AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: అమ్మాయిని ముట్టుకుంటే షాక్.. అప్పుడే OTTలో తిరువీర్, ఐశ్వర్యరాజేష్‌ కొత్త సినిమా..అధికారిక ప్రకటన

సాధారణంగా థియేటర్లలో రిలీజైన నాలుగైదు వారాల తర్వాతే ఓటీటీలోకి వస్తుంటాయి సినిమాలు. అయితే ఈ మధ్యన కొన్ని సినిమాలు మరీ మూడు వారాలకే డిజిటల్ స్ట్రీమింగ్ పై సందడి చేస్తున్నాయి. అలా ఐశ్వర్యారాజేష్, తిరువీర్ నటించిన రీసెంట్ సినిమా కేవలం 21 రోజులకే ఓటీటీలోకి వచ్చేస్తోంది.

OTT Movie: అమ్మాయిని ముట్టుకుంటే షాక్.. అప్పుడే OTTలో తిరువీర్, ఐశ్వర్యరాజేష్‌ కొత్త సినిమా..అధికారిక ప్రకటన
Oh Sukumari Movie
Basha Shek
|

Updated on: Aug 04, 2026 | 6:08 PM

Share

యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో తిరువీర్, తెలుగమ్మాయి ఐశ్వర్యా రాజేష్ జంటగా నటించిన లేటెస్ట్ సినిమా ‘ఓ సుకుమారి’. నూతన దర్శకుడు భరత్ దర్శన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జులై 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాలతో రిలీజైన ఈ సినిమా ఓ మోస్తరుగా ఆడింది. ‘హీరోయిన్ ను ముట్టుకుంటే కరెంట్ షాక్’అనే కాన్సెప్ట్ బాగానే ఉన్నా దానిని వినోదాత్మకంగా తెరకెక్కించడంలో దర్శకుడు తడబడ్డాడు. దీంతో ఈ సినిమా కేవలం యావరేజ్ రిజల్ట్ తోనే సరిపెట్టుకుంది. అయితే ఈ మధ్యన థియేటర్లలో ఆడని సినిమాలు ఓటీటీలో అదరగొడుతున్నాయి. సిల్వర్ స్క్రీన్ పై సౌండ్ చేయని సినిమాలు సైతం డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ పై భారీ వ్యూస్ తెచ్చుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ఓ సుకుమారి సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తోంది.

ఓ సుకుమారి సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ విలేజ్ కామెడీ ఎంటర్ టైనర్ ఓటీటీ స్ట్రీమింగ్ కు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడింది. ఆగస్టు 07 నుంచి ఐశ్వర్య, తిరువీర్ ల సినిమా ఓటీటీలోకి రానుంది. ఈ మేరకు పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. తెలుగుతో పాటు కన్నడ, మలయాళం, తమిళ భాషల్లోనూ ఈ సినిమా అందుబాటులోకి రానుంది.  గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మహేశ్వర్ రెడ్డి మూలి ఈ సినిమాను నిర్మించారు. ఝాన్సీ, మురళీధర్ గౌడ్, ఆనంద్, ఆమని, శ్రీనివాస్ గవిరెడ్డి లాంటి సీనియర్ నటీనటులు ఈ మూవీలో కీలక పాత్రలు పోషించారు. భరత్ మంచీరాజు సంగీతం అందించారు. మరి థియేటర్లలో పెద్దగా ఆడని ఓ సుకుమారి ఓటీటీలో ఏ మేర ఆకట్టుకుంటుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

అమెజాన్ ప్రైమ్ లో ఓ సుకుమారి సినిమా..

ఓ సుకుమారి సినిమా ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!