ఎన్టీఆర్, చెర్రీ కాంబోలో మరో మల్టీస్టారర్.. డైరక్టర్ ఎవరంటే..!

ఎన్టీఆర్, చెర్రీ కాంబోలో మరో మల్టీస్టారర్.. డైరక్టర్ ఎవరంటే..!

టాలీవుడ్ టాప్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో ఆర్ఆర్ఆర్‌(రౌద్రం రణం రుధిరం) అనే క్రేజీ మల్టీస్టారర్‌ను తెరకెక్కిస్తున్నారు దర్శకధీరుడు రాజమౌళి. ఈ ప్రాజెక్ట్‌ను ప్రకటించినప్పటి నుంచీ..

TV9 Telugu Digital Desk

| Edited By: Pardhasaradhi Peri

Apr 13, 2020 | 3:37 PM

టాలీవుడ్ టాప్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో ఆర్ఆర్ఆర్‌(రౌద్రం రణం రుధిరం) అనే క్రేజీ మల్టీస్టారర్‌ను తెరకెక్కిస్తున్నారు దర్శకధీరుడు రాజమౌళి. ఈ ప్రాజెక్ట్‌ను ప్రకటించినప్పటి నుంచీ.. ఈ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా..! అని ఈ ఇద్దరి ఫ్యాన్స్‌తో పాటు సాధారణ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అన్నీ కుదిరి ఉంటే ఈ ఏడాదే ఈ క్రేజీ ప్రాజెక్ట్ ప్రేక్షకుల ముందుకు వచ్చేది. అయితే ఈ ప్రాజెక్ట్‌కు రాజమౌళి దర్శకుడు కావడంతో.. అందరూ ఊహించినట్లుగానే విడుదల వచ్చే ఏడాది జనవరికి వాయిదా పడింది. ఇక ఇప్పుడు కరోనా నేపథ్యంలో ఈ మూవీ విడుదల మరోసారి వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదంతా పక్కనపెడితే ఆర్ఆర్ఆర్‌ తరువాత మరోసారి ఎన్టీఆర్, చెర్రీ కలిసి నటించబోతున్నట్లు ప్రస్తుతం టాలీవుడ్‌లో టాక్‌ నడుస్తోంది.

ఈ ఇద్దరితో ఓ సినిమాను తెరకెక్కించాలని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ ప్లాన్ చేస్తున్నారట. ఈ ఏడాది అల వైకుంఠపురములో మూవీతో మరో సక్సెస్‌ను ఖాతాలో వేసుకున్న త్రివిక్రమ్‌.. నెక్ట్స్ ప్రాజెక్ట్‌గా ఎన్టీఆర్‌తో అయినను పోయి రావలె హస్తినకు అనే మూవీని తెరకెక్కించనున్నారు. ఈ మూవీ తరువాత ఎన్టీఆర్, చెర్రీలతో ఆయన ఓ మల్టీస్టారర్‌ను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నట్లు టాక్‌. ఇక ఈ ప్రాజెక్ట్‌ను రెండు భారీ నిర్మాణ సంస్థలు నిర్మించబోతున్నట్లు సమాచారం. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

Read This Story Also: ఆ న్యూస్ ఫేక్.. ఏపీకి చెందిన వైరల్‌ వీడియోపై తెలంగాణ ఫాక్ట్‌చెక్‌ క్లారిటీ..!

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu