Bathukamma Song : యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న మంగ్లీ కొత్త బతుకమ్మ పాట.. గంటల్లోనే లక్షకు పైగా వ్యూస్..

తెలంగాణ పూల పండుగ బతుకమ్మ సంబరాల వేళ మంగ్లీ విడుదల చేసిన కొత్త పాట యూట్యూబ్‌ను ఊపేస్తోంది. విడుదలైన కేవలం 4 గంటల్లోనే లక్షకు పైగా వ్యూస్ సాధించి సోషల్ మీడియాలో రికార్డు సృష్టిస్తోంది. అద్భుతమైన విజువల్స్, మంత్రముగ్ధమైన గాత్రంతో ఈ పాట పండుగ శోభను రెట్టింపు చేస్తూ నెట్టింట ట్రెండింగ్‌లో నిలిచింది.

Bathukamma Song : యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న మంగ్లీ కొత్త బతుకమ్మ పాట.. గంటల్లోనే లక్షకు పైగా వ్యూస్..
Bathukamma Song

Updated on: Oct 09, 2026 | 1:02 PM

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు రూపం బతుకమ్మ పండుగ. పూల పండుగగా ప్రసిద్ధి చెందిన బతుకమ్మ సంబరాలు వచ్చాయంటే చాలు.. ఊరూ వాడా అంతా జానపద స్వరాలతో మారుమోగిపోతుంది. ముఖ్యంగా ప్రముఖ జానపద గాయని మంగ్లీ పాడే బతుకమ్మ పాటల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ప్రతి ఏటా తన మంత్రముగ్ధమైన గొంతుతో కొత్త బతుకమ్మ పాటను తీసుకొచ్చే మంగ్లీ.. ఈ ఏడాది కూడా సరికొత్త బతుకమ్మ పాటతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మంగ్లీ ఆలపించిన ఈ నయా బతుకమ్మ పాట యూట్యూబ్‌లో విడుదలైన అతి తక్కువ సమయంలోనే విశేష ప్రజాదరణ పొందుతోంది. పాట విడుదలైన కేవలం 4 గంటల్లోనే 1 లక్షకు పైగా వ్యూస్‌ సాధించి సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. జానపద శైలిలో సాగే మధురమైన స్వరాలు, ఆకట్టుకునే సాహిత్యం, అద్భుతమైన విజువల్స్‌తో కూడిన ఈ పాట వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

కేవలం గాత్రంతోనే కాకుండా విజువల్ పరంగా కూడా ఈ పాటను ఎంతో కన్నుల పండువగా చిత్రీకరించారు. తెలంగాణ పల్లెటూరి వాతావరణం, ప్రకృతి అందాలు, సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతున్న ఆడపడుచులు, బతుకమ్మను పేర్చే విధానం మరియు ఆడే దృశ్యాలను పాటలో ఎంతో అద్భుతంగా చూపించారు. మంగ్లీ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్, ఆమె శైలి పండుగ వాతావరణాన్ని ప్రతింబింబిస్తున్నాయి.

ప్రతి ఏటా మంగ్లీ విడుదల చేసే బతుకమ్మ పాటలు యూట్యూబ్‌లో కోట్లాది వ్యూస్ సాధిస్తుంటాయి. ఈ ఏడాది వచ్చిన పాట కూడా అదే స్థాయిలో ఆదరణ పొందుతూ ట్రెండింగ్‌లో నిలిచింది. పండుగ రోజుల్లో ఈ పాట ప్రతి వీధిలో, బతుకమ్మ ఆడే ప్రతి ప్రాంగణంలో మారుమోగడం ఖాయమని అభిమానులు, సంగీత ప్రియులు కామెంట్స్ చేస్తున్నారు.

ఎక్కువమంది చదివినవి : Krishna Vamsi: ఆ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రాణం పెట్టాడు.. కానీ నాకు ఆ మూవీ నాకు నచ్చలేదు.. కృష్ణవంశీ..

బతుకమ్మ పాట..

ఎక్కువమంది చదివినవి : Babu Mohan: ఆ పాట చూసి చిరంజీవి చెప్పిన మాటలు ఎప్పటికీ మర్చిపోలేను.. బాబూ మోహన్..

Loading...
Unable to load recommendations.
Follow Us