72వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌పై కీలక అప్డేట్.. ఫ్యాన్స్‌కు నిరాశ!

72nd National Film Awards 2026: 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల కోసం దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ కేంద్రం షాకిచ్చింది. కల్కి 2898 AD, దేవర, బ్రహ్మయుగం, మంజుమ్మెల్ బాయ్స్ వంటి చిత్రాలతో పాటు పలువురు స్టార్ నటులు కూడా అవార్డుల రేసులో ఉన్నట్లు అంచనాలు ఉన్నాయి.

72వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌పై కీలక అప్డేట్.. ఫ్యాన్స్‌కు నిరాశ!
72nd National Film Awards 2

Updated on: Jul 03, 2026 | 5:21 PM

భారతీయ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన వాయిదా పడింది. భారతీయ సినీ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఈ అవార్డుల విజేతలను కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ప్రకటించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పింది. కానీ, చివరి నిమిషంలో అవార్డుల ప్రకటన వాయిదా వేసింది. అందుకు గల కారణాలు తెలియరాలేదు. అయితే కొత్త ప్రకటన తేదీని కూడా కేంద్ర వెల్లడించలేదు.

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) నుంచి సర్టిఫికేషన్ పొందిన చిత్రాలు 72వ జాతీయ చలనచిత్ర అవార్డులకు అర్హత సాధించాయి. ప్రతి ఏడాది మాదిరిగానే ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, సాంకేతిక విభాగాలు సహా పలు కేటగిరీల్లో ప్రతిభ కనబరిచిన సినిమాలు, కళాకారులను ఈ అవార్డులతో సత్కరిస్తారని సినీ అభిమానులు భావించారు. ఈ ఏడాది ఎంపిక ప్రక్రియను ప్రముఖ దర్శకుడు జయరాజ్ నేతృత్వంలోని 11 మంది సభ్యులతో కూడిన జ్యూరీ నిర్వహించింది. వివిధ భారతీయ భాషలకు చెందిన చిత్రాలను సమగ్రంగా పరిశీలించిన అనంతరం విజేతలను ఖరారు చేసినట్లు సమాచారం. కానీ వాటిని ప్రకటించలేదు. ఈ వాయిదాతో సినీ అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us