ్
అడ్వెంచర్ స్కూటర్ కోసం ఎదురుచూస్తున్న వారికి షాక్
అడ్వెంచర్ స్కూటర్ కోసం ఎదురుచూస్తున్న వారికి షాక్
అల్ట్రా వయోలెట్ షాక్వేవ్ ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ ఎప్పుడు?
అల్ట్రా వయోలెట్ షాక్వేవ్ ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ ఎప్పుడు?